న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2022 Playoff New Rules: వాన పడితే ప్లేఆఫ్స్, ఫైనల్ ఎలా..? సూపర్ ఓవర్ కూడా రద్దయితే ఏ జట్టుది గెలుపు?

IPL 2022 Playoff Rules: Everything You Need To Know When Rain Interrupts Play And Other Important Rules

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 సీజన్ ముగింపుదశకు వచ్చేసింది. లీగ్ దశలో చిట్టచివరి మ్యాచ్‌ సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ మధ్య నిన్న ముగిసింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 5వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇక మిగిలి ఉంది ప్లేఆఫ్స్ మాత్రమే. ఇకపోతే ఈ సీజన్‌తోనే ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ టేబుల్ టాపర్‌గా నిలవగా రాజస్థాన్ రాయల్స్ రెండు, లక్నో సూపర్ జెయింట్స్ 3, ఆర్సీబీ 4స్థానాల్లో నిలిచి ప్లేఆఫ్ బెర్త్‌లు కన్ఫాం చేసుకున్నాయి. అయితే ప్లేఆఫ్ మ్యాచ్‌లకు వాన ముప్పు పొంచి ఉండడంతో ఒక వేళ మ్యాచ్‌లు జరగకపోతే ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

వర్షం పడితే సూపర్ ఓవరే దిక్కు

వర్షం పడితే సూపర్ ఓవరే దిక్కు

ఐపీఎల్ ప్లేఆఫ్ మ్యాచ్‌లకు, ఫైనల్‌‌కు వర్షం వల్ల ఆటంకం కలిగితే, నిర్ణీత సమయంలో ఆట సాధ్యం కాకపోతే సూపర్ ఓవర్ ద్వారా ఫలితాన్ని నిర్ణయిస్తారు. ఐపీఎల్ రూల్స్ అండ్ రెగ్యూలేషన్స్ ప్రకారం.. వర్షం వల్ల మైదానంలో ఆడలేని పరిస్థితి ఉంటే లీగ్ దశలో మెరుగైన స్థానాలను సాధించిన జట్లు విజేతలుగా నిలుస్తాయి.

ఇకపోతే మే 24న ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే క్వాలిఫయర్ 1లో గుజరాత్ టైటాన్స్ రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుండగా, మరుసటి రోజు ఎలిమినేటర్‌లో లక్నో సూపర్ జెయింట్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో అదే వేదికగా తలపడనుంది. తర్వాత జట్లు అహ్మదాబాద్‌కు తరలివెళతాయి, అక్కడ మే 27న క్వాలిఫైయర్ 2 మ్యాచ్ జరుగుతుంది. మే 29న ఫైనల్ జరుగుతుంది.

ఫైనల్ మ్యాచ్ రాత్రి 8గంటలకు ప్రారంభమవుతుంది. ఫైనల్‌కు అంతరాయం ఏర్పడితే మే 30వ తేదీ రిజర్వ్ డేగా పరిగణించి ఫైనల్ జరుపుతారు. రిజర్వ్ డే కూడా ఆట సాధ్యం కాకపోతే ఫైనల్ ఆడిన జట్లలో ఏ జట్టైతే లీగ్ స్టేజీలో మెరుగైన స్థానంలో ఉంటుందో ఆ జట్టు విజేత అవుతుంది.

అసలు వర్షం పడితే ఏం చేస్తారంటే?

అసలు వర్షం పడితే ఏం చేస్తారంటే?

కోల్‌కతాలో ప్రస్తుతం వాతావరణం వర్షాలు పడేలా ఉండడంతో ఐపీఎల్ యాజమాన్యం ఆయా జట్లకు రూల్స్ అండ్ రెగ్యూలేషన్స్ పంపించింది. వర్షం వల్ల ఆటకు అంతరాయం ఏర్పడితే ఏం జరుగుతుందో పేర్కొంది. ఐపీఎల్లో ప్రతి మ్యాచ్‌కు 200నిమిషాల (3గంటల 20నిమిషాలు) టైం ఇస్తారు. ఇక ప్లేఆఫ్‌లో ఈ 200నిమిషాలకు అదనంగా మరో రెండు గంటల టైం ఇస్తారు. అంటే (5గంటల 20నిమిషాలు).

