న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత పర్యటనకు ఆస్ట్రేలియా: షెడ్యూల్ ఇదే: బిజిబిజీగా కంగారూలు

IPL 2022: Australia will be playing 3 T20s against India in September 2022

ముంబై: ఐపీఎల్ 2022 టోర్నమెంట్ దాదాపు ముగింపుదశకు వచ్చేసింది. ఇంకొద్ది రోజుల్లో లీగ్ దశ ముగుస్తుంది. అనంతరం ప్లేఆఫ్స్, ఫైనల్స్ ఉంటాయి. ప్రధాన దేశాలకు చెందిన క్రికెటర్లు ఐపీఎల్‌లో ఆడుతున్నారు. ఈ టోర్నమెంట్ ముగిసిన వెంటనే ఎవరికి వారు తమ దేశం తరఫున లేదా కౌంటీల్లోనో ఆడటానికి సన్నద్ధమౌతారు. అప్‌కమింగ్ షెడ్యూల్స్ అన్నీ ఆయా దేశాల క్రికెట్ బోర్డులు ఇప్పటికే రెడీ చేసి ఉంచాయి. వన్డే ఇంటర్నేషనల్స్, టీ20లకు ప్రాధాన్యత ఇస్తోన్నాయి. ఈ ఏడాది చివరిలో టీ20 ప్రపంచకప్ ఉండటమే దీనికి కారణం.

 బిజీబిజీగా..

బిజీబిజీగా..

ఈ క్రమంలో- ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటనకు రానుంది. రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియాతో మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ను ఆడబోతోంది. ఆసీస్ టీ20 జట్టుకు ఆరోన్ ఫించ్ సారథ్యాన్ని వహిస్తున్నాడు. ప్రస్తుతం ఫించ్.. కోల్‌కత నైట్‌రైడర్స్ తరఫున ఆడుతున్నాడు. అలాగే- పలువురు ఆస్ట్రేలియా టీ20 ప్లేయర్లు కూడా ఈ సీజన్‌లో ఆడుతున్నారు. వారంతా తమ దేశ జాతీయ జట్టు తరఫున మళ్లీ భారత పర్యటనకు రానున్నారు.

సెప్టెంబర్‌లో భారత్‌కు..

సెప్టెంబర్‌లో భారత్‌కు..

సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటనకు రానుంది. అప్పటివరకు స్వదేశంలో పలు టీ20 సిరీస్‌లు ఆడుతుంది. జూన్-జులై మధ్య కంగారూల టీమ్ శ్రీలంక పర్యటనకు బయలుదేరి వెళ్తుంది.

మూడు చొప్పున టీ20, వన్డే ఇంటర్నేషనల్స్, రెండు టెస్ట్ మ్యాచ్‌లను ఆడుతుంది. ఆగస్టు-సెప్టెంబర్ మొదటి వారం మధ్య జింబాబ్వే, న్యూజిలాండ్‌తో మూడు చొప్పున వన్డే ఇంటర్నేషనల్స్ సిరీస్‌లలో తలపడుతుంది. సెప్టెంబర్ రెండోవారం నుంచి భారత పర్యటన ఆరంభమౌతుంది. మూడు టీ20ల తరువాత వెస్టిండీస్‌కు బయలుదేరి వెళ్తుంది.

భారత జట్టు కూడా..

భారత జట్టు కూడా..

భారత జట్టు కూడా తీరికలేని షెడ్యూల్స్‌ను ఎదుర్కొనాల్సి ఉంది. తొలుత- స్వదేశంలో దక్షిణాఫ్రికాను ఎదుర్కొంటుంది. జూన్‌లో దక్షిణాఫ్రికా జట్టు భారత్ పర్యటనకు రానుంది. అయిదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఇది. జూన్ 9వ తేదీన తొలి మ్యాచ్ ఆరంభమౌతుంది. చెన్నై ఎంఏ చిదంబరం స్టేడియం దీనికి ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. రెండో మ్యాచ్ 12వ తేదీన బెంగళూరు చిన్నస్వామి స్టేడియం, మూడో టీ20 14న మహారాష్ట్రలోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఉంటుంది.

దక్షిణాఫ్రికాతో పాటు

దక్షిణాఫ్రికాతో పాటు

17వ తేదీన నాలుగో మ్యాచ్ గుజరాత్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, 19న చివరి టీ20 ఢిల్లీలో షెడ్యూల్ చేసింది బీసీసీఐ. ఈ సిరీస్ ముగిసిన వెంటనే ఐర్లాండ్, ఇంగ్లాండ్‌ల పర్యటనకు బయలుదేరి వెళ్తుంది. అనంతరం వెస్టిండీస్‌లో పర్యటిస్తుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఖరారు చేసింది. వెస్టిండీస్‌తో మూడు వన్డే ఇంటర్నేషనల్స్, అయిదు టీ20 మ్యాచ్‌లను ఆడుతుంది రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా.

వెస్టిండీస్ టూర్ షెడ్యూల్ కూడా..

వెస్టిండీస్ టూర్ షెడ్యూల్ కూడా..

అయిదు టీ20ల్లో చివరి రెండింటినీ అమెరికాలో నిర్వహించేలా షెడ్యూల్‌ను రూపొందించింది బీసీసీఐ. అక్కడ క్రికెట్‌ను ప్రోత్సహించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. భారత్-వెస్టిండీస్ మధ్య తొలి వన్డే జులై 22వ తేదీన ఆరంభమౌతుంది. 22, 24, 27 తేదీల్లో ఈ మూడు వన్డే ఇంటర్నేషనల్స్ ఉంటాయి. ట్రినిడాడ్‌లోని క్వీన్ పార్క్ ఓవల్‌ స్టేడియం ఈ మ్యాచ్‌లకు ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. అదేనెల 29వ తేదీన సెయింట్ కీట్స్‌లోని బ్రియాన్ ఛార్లెస్ లారా స్టేడియంలో తొలి టీ20 మ్యాచ్‌ను ఆడతాయి ఈ రెండు జట్లు.

Story first published: Tuesday, May 10, 2022, 12:21 [IST]
Other articles published on May 10, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X