న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL Records: బ్రెండన్ మెక్కల్లమ్ తర్వాత.. మళ్లీ 15ఏళ్లకు అలాంటి బ్రాండెడ్ ప్లేయర్‌గా టిమ్ డేవిడ్!

Tim David as the player to maintain more than 200 strike rate in a single season after Brendan McCullum

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022లో ఆడిన 14మ్యాచ్‌లలో కేవలం నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచిన ముంబై ఇండియన్స్‌ అప్రదిష్ట మూటగట్టుకుంది. ముంబైకి ఇది ఓ చేదు సీజన్. ఇకపోతే ముంబై ఈ సీజన్లో తన చివరి మ్యాచ్ శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడి అద్భుతంగా గెలిచింది. రోహిత్ శర్మ నేతృత్వంలోని ముంబై జట్టు ఈ మ్యాచ్‌లో గెలిచి తమ సీజన్‌ను కాస్త గౌరవప్రదంగా ముగించింది. అయితే అయిదు సార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచిన ముంబై పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలవడం మాత్రం నిజంగా అందరినీ విస్మయానికి గురిచేసింది. అయితే ఈ సీజన్లో ముంబై పేలవంగా ఆడినప్పటికీ కొందరు మంచి ప్లేయర్లు ముంబై టీంలో వెలుగుచూశారు. అందులో టిమ్ డేవిడ్ ఒకడు. డేవిడ్ ఆడిన 8మ్యాచ్‌లలో 186పరుగులు చేశాడు. అది కూడా లోయర్ ఆర్డర్లో దిగి ఆ పరుగులు చేశాడు. అలాగే కొన్ని మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. తద్వారా ఈ సీజన్లో ముంబై ఫ్రాంచైజీకి దొరికిన ఓ మంచి ప్లేయర్‌గా టిమ్ డేవిడ్ పేర్కొనబడ్డాడు.

తొలుత పక్కన పెట్టారు

తొలుత పక్కన పెట్టారు

ఇకపోతే ముంబై జట్టు తొలి మ్యాచ్‌లలో అతన్ని ఆడించలేదు. అతను ఆడిన చివరి మ్యాచ్‌లలో 7 మ్యాచ్‌లలో ముంబై నాలుగింట గెలిచింది. అందులో మూడు మ్యాచ్‌లు గెలవడానికి టిమ్ డేవిడే కారణం. తొలి మ్యాచ్‌లలో అతన్ని ఆడించకపోవడంపై కూడా ముంబై ప్రధాన కోచ్ మహేలా జయవర్ధనే కూడా కాస్త ఫీలయ్యాడు. టిమ్ డేవిడ్‌ ఈ సీజన్ మొదట్లో కొంచెం అంతంతమాత్రంగా కన్పించడంతో తీసుకోలేదని, కానీ సీజన్‌ ముగింపు టైంలో అతనిలో ఎంత క్వాలిటీ ఉందో చూపించాడని పేర్కొన్నాడు. ముందు నుంచి ఆడించి ఉంటే కాస్త ముంబైకి బెటర్ పరిస్థితి ఉండేదని అభిప్రాయపడ్డాడు.

ఈ సీజన్లో విధ్వంసక ప్లేయర్‌గా

ఈ సీజన్లో విధ్వంసక ప్లేయర్‌గా

ఇక ఈ సీజన్లో (మినిమం 50బంతులు ఎదుర్కొన్న ప్లేయర్) అత్యుత్తమ స్ట్రైక్ రేట్ నమోదు చేసిన్ ప్లేయర్లలో అతను అగ్రస్థానంలో నిలిచాడు. అతను స్ట్రైక్ రేట్ 216. 27గా నమోదైంది. అంటే ప్రతి బంతికి 2 నుంచి 3పరుగులు నమోదు చేసినట్లు. ఇంతటి స్ట్రైక్ రేట్ ఉందంటే అతను ఎంత హర్డ్ హిట్టరో అర్థం చేసుకోవచ్చు. అతని తర్వాత స్థానాల్లో ఆర్సీబీ ప్లేయర్ దినేష్ కార్తీక్ (191.33), పంజాబ్ ఆల్రౌండర్ లియమ్ లివింగ్ స్టోన్ (182.08), కోల్ కతా ఆల్రౌండర్ ఆండ్రీ రస్సెల్ (174), ఆర్సీబీ ప్లేయర్ గ్లెన్ మ్యాక్స్ వెల్ (172.90) ఉన్నారు.

మెక్కల్లమ్ సరసన చేరిన టిమ్ డేవిడ్

మెక్కల్లమ్ సరసన చేరిన టిమ్ డేవిడ్

ఇక ఈ సీజన్లో తన ఆటతీరుతో ఆకట్టుకున్న టిమ్ డేవిడ్ ఓ అరుదైన ఫీట్ సాధించాడు. ఆ రికార్డు విషయంలో బ్రెండన్ మెక్కల్లమ్ సరసన చేరాడు. (మినిమం 100కంటే ఎక్కువ పరుగులు చేసిన సందర్భంలో) 2008లో ఐపీఎల్ ఆరంభ సీజన్లో బ్రెండన్ మెక్కల్లమ్ 200కంటే స్ట్రైక్ రేట్ మెయింటెన్ చేయగా.. దాదాపు 15ఏళ్ల తర్వాత ఓ ఐపీఎల్ సీజన్లో మళ్లీ టిమ్ డేవిడ్ 200కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ మెయింటెన్ చేసిన ప్లేయర్‌గా నిలిచాడు. ఇక టిమ్ డేవిడ్ ఆడిన 8 మ్యాచ్ ల్లో 37 సగటు కనబరిచాడు. అతని ఇన్నింగ్స్‌లో 12ఫోర్లు, 16సిక్సర్లున్నాయి. అలాగే అతను 114మీటర్ల భారీ సిక్సర్ కొట్టాడు. తద్వారా ఈ సీజన్లో లివింగ్ స్టోన్ (117మీ సిక్సర్) తర్వాత రెండో భారీ సిక్సర్ కొట్టిన ప్లేయర్‌గానూ నిలిచాడు. ఇక ఈ సింగపూర్ ప్లేయర్ వచ్చే సీజన్లో ముంబైకి వరం కావొచ్చు.

Story first published: Tuesday, May 24, 2022, 12:25 [IST]
Other articles published on May 24, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X