న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

LSG vs GT Playing 11: కొత్త జట్ల సిగపట్లు: ఎవడు గెలిస్తే..వాడే ఫస్ట్: లక్నోలో ఆ కీలక మార్పు

IPL 2022, LSG vs GT playing 11: Avesh Khan will be back after missing a few games due to a injury

ముంబై: ఐపీఎల్‌ 2022 సీజన్‌‌ సెకెండ్ హాఫ్‌లో ఇవ్వాళ రెండు కొత్త జట్లు తలపడనున్నాయి. లక్నో సూపర్ జెయింట్స్-గుజరాత్ టైటాన్స్ ఢీ కొనబోతున్నాయి. ఈ రెండింట్లో గెలిచిన టీమ్.. ఈ సీజన్‌లో ప్లేఆఫ్స్‌కు చేరిన తొలి టీమ్ అవుతుంది. ఒక్క విజయం సాధించగలిగితే ప్లేఆఫ్స్‌లోకి దర్జాగా అడుగు పెడుతుంది. ఈ రెండు జట్ల ఖాతాలో 16 పాయింట్లు చొప్పున ఉన్నాయి. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి.

తడబడుతున్న గుజరాత్

తడబడుతున్న గుజరాత్

ఒక్క మ్యాచ్ గెలిస్తే ఏ టెన్షనూ లేకుండా ప్లేఆఫ్స్‌కు చేరుకునే దశలో గుజరాత్ టైటాన్స్ తడబడుతోంది. వరసగా రెండు మ్యాచ్‌లను ఓడిపోయింది. ఒక్క మ్యాచ్ గెలిస్తే- ప్లేఆఫ్స్‌లోకి చేరిన తొలి జట్టుగా ఆవిర్భవించగలుగుతుందీ టీమ్. ఆ ఒక్క విజయాన్ని అందుకోవడానికి నానాతంటాలు పడుతోంది. తొలుత పంజాబ్ కింగ్స్, అనంతరం ముంబై ఇండియన్స్.. గుజరాత్ టైటాన్స్‌ను మట్టి కరిపించాయి. ఫస్ట్ హాఫ్‌లో సన్‌రైజర్స్ చేతిలో ఓడింది.

పొంచివున్న హ్యాట్రిక్ పరాజయాలు..

పొంచివున్న హ్యాట్రిక్ పరాజయాలు..

సెకెండ్ హాఫ్‌లో పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ ఇచ్చిన షాక్‌తో హార్దిక్ పాండ్యా సేన పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని కోల్పోయింది. ఇవ్వాళ లక్నో సూపర్ జెయింట్స్‌ను ఎదుర్కొనబోతోంది. హ్యాట్రిక్ పరాజయాల అంచులో నిలిచింది. ఈ మ్యాచ్‌లోనూ ఓడితే వరుసగా మూడింట్లో ఓటమిపాలైన జట్ల సరసన నిలుస్తుంది. ఓటములు చెక్ పెట్టి, ప్లేఆఫ్స్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తొలి జట్టుగా ఆవిర్భవించాలనే లక్ష్యంతో ఉంది గుజరాత్.

ఫామ్‌లో ఓపెనర్లు..

ఫామ్‌లో ఓపెనర్లు..

గుజరాత్ టైటాన్స్ అన్ని డిపార్ట్‌మెంట్లల్లోనూ బలంగా ఉంది. కిందటి మ్యాచ్‌లో ఓపెనర్లిద్దరూ హాఫ్ సెంచరీలు చేశారు. టాప్ ఆర్డర్‌లో బీ సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా, మిడిలార్డర్‌లో డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాతియా, అనంతరం రషీద్ ఖాన్, అల్జారి జోసెఫ్.. పించ్ హిట్టర్లు, ఆల్‌రౌండర్లతో నిండివుందీ టీమ్. రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్, మహ్మద్ షమీ, లోకీ ఫెర్గూసన్‌, ప్రదీప్ సంగ్వాన్‌తో కూడిన బౌలింగ్ వింగ్ బలంగా ఉంది.