ఒకవేళ మ్యాచ్ ప్రారంభానికి ముందే వర్షం వల్ల ఆట ఆలస్యమయితే మూడు ప్లేఆఫ్ మ్యాచ్‌లు (క్వాలిఫయర్స్ 1,2, ఎలిమినేటర్) రాత్రి 9.40గంటల వరకు ప్రారంభించొచ్చు. ఫైనల్ మ్యాచ్ రాత్రి 10.10గంటలకు ప్రారంభించొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఓవర్లను కుదించకుండా 20ఓవర్ల మ్యాచ్ జరుగుతుంది. అలాగే స్ట్రాటెజిక్ టైమ్ ఔట్‌లు కూడా ఉంటాయి. ఇన్నింగ్స్ బ్రేక్ టైం సగానికి తగ్గించబడుతుంది.

కనీసం 5-5ఓవర్ల మ్యాచ్ అయినా

కనీసం 5-5ఓవర్ల మ్యాచ్ అయినా

వాన వల్ల మ్యాచ్‌ ఆడే టైం బాగా తగ్గిపోతే.. ప్లేఆఫ్ మ్యాచ్‌ల్లో ఇరు జట్లు అయిదేసి ఓవర్ల చొప్పున ఇన్నింగ్స్ ఆడతాయి. ఇలా ఆడినప్పుడు స్ట్రాటెజిక్ టైం అవుట్లు ఉండవు. ప్లేఆఫ్స్‌లో కనీసం 5-5 ఓవర్ల మ్యాచ్ జరగడానికి 11.56pm వరకు అవకాశం ఉంటుంది. 10నిమిషాల ఇన్నింగ్స్ విరామం కూడా ఇస్తారు. 12.50amలోపు మ్యాచ్ ముగించాలి. వర్షం వల్ల ఒకవేళ ఫైనల్ మ్యాచ్‌ని 5-5ఓవర్ల మ్యాచ్‌‌గా కుదించొల్సి వస్తే 12.26am వరకు అవకాశం ఉంటుంది.

లీగ్ దశలో మంచి పాయింట్లు సాధించిన జట్టే విజేత

లీగ్ దశలో మంచి పాయింట్లు సాధించిన జట్టే విజేత

ఐపీఎల్ నిబంధనల ప్రకారం.. ఎలిమినేటర్, క్వాలిఫైయర్ ప్లేఆఫ్ మ్యాచ్‌లకు రిజర్వ్ డే ఉండదు. ఓవర్లు కుదించి నిర్వహించడమో లేదా చివరికి ఇరు జట్లు 5-5ఓవర్ల మ్యాచ్ ఆడడమో చేయాలి. ఒకవేళ వాన వల్ల అది కూడా సాధ్యం కాకపోతే ఎలిమినేటర్, క్వాలిఫైయర్స్, ఫైనల్ విజేతను నిర్ణయించడానికి జట్ల మధ్య సూపర్ ఓవర్ నిర్వహిస్తారు.

సూపర్ ఓవర్ నిర్వహించడానికి రాత్రి 12.50am లోపు మ్యాచ్ ప్రారంభం కావాలి. లేదంటే సూపర్ ఓవర్ కూడా క్యాన్సిల్ అవుతుంది. ఇక సూపర్ ఓవర్ కూడా సాధ్యం కాని పరిస్థితుల్లో లీగ్ దశలో అగ్రస్థానంలో లేదా ప్రత్యర్థి జట్టుతో పోలిస్తే మెరుగైన స్థానంలో నిలిచిన జట్టు విజేతగా నిలుస్తుంది. అంటే ఒకవేళ ఫైనల్ మ్యాచ్ మే 29, రిజర్వ్ డే మే 30, రెండు రోజుల్లో నిర్వహించడానికి వీలు కాకపోతే ఫైనల్ జట్లలో ఏ జట్టయితే లీగ్ దశలో మంచి స్థానంలో ఉందో ఆ జట్టు విజేతగా నిలుస్తుందన్నమాట.

