Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బంగ్లాదేశ్ ఓడిపోవడం వల్లే భారత్ గెలిచింది..!!

 Former India player Sunil Gavaskar said that Bangladesh lost the match rather than India Winning.

అడిలైడ్: టీ20 ప్రపంచకప్ 2022లో భారత క్రికెట్ జట్టు మరో ఘన విజయాన్ని అందుకుంది.. అడిలైడ్‌ ఓవల్‌లో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. డక్ వర్త్ లూయిస్ విధానంలో అయిదు పరుగుల తేడాతో గెలిచింది. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఓటమి మిగిల్చిన పరాభవాన్ని బంగ్లాపై తీర్చుకుంది టీమిండియా. తొలుత బ్యాటింగ్‌లో, అనంతరం బౌలింగ్‌లో దమ్ము దులిపింది. ప్లేయర్ల మెరుపు ఫీల్డింగ్- దీనికి బోనస్. ఈ మ్యాచ్‌లో గెలవడం ద్వారా గ్రూప్ 2లో టేబుల్ టాపర్‌గా నిలిచింది.

 ఓవర్లు కుదింపుతో ఆందోళన..

ఓవర్లు కుదింపుతో ఆందోళన..

వర్షం అంతరాయాన్ని కలిగించిన ఈ మ్యాచ్‌లో.. రోహిత్ సేన ఉంచిన లక్ష్యాన్ని ఛేదించడంలో బంగ్లా తడపడింది. వెంటవెంటనే ఆరు వికెట్లను కోల్పోయింది. బంగ్లాదేశ్ ఓపెనర్లు శుభారంభం చేసినప్పటికీ.. దాన్ని కాపాడుకోలేకపోయారు మిగిలిన బ్యాటర్లు. టీమిండియా పేస్ బౌలింగ్ ధాటికి టాప్ ఆర్డర్ కుప్పకూలింది. ఓపెనర్ లిట్టన్ దాస్ ఆడిన మెరుపు ఇన్నింగ్ వృధా అయింది. 27 బంతుల్లో మూడు సిక్సర్లు, ఏడు ఫోర్లతో 60 పరుగులు చేశాడు.

 అయిదు పరుగుల తేడాతో..

అయిదు పరుగుల తేడాతో..

డక్‌వర్త్ లూయిస్ విధానంలో బంగ్లాదేశ్- 16 ఓవర్లల్లో 150 పరుగులు చేయాల్సి ఉండగా.. 145 వద్దే నిలిచిపోయిందా జట్టు ప్రస్థానం. 16 ఓవర్లల్లో ఆరు వికెట్లను కోల్పోయి 145 పరుగులే చేయగలిగింది. ఈ విజయంతో భారత్.. టీ20 ప్రపంచకప్ 2022 సెమీ ఫైనల్స్‌కు మరింత చేరువైంది. ఇంచ్ దూరంలో నిలిచింది. ఇంకో మ్యాచ్ గెలిస్తే- మొత్తం ఎనిమిది పాయింట్లతో సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంటుంది. తన తరువాతి మ్యాచ్‌లో జింబాబ్వేను ఢీ కొట్టబోతోంది రోహిత్ సేన.

బంగ్లా ఓడింది..

బంగ్లా ఓడింది..

భారత్ సాధించిన ఈ విజయంపై లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ స్పందించారు. వర్షం వల్ల బంగ్లాదేశ్ రిథమ్ తప్పిందని వ్యాఖ్యానించారు. వర్షం పడకపోయి ఉంటే- ఏడు ఓవర్లల్లో 66 పరుగులు చేసిన బంగ్లాదేశ్‌ ఖచ్చితంగా మ్యాచ్ గెలిచి ఉండేదని చెప్పారు. ఓవర్‌కు తొమ్మిది కంటే ఎక్కువ పరుగుల చేశారని, చేతిలో 10 వికెట్లు ఉండటంతో స్వేచ్ఛగా ఆడారని కితాబిచ్చారు. వర్షం వల్ల లక్ష్యాన్ని తగ్గించినప్పుడు బంగ్లాదేశ్ బ్యాటర్లు ఒత్తిడికి గురయ్యారని, అదే వారి ఓటమికి దారి తీసిందని సునీల్ గవాస్కర్ విశ్లేషించారు.

దూకుడుగా..

దూకుడుగా..

భారత్‌పై బంగ్లాదేశ్ బ్యాటర్లు స్మార్ట్ క్రికెట్‌కు బదులుగా దూకుడుగా ఆడటానికే ప్రాధాన్యత ఇచ్చారని సునీల్ గవాస్కర్ చెప్పారు. ప్రతి బంతిని సిక్సర్‌గా మలచడానికి, షార్ట్ స్క్వేర్ బౌండరీలను లక్ష్యంగా చేసుకోవడానికి ప్రయత్నించారని అన్నారు. ఆ సమయంలో టీమిండియా బౌలర్లు తెలివిగా బౌలింగ్ చేశారని పేర్కొన్నారు. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిచిందనడం కంటే బంగ్లాదేశ్ ఓడిపోయిందని చెప్పడమే సహేతుకమని అన్నారు. బంగ్లాదేశ్ బ్యాటింగ్‌ చేస్తోన్న సమయంలో భారత బౌలర్లు ఒత్తిడికి గురయ్యారని, తొలి ఏడు ఓవర్లల్లో ఇది స్పష్టంగా కనిపించిందని చెప్పారు.

Story first published: Friday, November 4, 2022, 9:42 [IST]
Other articles published on Nov 4, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+