న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2022: వరుసగా మూడో ఓటమి.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ చేరాలంటే ఏం చేయాలంటే?

IPL 2022: SRH playoff Qualification Scenario after defeat against Delhi capitals

ఢిల్లీ క్యాపిటల్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్‌లో దారుణంగా విఫలమైన సన్ రైజర్స్ హైదరాబాద్ 21 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇది హైదరాబాద్‌కు వరుసగా మూడో ఓటమి. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 207 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్(58 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స్‌లతో 92 నాటౌట్), రోవ్‌మన్ పోవెల్(35 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స్‌లతో 67 నాటౌట్) విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో చెలరేగారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 186 పరుగులు మాత్రమే చేసింది. నికోలస్ పూరన్(34 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్స్‌లతో 62), ఎయిడెన్ మార్క్‌రమ్(25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 42) రాణించినా ఫలితం లేకపోయింది. ఈ మ్యాచ్‌లో ఓటమితో సన్ రైజర్స్ హైదరాబాద్ పాయింట్ల పట్టికలో 6వ స్థానానికి పడిపోయింది. ఈ మ్యాచ్‌లో గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ 7వ స్థానం నుంచి 5వ స్థానానికి చేరుకుంది. ఇరు జట్లు 10పాయింట్లతో కొనసాగుతున్నప్పటికీ నెట్ రన్ రేట్ విషయంలో తేడా వల్ల ఢిల్లీ క్యాపిటల్స్ 5వ స్థానంలో కొనసాగుతుంది. ఇక ఈ మ్యాచ్‌లో ఓటమి వల్ల సన్ రైజర్స్ ప్లే ఆఫ్ అవకాశాలు ఇంకాస్త సంక్లిష్టం అయ్యాయి. ఇక సన్ రైజర్స్ ప్లేఆఫ్ చేరాలంటే కావాల్సిన పరిస్థితులు ఎలా ఉన్నాయంటే..

మిగిలిన 4 మ్యాచులు కీలకం

మిగిలిన 4 మ్యాచులు కీలకం

ఇక సన్ రైజర్స్ ఇప్పటికే 10మ్యాచ్‌లు ఆడి 5మ్యాచ్‌ల్లో ఓడింది. 5మ్యాచ్‌లు గెలిచింది. ఇంకా నాలుగు మ్యాచ్‌లు సన్ రైజర్స్ ఆడాల్సి ఉంది. ఈ నాలుగు మ్యాచ్‌లు సన్ రైజర్స్‌కు కీలకం. ఇందులో తప్పకుండా 3 మ్యాచ్‌లు గెలిస్తేనే ప్లేఆఫ్ చేరడానికి సన్‌రైజర్స్ కు అవకాశముంటుంది. అలాగే ఒక్క మ్యాచ్‌లో భారీ తేడాతో గెలిస్తే నెట్ రన్ రేట్ మెరుగుపడి మిగతా జట్లతో క్లాష్ కాకుండా ఉంటుంది.

ఎదుర్కోబోయేది కీలక జట్లనే

ఎదుర్కోబోయేది కీలక జట్లనే

సన్ రైజర్స్ కు మిగిలి ఉన్న నాలుగు మ్యాచ్‌ల్లో ముంబై తప్పా ఆర్సీబీ, కేకేఆర్, పంజాబ్ కింగ్స్ మూడు జట్లు ప్లేఆఫ్ రేసు కోసం పోటీలో ఉన్నవే. ఆర్సీబీకి ఇంకా మూడు మ్యాచ్ లు మిగిలి ఉండగా.. 12 పాయింట్లతో ప్రస్తుతం 4వ స్థానంలో కొనసాగుతుంది. కేకేఆర్ ఇంకా నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగా.. ప్రస్తుతం ఆ జట్టు 8 పాయింట్లతో కొనసాగుతోంది. ఇంకా ఒక్క మ్యాచ్ ఓడినా ఆ జట్టు దాదాపు ప్లేఆఫ్ పోటీ నుంచి వైదొలుగుతుంది. అలా జరిగితే సన్ రైజర్స్ కు ప్లస్ అవుతుంది. పంజాబ్ కింగ్స్ కు ఇంకా నాలుగు మ్యాచ్‌లు ఉన్నా నెట్ రన్ రేట్ మైనస్‌లో ఉంది. అందువల్ల ఆ జట్టు ఒక్క మ్యాచ్‌లో ఓడినా దాదాపు ప్లేఆఫ్ నుంచి తప్పుకున్నట్లే. దీన్ని బట్టి కేకేఆర్, పంజాబ్ కింగ్స్ జయాపజయాలు సన్ రైజర్స్ ప్లేఆఫ్ చేరుకోవడానికి చాలా కీలకం.

IPL 2022: RCB vs LSG ; Krishnamachari Srikkanth's opinion on match | Expert View | Oneindia News
అదే జరిగితే ఒక్క స్థానం కోసం నాలుగు జట్లతో

అదే జరిగితే ఒక్క స్థానం కోసం నాలుగు జట్లతో

ఇక ఈ సీజన్లో గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ దాదాపు ప్లేఆఫ్ గడప తొక్కినట్లే. గుజరాత్ 16పాయింట్లు సాధించి టేబుల్ టాపర్‌గా కొనసాగుతుంది. ఇంకో మ్యాచ్ గెలిస్తే అధికారికంగా ప్లేఆఫ్ చేరుతుంది. ఒకవేళ అన్ని మ్యాచ్‌లు ఓడిపోయినా.. గుజరాత్ రన్ రేట్ ప్రకారం.. ప్లేఆఫ్ చేరడం దాదాపు ఖరారే. ఇక లక్నో సైతం 14పాయింట్లతో కొనసాగుతుంది. ఒక్క మ్యాచ్ గెలిచిన ఆ జట్టు ప్లేఆఫ్ చేరినట్లే. రాజస్థాన్ రాయల్స్ సైతం 12పాయింట్లతో ప్లస్ నెట్ రన్ రేట్‌తో కొనసాగుతుంది. ఇక ఆ జట్టు కూడా రెండు మ్యాచ్‌లు గెలిస్తే దాదాపు ఈ మూడు జట్లు ప్లేఆఫ్ ప్రకారం తొలి మూడు జట్లవుతాయి. అప్పుడు మిగిలిన ఒక్క స్థానం కోసం.. సన్ రైజర్స్ నాలుగు జట్లతో పోటీ పడాలి. ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్, కేకేఆర్, పంజాబ్ కింగ్స్, సన్ రైజర్స్ ఒక్క స్థానం కోసం కుస్తీ పట్టాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. నెట్ రన్ రేట్ పెంచుకునేలా ఆడితే తప్పా సన్ రైజర్స్ వీటిని తట్టుకుని ప్లేఆఫ్ చేరడం కష్టమే. అలాగే ఈ జట్ల జయాపజయాలు సన్ రైజర్స్‌కు చాలా అవసరమవుతాయి.

Story first published: Friday, May 6, 2022, 15:12 [IST]
Other articles published on May 6, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X