ఒక జట్టు బ్యాటింగ్ చేశాక వాన పడితే..?

ఒక జట్టు బ్యాటింగ్ చేశాక వాన పడితే..?

రిజర్వ్ డే లేని రెండు క్వాలిఫైయర్‌ మ్యాచ్‌లు, ఎలిమినేటర్‌ మ్యాచ్‌ల్లో ఒక జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. రెండో జట్టు బ్యాటింగ్ చేయడానికి ముందు లేదా బ్యాటింగ్ చేస్తుండగా వాన పడితే మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించడానికి DLS పద్ధతిని ఉపయోగిస్తారు. ఒకవేళ ఫైనల్ మ్యాచ్ మే 29న ప్రారంభమయ్యింది.

ఆ రోజు ఒక 5ఓవర్ల మ్యాచ్ జరిగిందనుకుందాం(కనీసం ఒక్క బాల్ అయిన పడ్డ చాలు) అప్పుడు వాన పడి ఆట ఆగిపోతే ఎక్కడ ఆట ముగిసిందో అక్కడి నుంచి రిజర్వ్ డే రోజు ఆట తిరిగి మొదలవుతుంది. మే 29న మ్యాచ్ ప్రారంభం కాకుంటే.. ఒకవేళ టాస్ పడ్డాక మ్యాచ్ మొదలు కాకుంటే రిజర్వ్ డే రోజు మళ్లీ ఫ్రెష్ టాస్ వేసి మ్యాచ్ ప్రారంభిస్తారు.

ఒకవేళ అదే గనుక జరిగితే గుజరాత్ టైటాన్స్ విజేత కావొచ్చు

ఒకవేళ అదే గనుక జరిగితే గుజరాత్ టైటాన్స్ విజేత కావొచ్చు

రిజర్వ్ డే రోజు (3గంటల 20నిమిషాలతో)పాటు అదనంగా రెండు గంటల సమయం ఉంటుంది. రిజర్వ్ డే రోజు కూడా వాన పడితే ఎట్ లిస్టు 5ఓవర్ల మ్యాచ్ అయినా జరుగుతుంది. ఒకవేళ 5ఓవర్ల మ్యాచ్ జరగకపోతే సూపర్ ఓవర్, అది కూడా సాధ్యం కాకపోతే లీగ్ దశలో ఏ జట్టయితే మెరుగైన స్థానంలో ఉంటుందో ఆ జట్టు గెలుపొందుతుంది.

ఇక ఫైనల్ రోజు గానీ రిజర్వ్ ఫైన్ డే రోజు గానీ సూపర్ ఓవర్ జరగడానికి రాత్రి 1.20am వరకు అవకాశం ఉంటుంది. రిజర్వ్ డే ఫైనల్ రోజు రాత్రి 1.20amకు గనుక సూపర్ ఓవర్ మ్యాచ్ ప్రారంభం కాకపోతే లీగ్ దశలో ఎక్కువ పాయింట్లు (నెట్ రన్ రేట్) సాధించిన జట్టు విజేతగా నిలుస్తుంది.

ఒక వేళ గుజరాత్ టైటాన్స్, లక్నో ఫైనల్లో తలపడ్డయనుకో.. ఆ మ్యాచ్ వర్షం వల్ల అసలే జరగలేదనుకో.. గుజరాత్ టైటాన్స్ లీగ్ దశలో మెరుగ్గా (టాప్ 1 స్టేజీలో) ఉంది కాబట్టి విజేతగా నిలుస్తుందన్న మాట.

Story first published: Monday, May 23, 2022, 13:16 [IST]
Other articles published on May 23, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X