న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

MI vs SRH: వాంఖడెలో మ్యాచ్ గెలిచి సచిన్‌కు బర్త్ డే గిఫ్ట్ ఇస్తారా?

By Nageshwara Rao
IPL MI vs SRH Match 23: Can Mumbai Indians gift Sachin Tendulkar a win at Wankhede Stadium?

హైదరాబాద్: ఐపీఎల్ టోర్నీలో భాగంగా మంగళవారం ముంబై ఇండియన్స్-సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడుతున్నాయి. ఈ సీజన్ ఆరంభంలోనే హ్యాట్రిక్ విజయాలతో మంచి జోరు మీద కనిపించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆ తర్వాత ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలు కావడంతో ఢీలాపడింది.

హైదరాబాద్‌ వేదికగా ఇరు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ ఒక వికెట్‌ తేడాతో ఉత్కంఠభరిత విజయాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండో మ్యాచ్‌లోనూ గెలిచి తిరిగి గెలుపుబాట పట్టాలనే లక్ష్యంతో సన్‌రైజర్స్‌ బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను గాయాల బెడద తీవ్రంగా వేధిస్తోంది.

తీవ్ర ఒత్తిడిలో సన్‌రైజర్స్ హైదరాబాద్

తీవ్ర ఒత్తిడిలో సన్‌రైజర్స్ హైదరాబాద్

జట్టులో కెప్టెన్ కేన్ విలియమ్సన్ మినహా ఎవరూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోతుండటంతో తీవ్ర ఒత్తిడిలో ఉంది. వెన్నునొప్పి కారణంగా.. ఈ మ్యాచ్‌కి ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ దూరమవడం జట్టుని బాధిస్తుండగా.. గాయపడిన ఓపెనర్ శిఖర్ ధావన్, యూసఫ్ పఠాన్ ఆడటంపై ఇంకా స్పష్టత రావడం లేదు. నడుము నొప్పి కారణంగా భువీ ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండడంటూ కెప్టెన్‌ విలియమ్సన్‌ పేర్కొన్నాడు.

 రషీద్‌ ఖాన్‌ తిరిగి పుంజుకునే అవకాశం

రషీద్‌ ఖాన్‌ తిరిగి పుంజుకునే అవకాశం

యూసఫ్‌ పఠాన్‌ కూడా మ్యాచ్‌కు అందుబాటులో ఉండటం అనుమానమేనని, శిఖర్‌ ధావన్ మాత్రం కోలుకున్నాడని భావిస్తున్నామని చెప్పుకొచ్చాడు. ఇక గత రెండు మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమైన రషీద్‌ ఖాన్‌ తిరిగి పుంజుకుంటాడని ధీమా వ్యక్తం చేశాడు. మరోవైపు మనీష్‌ పాండే, వృద్ధిమాన్‌ సాహా కూడా స్వేచ్ఛగా ఆడలేకపోతున్నారు. అయితే కెప్టెన్‌ విలియమ్సన్‌ ఫామ్‌లో ఉండటం జట్టుకు కలిసొచ్చే అంశం.

ముంబై ఇండియన్స్ వరుస ఓటములు

ముంబై ఇండియన్స్ వరుస ఓటములు

ఒకవేళ ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌ ధావన్‌, యూసుఫ్‌ పఠాన్‌ అందుబాటులో ఉంటే సన్‌రైజర్స్‌ మంచి స్కోరు సాధించే అవకాశం ఉంది. మరోవైపు భారీ అంచనాల మధ్య టోర్నీని ఆరంభించిన ముంబై ఇండియన్స్‌ ఈ ఐపీఎల్‌లో పరాజయాల పరంపరను కొనసాగిస్తోంది. ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లాడి ఏకంగా నాల్గింటిలో పరాజయం చవిచూసింది. దీంతో పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది.

 ఢిపెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ముంబై

ఢిపెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ముంబై

ఢిపెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ముంబై.. ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మ్యాచ్‌లలో మినహా మిగతా మ్యాచ్‌లలో అంతగా ఆకట్టుకోలేకపోయింది. మిడిలార్డర్‌లో ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ రాణిస్తున్నా.. మిగతా బ్యాట్స్‌మెన్‌ నుంచి స్థాయికి తగ్గ ప్రదర్శన రావడం లేదు. హిట్టర్లు పొలార్డ్, హార్దిక్ పాండ్య ఇంకా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌లు ఆడలేదు.

డెత్ ఓవర్లలో మ్యాచ్‌ని రక్షించలేకపోతున్న బుమ్రా

డెత్ ఓవర్లలో మ్యాచ్‌ని రక్షించలేకపోతున్న బుమ్రా

అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రస్తుత బ్యాటింగ్ లైనఫ్‌తో పోలిస్తే.. ముంబై జట్టు బ్యాట్స్‌మెన్ మెరుగ్గా రాణిస్తున్నారు. ఈ క్రమంలో సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లోనైనా ముంబయి బ్యాట్స్‌మెన్‌ భారీ ఇన్నింగ్స్‌ ఆడితే ఆ జట్టుకి రెండో విజయం దక్కినట్లే. ఇక బౌలింగ్‌లో స్పిన్నర్‌ మయాంక్‌ మార్కండే, ముస్తాఫిజర్‌ రెహ్మాన్‌ మినహాయించి ఎవరా పెద్దగా రాణించడం లేదు. జస్ప్రీత్ బుమ్రా డెత్ ఓవర్లలో మ్యాచ్‌ని రక్షించలేకపోతున్నారు. వీరిద్దరి నోబాల్స్ బలహీనత ఆ జట్టుని ఓటమి పాలు చేస్తోంది.

Story first published: Tuesday, April 24, 2018, 19:10 [IST]
Other articles published on Apr 24, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X