న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ ఫైనల్: చెన్నైకి టైటిల్‌‌ను దూరం చేసింది రనౌట్లేనా? (వీడియో)

IPL 2019,Final : MS Dhoni Run Out Drama Costs Chennai Super Kings Title ! || Oneindia Telugu
IPL Final: MS Dhoni run out drama costs CSK title - Watch

హైదరాబాద్: చెన్నై సూపర్ కింగ్స్‌కు ఐపీఎల్ టైటిల్‌ను దూరం చేసింది రనౌట్లేనా? అంటే అవుననే అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు. ఈ మ్యాచ్‌లో రెండు రనౌట్లు చెన్నై సూపర్ కింగ్స్ ఓటమికి ప్రధాన కారణమయ్యాయని అంటున్నారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 149 పరుగులు చేసింది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

బుమ్రా బౌన్సర్‌కు రాయుడు ఔట్

బుమ్రా బౌన్సర్‌కు రాయుడు ఔట్

అనంతరం లక్ష్య చేధనకు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ విజయానికి 10 ఓవర్లలో 78 పరుగులు కావాల్సిన దశలో బుమ్రా బౌన్సర్‌కు అంబటి రాయుడు (1) పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే చెన్నైకి కోలుకోలేదని దెబ్బ తగిలిగింది. షేన్ వాట్సన్ కొట్టిన బంతికి రెండో పరుగు తీసే క్రమంలో జట్టు కెప్టెన్ ధోని(2) రనౌటయ్యాడు.

మ్యాచ్‌ని మలుపు తిప్పిన ధోని రనౌట్

ఈ రనౌట్ మ్యాచ్‌ను మలుపు తిప్పింది. హార్దిక్‌ పాండ్యా వేసిన 13వ ఓవర్లో వాట్సన్‌ సింగిల్‌ తీశాడు. ఈ క్రమంలో మలింగ విసిరిన త్రో పాండ్యాను దాటి వెళ్లడంతో రెండో పరుగుకు ప్రయత్నించారు. అయితే, మిడాఫ్‌ నుంచి బంతి అందుకున్న ఇషాన్‌ కిషన్‌ మెరుపు వేగంతో నాన్‌-స్ట్రైక్‌ క్రీజు వైపు నేరుగా వికెట్లను గిరాటేశాడు.

ఔట్‌గా ప్రకటించిన థర్డ్ అంఫైర్

ఔట్‌గా ప్రకటించిన థర్డ్ అంఫైర్

దీంతో ఫీల్డ్ అంఫైర్ దానిని థర్డ్ అంఫైర్‌కు నివేదించాడు. థర్డ్ అంఫైర్ ఈ రనౌట్‌ ఫలితం తేల్చేందుకు చాలా సమయం తీసుకుని చివరకు ధోనీని ఔట్‌గా ప్రకటించాడు. ధోని ఔట్ కావడంతో 8 ఓవర్లలో 68గా ఉన్న సమీకరణం కాస్తా 30 బంతుల్లో 62కి చేరింది. ఈ దశలో షేన్ వాట్సన్‌ మెరుపులతో మళ్లీ పోటీలోకి వచ్చింది.

షేన్ వాట్సన్ రనౌట్

షేన్ వాట్సన్ రనౌట్

మలింగ 16వ ఓవర్‌లో 20 పరుగులు ఇచ్చుకున్నాడు. క్రీజులో దూకుడుగా ఆడుతోన్న డ్వేన్ బ్రావో (15) భారీ సిక్సర్ బాదగా... షేన్ వాట్సన్ హ్యాట్రిక్ ఫోర్లతో హాఫ్ సెంచరీని సాధించాడు. అయితే, ఆఖరి ఓవర్ నాలుగో బంతికి రెండో పరుగు తీసే విషయంలో వాట్సన్ తడబడటం... బంతిని అందుకున్న డికాక్‌, వాట్సన్‌ క్రీజులోకి వచ్చే లోపే వికెట్లను గిరాటేశాడు.

Story first published: Monday, May 13, 2019, 18:15 [IST]
Other articles published on May 13, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X