న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఏదో పొడిచేస్తారనుకుంటే: ముంబై, చెన్నై, కోల్‌కత వరుస పరాజయాల్లో కామన్ పాయింట్ ఇదే

 IPL 2022: What Are The Main Reasons Behind CSK, MI And KKR Losses?

ముంబై: ఐపీఎల్‌ 2022 సీజన్‌ సెకెండ్ హాఫ్‌లోనూ కోల్‌కత నైట్‌రైడర్స్ ఘోర పరాజయాన్ని చవి చూసింది. మరో మ్యాచ్‌లో ఓడింది. ఈ టోర్నమెంట్‌లో ఆ జట్టుకు ఇది వరుసగా అయిదో ఓటమి. ఆరంభంలో కనపరిచిన దూకుడును కోల్పోయింది. కేకేఆర్ పరిస్థితి ఇప్పుడు దయనీయంగా తయారైంది. గురువారం రాత్రి ముంబై వాంఖెడె స్టేడియంలో ఢిల్లీ కేపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చిత్తుగా ఓడింది. ఈ ఓటమితో పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానానికి దిగజారిందీ జట్టు. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్‌కు తోడుగా నిలిచింది.

పాయింట్ల పట్టికలో..

పాయింట్ల పట్టికలో..

ఈ మూడు జట్లు కూడా పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచాయి. ఇప్పటివరకు ఆడిన ఎనిమిదింట్లో ఒక్క మ్యాచ్‌నూ గెలవక పదో స్థానానికి అతుక్కుపోయింది ముంబై ఇండియన్స్. ఆ జట్టు ఖాతాలో ఉన్నవి జీరో పాయింట్స్. అదే ఎనిమిదింట్లో రెండు మ్యాచ్‌లల్లో మాత్రమే గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్- తొమ్మిదో స్థానం నుంచి కదలట్లేదు. కదిలే పరిస్థితులు కూడా దాదాపు లేనట్టే. తొమ్మిది మ్యాచ్‌లల్లో ఆరింట్లో ఓడిన కోల్‌కత నైట్‌రైడర్స్ ఎనిమిదో స్థానానికి దిగజారింది. ఈ మూడింటి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

ఓపెనర్లు అట్టర్ ఫ్లాప్..

ఓపెనర్లు అట్టర్ ఫ్లాప్..

ఈ మూడు జట్ల పరాజయాలకు ఓ సారూప్యత, కామన్ పాయింట్ ఉంది. ఓపెనర్లు అట్టర్ ఫ్లాప్. ముంబై ఇండియన్స్‌లో ఇషాన్ కిషన్, చెన్నై సూపర్ కింగ్స్‌లో రుతురాజ్ గైక్వాడ్ విఫలం అయ్యారు. కోల్‌కత నైట్‌రైడర్స్‌లో వెంకటేష్ అయ్యర్ పరిస్థితీ దాదాపు అంతే. వారు గనక ఓ మోస్తరు ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని అందించి ఉన్నా.. ఈ మూడు జట్ల పరిస్థితులు మరోలా ఉండేవేమో. ముగ్గురూ యంగ్ క్రికెటర్లే. టీమిండియా తరఫున సైతం టీ20 మ్యాచ్‌లను ఆడిన వారే. అయినప్పటికీ- ఈ సీజన్‌లో ముగ్గురికి ముగ్గురూ కూడబలుక్కున్నట్టు విఫలం అవుతున్నారు.

 ఒక్క హాఫ్ సెంచరీతో..

ఒక్క హాఫ్ సెంచరీతో..

వెంకటేష్ అయ్యర్ విఫలమౌతూనే ఉన్నాడు. నిలకడ లోపించింది. ఈ సీజన్‌లో అతను ఒక్క హాఫ్ సెంచరీ చేశాడు. ఎనిమిది కోట్ల రూపాయలతో అతణ్ని జట్టులోనే అట్టి పెట్టుకుంది కేకేఆర్ ఫ్రాంఛైజీ. ఆ నమ్మకానికి తగ్గట్టుగా ఆడట్లేదు. తొమ్మిది మ్యాచ్‌లల్లో అతను చేసింది 132 పరుగులే. 16.50 బ్యాటింగ్ యావరేజ్. స్ట్రైక్ రేట్ కూడా చెప్పుకోదగ్గట్టుగా ఉండట్లేదు. ఈ పరిణామాలు కోల్‌కత బ్యాటింగ్ ఆర్డర్‌పై ప్రభావం చూపుతోంది.

ఇషాన్ కిషన్‌దీ అదే స్థితి..

ఇషాన్ కిషన్‌దీ అదే స్థితి..

ఈ సీజన్ మెగా వేలంపాటలో ముంబై ఇండియన్స్ ఓపెనర్ ఇషాన్ కిషన్ హాట్ కేక్. అతణ్ని జట్టులోకి తీసుకోవడానికి ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, ఇతర ఫ్రాంఛైజీలు పోటీ పడ్దాయి. అతని వేల్యూ 15 కోట్ల రూపాయలను దాటేసింది. ముంబై ఇండియన్స్ అతణ్ని 15.25 కోట్ల రూపాయలతో రిటైన్ చేసుకుంది. ఒక్క మ్యాచ్‌లో మాత్రమే 81 పరుగులతో రాణించాడు. ఎనిమిది మ్యాచ్‌లల్లో 199 పరుగులు చేశాడు. ఇది అతనిపై పెట్టుకున్న అంచనాలకు ఏ మాత్రం అందుకోలేనిది.

 గైక్వాడ్‌ సైతం..

గైక్వాడ్‌ సైతం..

చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ కూడా తన స్థాయికి తగ్గట్లుగా ఆడట్లేదు. ఈ ఇద్దరి తరహాలో అతను కూడా ఒక్క మ్యాచ్‌లో మాత్రమే అర్ధసెంచరీ చేశాడు. 73 పరుగులు చేశాడు. ఆ తరువాత మళ్లీ వరుసగా విఫలమౌతున్నాడు. ఇప్పటివరకు అతను చేసిన పరుగులు 138. బ్యాటింగ్ యావరేజ్ 17.25. స్ట్రైక్ రేట్ 117.95. ఫ్యూచర్ టీమిండియా స్టార్లుగా గుర్తింపు పొందిన ముగ్గురు డాషింగ్ ఓపెనర్లు ఒకే సీజన్‌లో విఫలం కావడం యాదృచ్ఛికం.

Story first published: Friday, April 29, 2022, 14:01 [IST]
Other articles published on Apr 29, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X