న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'కుంబ్లే నిరాశకు గురై కాట్రెల్‌ను తీసుకున్నాడు.. 8.5 కోట్లు అవసరం లేదు'

IPL Auction 2020: Gautam Gambhir Feels Anil Kumble Picked Sheldon Cottrell In Desperation

ఢిల్లీ: ఐపీఎల్‌ వేలంలో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ కోచ్ అనిల్‌ కుంబ్లే నిరాశకు గురై వెస్టిండీస్‌ బౌలర్‌ షెల్డాన్‌ కాట్రెల్‌ను తీసుకున్నాడు. కాట్రెల్‌కు 8.5 కోట్లు అవసరం లేదు అని టీమిండియా మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్‌ అభిప్రాయపడ్డాడు. వేలంలో ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు దూకుడు ప్రదర్శించాయి. ముఖ్యంగా ఆసీస్ ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. ఆ తర్వాత వెస్టిండీస్‌ ఆటగాళ్లను కొనేందుకు ఆసక్తి చూపాయి.

'ధోనీని మించిన మరో కెప్టెన్ ఎవరూ ఉండరు''ధోనీని మించిన మరో కెప్టెన్ ఎవరూ ఉండరు'

కాట్రెల్‌కు అంత ధర అవసరం లేదు:

గురువారం జరిగిన వేలంలో కాట్రెల్‌ను పంజాబ్‌ భారీ ధరకు సొంతం చేసుకుంది. కనీస ధర రూ.50 లక్షలు కాగా.. ఏకంగా 17 రెట్లు ఎక్కువ పెట్టి రూ.8.5 కోట్లకు కనుగోలు చేసింది. తాజాగా గంభీర్‌ మాట్లాడుతూ... 'పాట్‌ కమిన్స్‌, క్రిస్‌ మోరిస్‌లు ఇద్దరూ వేరే జట్లకు అమ్ముడయ్యారు. మోరిస్‌ను సొంతం చేసుకోవాలని పంజాబ్‌ తీవ్రంగా ప్రయత్నించింది. కానీ అది సాధ్యపడలేదు. దీంతో అనిల్‌ కుంబ్లే నిరాశకు గురై కాట్రెల్‌ను తీసుకున్నాడు. అతనికి రూ.8.5 కోట్లు ఎక్కువని భావిస్తున్నా' అని అన్నాడు.

పట్టువిడవని కుంబ్లే:

పట్టువిడవని కుంబ్లే:

'కాట్రెల్‌ 145 కి.మీ వేగంతో నిలకడగా బంతులు వేయడం ప్రాక్టీస్ చేయాలి. అతడు వేసే కట్టర్స్‌ మొహాలి పిచ్‌పై అంతగా ప్రభావం చూపించవు' అని గంభీర్‌ పేర్కొన్నాడు. కాట్రెల్‌ కోసం రాజస్థాన్‌ రాయల్స్‌, దిల్లీ క్యాపిటల్స్‌, పంజాబ్‌ పోటీపడ్డాయి. అనిల్ కుంబ్లే పట్టువిడవకుండా అతన్ని సొంతం చేసుకున్నాడు.

మ్యాక్స్‌వెల్‌కు భారీ ధర:

ఆసీస్‌ క్రికెటర్‌ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌కు వేలంలో భారీ ధర పలికింది. అతని కనీస ధర రూ. 2 కోట్లు కాగా.. 10 కోట్లకు పైగా అమ్ముడుపోయాడు. మ్యాక్సీ కోసం పలు ఫ్రాంఛైజీలు పోటీపడగా చివరకూ పంజాబ్‌ రూ. 10. 75 కోట్లకు దక్కించుకుంది. గత పలు సీజన్లలో కింగ్స్‌ పంజాబ్‌ తరఫున ఆడిన మ్యాక్సీ మళ్లీ ఆ జట్టుకు ఆడనున్నాడు.

పంజాబ్ వేలంలో తీసుకున్న ఆటగాళ్లు వీరే:

# మ్యాక్స్‌వెల్‌-రూ. 10.75 కోట్లు

# కాట్రెల్‌-రూ. 8.5 కోట్లు

# క్రిస్‌ జోర్డాన్‌-రూ. 3.0 కోట్లు

# రవి బిష్ణోయ్‌-రూ. 2.0 కోట్లు

# ప్రభుసిమ్రన్‌ సింగ్‌-రూ. 55 లక్షలు

# దీపక్‌ హుడా-రూ. 50 లక్షలు

# జేమ్స్‌ నీషమ్‌-రూ. 50 లక్షలు

# తజిందర్‌ ధిల్లాన్‌-రూ. 20 లక్షలు

# ఇషాన్‌ పోరెల్‌- రూ. 20 లక్షలు

Story first published: Friday, December 20, 2019, 13:59 [IST]
Other articles published on Dec 20, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X