న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2022: ఎన్నడూ లేనంత బలహీనంగా ముంబై ఇండియన్స్! కుర్రాళ్లపైనే రోహిత్ సేన భవితవ్యం!

 IPL 2022: Mumbai Indians Strength, Weakness, Top Players, Playoffs Chances and Playing XI Predictio
IPL 2022 : Mumbai Indians Seems To Be Weak In This IPL | Oneindia Telugu

హైదరాబాద్: ఐపీఎల్‌లోనే మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్ ఏదైనా ఉందా? అంటే అది ముంబై ఇండియన్సే. టోర్నీ చరిత్రలోనే ఆ జట్టు అత్యధికంగా ఐదు సార్లు టైటిల్ గెలిచింది. ముఖ్యంగా రోహిత్ శర్మ సారథ్యంలోని ఆ జట్టు.. గత కొన్నేళ్లుగా ఐపీఎల్‌‌ను శాసిస్తోంది. గత నాలుగు సీజన్లలో రెండు సార్లు(2019, 2020) టైటిల్ గెలుచుకుంది. అయితే వరల్డ్ బెస్ట్ టీమ్‌గా గుర్తింపు పొందిన ముంబైకి.. మెగా వేలం రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. కొత్తగా రెండు జట్లు లీగ్‌లోకి రావడం‌తో మెగా వేలం అనివార్యమవ్వగా.. బలమైన ముంబై కోర్ టీమ్ చెల్లాచెదురైంది.

దాంతో ఎన్నడూ లేని విధంగా పేపర్‌పై ముంబై ఇండియన్స్ బలహీనంగా కనిపిస్తోంది. జట్టులో పేరుమోసిన ఒక్క స్పెషలిస్ట్ స్పిన్నర్ లేడు. పైగా జట్టులో సగానికిపైగా కుర్రాళ్లే ఉన్నారు. దాంతో రోహిత్ సేన ఐపీఎల్ 2022 భవితవ్యం కుర్రాళ్ల ప్రదర్శనపైనే ఆధారపడి ఉంది. అయితే అనామక ఆటగాళ్లను స్టార్లుగా మార్చడం ముంబైకి కొత్తేం కాదు. అంతేకాకుండా లీగ్ మొత్తం ముంబైలోని జరుగుతుండటం టీమ్‌కు అడ్వాంటేజ్‌గా మారనుంది. ఇక కెప్టెన్‌గా రోహిత్ శర్మ, కోచ్‌గా మహేళ జయవర్థనే ఉండటం ఆ జట్టుకు అదనపు బలం.

టాప్ క్లాస్ ప్లేయర్స్ వీళ్లే..

టాప్ క్లాస్ ప్లేయర్స్ వీళ్లే..

ముంబై ఇండియన్స్‌‌ టీమ్‌లో కెప్టెన్ రోహిత్‌ శర్మతోపాటు కీరన్‌ పొలార్డ్, ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా కీలక ఆటగాళ్లు. మెగా వేలంలో ఇషాన్‌ను రూ. 15.25 కోట్ల భారీ ధరకు దక్కించుకుంది. అలానే పేసర్లు జోఫ్రా ఆర్చర్, టైమల్ మిల్స్, జయ్‌దేవ్‌ ఉనద్కత్‌ను కొనుగోలు చేసింది. అయితే జోఫ్రా ఆర్చర్ వచ్చే సీజన్ నుంచి అందుబాటులో ఉండనున్నాడు. అయితే జట్టులోని 25 మందిలో సగం మంది పెద్దగా తెలియని ఆటగాళ్లే. అయితే రంజీ సహా ఇతర దేశవాళీ టోర్నీల్లో రాణించడంతో ముంబై వారిని కొనుగోలు చేసింది. కాబట్టి వారిని మ్యాచ్‌లకు అనుగుణంగా మార్చుకోగలదు.

బ్యాకప్ ప్రాబ్లమ్..

బ్యాకప్ ప్రాబ్లమ్..