గుజరాత్‌ను కిందికి దించి..

గుజరాత్‌ను కిందికి దించి..

గుజరాత్ టైటాన్స్ వరుస ఓటములను తనకు అనుకూలంగా మార్చుకుంటోంది లక్నో సూపర్ జెయింట్స్. తన చివరి మ్యాచ్‌లో కోల్‌కత నైట్‌రైడర్స్‌ను ఓడించిన అనంతరం పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని అందుకుంది. పాయింట్లల్లో గుజరాత్‌తో సమానంగా నిలిచింది. 11 మ్యాచ్‌లల్లో ఎనిమిదింట్లో గెలుపుతో 16 పాయింట్లను సాధించింది. నెట్ రన్‌రేట్ గుజరాత్ కంటే మెరుగ్గా ఉండటంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది.

రెండింటికీ కీలకమే..

రెండింటికీ కీలకమే..

ఈ పరిస్థితుల మధ్య లక్నో సూపర్ జెయింట్స్-గుజరాత్ టైటాన్స్ ఇవ్వాళ.. తలపడబోతోండటం ఆసక్తిగా మారింది. ఈ సాయంత్రం 7:30 గంటలకు పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఈ మ్యాచ్ ఉంటుంది. కేఎల్ రాహుల్ ఊపు మీదున్నాడు. చివరి మ్యాచ్‌లో డకౌట్ అయినప్పటికీ.. బ్యాటింగ్ ఫామ్‌పై ఢోకా లేదు. క్వింటన్ డికాక్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. మిడిలార్డర్‌లో దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, ఆయుష్ బదోని, లోయర్ ఆర్డర్‌లో జేసన్ హోల్డర్, మార్కస్ స్టొయినిస్ సత్తా చాటుతున్నారు. దుష్మంత చమీర, రవి బిష్ణోయ్, జేసన్ హోల్డర్, కృనాల్ పాండ్యాలతో అటు బౌలింగ్ విభాగం బలంగా ఉంది.

అవేష్ ఖాన్ లేదా గౌతమ్

అవేష్ ఖాన్ లేదా గౌతమ్

ఒక్క మార్పుతో లక్నో సూపర్ జెయింట్స్ బరిలోకి దిగే అవకాశం ఉంది. తుది జట్టులోకి అవేష్ ఖాన్‌‌ను తీసుకోవచ్చు. అంతకుమించిన మార్పులేవీ ఉండకపోవచ్చు. బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు చోటు చేసే ఛాన్స్ ఉంది. లోయర్ ఆర్డర్‌లో ఆడుతున్న ఆయుష్ బదోనిని టాప్ ఆర్డర్‌లోకి తీసుకొచ్చేలా వ్యూహాలను రూపొందించుకుందనే అంచనాలు ఉన్నాయి. వరుసగా విఫలమౌతున్న మనీష్ పాండేకు ఈ మ్యాచ్‌లోనూ ఆడే అవకాశాలు లేనట్టే.

తుదిజట్టు కూర్పు ఇలా..

తుదిజట్టు కూర్పు ఇలా..

లక్నో సూపర్ జెయింట్స్‌ తుదిజట్టులో- క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్ (కేప్టెన్), దీపక్ హుడా, మార్కస్ స్టొయినిస్, కృనాల్ పాండ్యా, ఆయుష్ బదోని, జేసన్ హోల్డర్, అవేష్ ఖాన్/కృష్ణప్ప గౌతమ్, మొహసిన్ ఖాన్, దుష్మంత చమీర, రవి బిష్ణోయ్ ఆడొచ్చు. కోల్‌కత నైట్‌రైడర్స్ తుదిజట్టులో- శుభ్‌మన్ గిల్, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), బీ సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా (కేప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్, లోకీ ఫెర్గూసన్, మహ్మద్ షమీ, ప్రదీప్ సంగ్వాన్ ఆడొచ్చు.

Story first published: Tuesday, May 10, 2022, 7:38 [IST]
Other articles published on May 10, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X