న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చెన్నై సూపర్ కింగ్స్ నుంచి వారిద్దరూ అవుట్ - ధోనీ ఫేవరెట్ ఆల్‌రౌండర్‌కు ఢోకా లేనట్టే

IPL 2023: CSK likely to retain Ravindra Jadeja and to release Chris Jordan and Adam Milne

ముంబై: టీ20 ప్రపంచకప్ 2022 టోర్నమెంట్ తుది అంకానికి చేరుకుంటోంది. సూపర్ 12 మ్యాచ్‌లన్నీ ఒక్కటొక్కటిగా ముగుస్తోన్నాయి. ఎల్లుండితో సూపర్ 12 మ్యాచ్‌లన్నీ ముగుస్తాయి. 9వ తేదీ నుంచి సెమీ ఫైనల్స్ మొదలవుతాయి. ప్రస్తుతం 12 జట్లు సూపర్ 12లో ఆడుతోన్నాయి. ఇందులో ఆరు జట్లు ఇంటిదారి పట్టాల్సి ఉంటుంది. సెమీఫైనల్స్ చేరే అవకాశం నాలుగు జట్లకు మాత్రమే లభిస్తుంది. సెమీ ఫైనల్స్ చేరే జట్టు ఏదనే విషయంపై ఓ స్పష్టత వస్తుంది.

ద్వైపాక్షిక సిరీస్..

ద్వైపాక్షిక సిరీస్..

ఈ నెల 9వ తేదీ నుంచి సెమీ ఫైనల్స్ ఉంటాయి. 13వ తేదీన ఫైనల్‌తో ఈ టోర్నమెంట్ ముగుస్తుంది. దీని తరువాత అన్ని జట్లు కూడా ద్వైపాక్షిక సిరీస్‌లకు సన్నద్ధమౌతాయి. ఆస్ట్రేలియాలో పర్యటిస్తోన్న భారత్ క్రికెట్ జట్టు అటు నుంచి అటే న్యూజిలాండ్‌కు బయలుదేరి వెళ్తుంది. మూడు చొప్పున టీ20, వన్డే ఇంటర్నేషనల్స్ ఆడుతుంది. ఈ నెల 18వ తేదీన ఈ సిరీస్ ఆరంభమౌతుంది. నెలాఖరున ముగుస్తుంది.

ఆక్షన్ కోసం..

ఆక్షన్ కోసం..

అదే సమయంలో ఐపీఎల్ 2023 మినీ వేలంపాటకు సంబంధించిన సందడి ఆరంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. డిసెంబర్‌లో అన్ని ఫ్రాంఛైజీలు ఆక్షన్‌ను నిర్వహించవచ్చు. ఈ నెల 15వ తేదీ నాటికే- ఐపీఎల్‌లో ఆడే 10 ఫ్రాంఛైజీలు తమ జట్టు ప్లేయర్ల వివరాలను అందజేయాల్సి ఉంటుంది. దీనిపై ప్రస్తుతం అన్ని జట్లు కూడా కసరత్తు చేస్తోన్నాయి. అట్టిపెట్టుకునే ప్లేయర్లు, రిలీజ్ చేయదలిచిన వారి పేర్లతో కూడిన జాబితాను సిద్ధం చేస్తోన్నాయి.

సీఎస్‌కేలో భారీ మార్పులు..

సీఎస్‌కేలో భారీ మార్పులు..

ఐపీఎల్‌లో సెకెండ్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్‌గా పేరున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇప్పటికే తమ లిస్ట్‌ను ప్రిపేర్ చేసినట్లు తెలుస్తోంది. దీని ప్రకారం చూసుకుంటే జట్టులో కొన్ని కీలక మార్పులు చేర్పులు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. కేప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సూచనల మేరకు తుది జట్టులో ఈ సవరణలను చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ చేపట్టినట్లు సమాచారం.

రవీంద్ర జడేజా కంటిన్యూ..

రవీంద్ర జడేజా కంటిన్యూ..

చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను అట్టి పెట్టుకోవడానికే ధోనీ మొగ్గు చూపారు. అతన్ని రిలీజ్ చేయడానికి గానీ లైక్ టు లైక్ రీప్లేస్ చేయడానికి గానీ ధోనీ అంగీకరించలేదు. రవీంద్ర జడేజా తరహాలోనే బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించే సత్తా ఉన్న టీమిండియా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ను జట్టులోకి తీసుకోవాలని మొదట చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్‌మెంట్ భావించినప్పటికీ- దీనికి ధోనీ ఒప్పుకోలేదని తెలుస్తోంది.

వారిద్దరూ అవుట్..

వారిద్దరూ అవుట్..

అదే సమయంలో చెన్నై సూపర్ కింగ్స్‌లో కొనసాగుతూ వస్తోన్న పేస్ బౌలర్ క్రిస్ జోర్డాన్, ఆడమ్ మిల్నెలను రిలీజ్ చేయాలని మేనేజ్‌మెంట్ నిర్ణయించింది. వారిద్దరూ ఫామ్‌లో ఉండట్లేదు. మిల్నె కొంతకాలంగా గాయాలతో సతమతమౌతోన్నాడు. ఇంగ్లాండ్ పేస్ బౌలర్ క్రిస్ జోర్డాన్ పెద్దగా ఫామ్‌లో ఉండట్లేదని, అతని స్థానం మరొకరిని తీసుకోవాలని మేనేజ్‌మెంట్ భావిస్తోన్నట్లు చెబుతున్నారు. ఇద్దరు లేదా ముగ్గురు భారత ప్లేయర్లను కూడా సీఎస్‌కే రిలీజ్ చేసే అవకాశాలు లేకపోలేదు.

బంగ్లాదేశ్ ఓడిపోవడం వల్లే భారత్ గెలిచింది..!!

Story first published: Friday, November 4, 2022, 11:18 [IST]
Other articles published on Nov 4, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X