ముంబై ఇండియన్స్‌కు ఓపెనింగ్‌ సమస్య లేదు. రోహిత్ శర్మతో ఇషాన్‌ కిషన్‌ ఇన్నింగ్స్‌ను ఆరంభిస్తాడు. ఇందులో సందేహం లేదు. కానీ అతను గాయపడితే బ్యాకప్‌ ఓపెనర్ ఎవరా? అనేది టీమ్‌మేనేజ్‌మెంట్ నిర్ణయించాల్సి ఉంటుంది. పేరు మోసిన ఆల్‌రౌండర్లు కూడా లేరు. కీరన్ పొలార్డ్ రూపంలో బిగ్ హిట్టర్ ఉన్నా.. ఇటీవల అతని ఫామ్ మరి పేలవంగా ఉంది. గత సీజన్‌లో ఆల్‌రౌండర్లు రాణించకపోవడంతో లీగ్ దశకే ముంబై పరిమితం కావాల్సి వచ్చింది. ఫాబియన్‌ అలెన్ హార్డ్‌ హిట్టరే. ఇక ఆసీస్‌ ఆటగాడు డానియల్ సామ్స్‌ పేస్ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌ చేస్తాడు. అయితే విదేశీ ఆటగాళ్లు తుది జట్టులో నలుగురు మాత్రమే ఉండాలనే నిబందన ఉండటంతో వీరికి తుది జట్టులో చోటు దక్కడం కష్టమే.

బౌలింగ్‌లో బుమ్రా ఒక్కడే..

బౌలింగ్‌లో బుమ్రా ఒక్కడే..

గతంతో పోలిస్తే బౌలింగ్ విభాగం కూడా బలహీనంగానే కనిపిస్తోంది. స్టార్ పేసర్ జస్ ప్రీత్ బుమ్రా మినహా మరో చెప్పుకొతగ్గ బౌలర్ లేడు. జోఫ్రా ఆర్చర్‌ను తీసుకున్నా అతను ఈ సీజన్ ఆడటం లేదు. జయ్‌దేవ్‌ ఉనద్కత్, రీలే మెరెడిత్, మిల్స్‌, బసిల్ థంపి రూపంలో పేసర్లు ఉన్నప్పటికీ వీళ్లు ఏ మేరకు రాణిస్తారో చూడాలి. అయితే స్పిన్ విభాగం కాస్త బలహీనంగా అనిపిస్తోంది. మురుగన్‌ అశ్విన్‌, అన్‌మోల్‌ ప్రీత్‌ సింగ్, డేవాల్డ్‌ బ్రెవిస్ ఉన్నప్పటికీ వీరిలో ఎవరికీ అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అనుభవం లేదు. కుర్రాళ్లు సత్తా చాటితేనే ముంబై లీగ్‌లో ముందుకు కొనసాగగలదు. లేకుంటే గత సీజన్ మాదిరే గ్రూప్ దశలోనే ఇంటిదారిపట్టవచ్చు.

 ముంబై ఇండియన్స్ జట్టు :

ముంబై ఇండియన్స్ జట్టు :

రోహిత్ శర్మ, అన్‌మోల్‌ సింగ్, డేవాల్డ్ బ్రెవిస్, రాహుల్ బుద్ది, సూర్యకుమార్‌ యాదవ్‌, ఆర్యన్ జుయల్, ఇషాన్‌ కిషన్‌, అర్జున్ తెందూల్కర్, డానియల్ సామ్స్, ఫాబియన్ అలెన్, హృతిక్‌ షోకీన్‌, జోఫ్రా ఆర్చర్, కీరన్‌ పొలార్డ్‌, మహమ్మద్‌ అర్షద్‌ ఖాన్, తిలక్‌ వర్మ, రమణ్‌దీప్‌ సింగ్, సంజయ్‌ యాదవ్‌, టిమ్‌ డేవిడ్, బసిల్‌ థంపి, బుమ్రా, జయ్‌దేవ్‌ ఉనద్కత్, మయాంక్‌ మార్కండే, మురుగన్‌ అశ్విన్‌, రిలే మెరెడిత్, మిల్స్‌.

 ముంబై ఇండియన్స్ తుది జట్టు(అంచనా)

ముంబై ఇండియన్స్ తుది జట్టు(అంచనా)

రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కీరన్ పొలార్డ్, టీమ్ డేవిడ్, డానియల్ సామ్స్/ ఫాబియన్ అలెన్, జయదేవ్ ఉనాద్కత్, జస్‌ప్రీత్ బుమ్రా, మయాంక్ మార్కండే, రిలే మెరిడిత్/మిల్స్

Story first published: Wednesday, March 16, 2022, 18:06 [IST]
Other articles published on Mar 16, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X