Chetan Sakariya: ఎవరీ కొత్త కుర్రాడు..ధోనీ వికెట్ పడగొట్టాడు: డెబ్యూ సీజన్‌లో

IPL 2021 : Chetan Sakariya Picks Up Big Wickets Of CSK In His Debut IPL || Oneindia Telugu

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్.. 14వ ఎడిషన్‌లో రాజస్థాన్ రాయల్స్ మరో పరాజయాన్ని మూట గట్టుకుంది. తొలి మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిన ఆ జట్టు.. ఆ తరువాతి మ్యాచులకు వచ్చే సరికి చతికిల పడుతోంది. రెండో మ్యాచ్‌లో బౌలర్ల నైపుణ్యంతో విజయాన్ని సాధించినప్పటికీ..మూడో మ్యాచ్‌కు వచ్చేటప్పటికీ ఆ విభాగం కూడా నీరసించినట్టు కనిపిస్తోంది. ఈ సీజన్‌లో ఇప్పటిదాకా ఆడిన మూడింట్లో ఒక మ్యాచ్‌లో మాత్రమే గెలిచింది సంజు టీమ్. ఒక విజయం.. రెండు పరాజయాలతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది.

గాడి తప్పిన బ్యాటింగ్..

గాడి తప్పిన బ్యాటింగ్..

చెన్నై సూపర్ కింగ్స్‌తో సోమవారం రాత్రి ముంబైలోని వాంఖెడె స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఏ మాత్రం రాణించలేకపోయింది.. ఓ రకంగా చెప్పాలంటే చెన్నై ఆల్‌రౌండర్ ప్రతిభ ముందు.. ఏ మాత్రం నిలవలేకపోయింది. చేతులెత్తేసింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్ని విభాగాల్లోనూ ఏ మాత్రం అంచనాలకు తగ్గట్టుగా తన ఆటతీరును ప్రదర్శించలేకపోయింది రాజస్థాన్ టీమ్. 45 పరుగుల తేడాతో మ్యాచ్‌ను ధారదాత్తం చేసుకుంది. ఓపెనర్ జోస్ బట్లర్ మినహా మరే ఇతర బ్యాట్స్‌మెన్ కూడా రాణించలేకపోయాడు. ఢిల్లీ కేపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చివరి ఓవర్‌లో జట్టును గట్టెక్కించిన ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్ ఈ మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు.

మెరుపు బౌలర్..

మెరుపు బౌలర్..

ఇన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య కూడా.. రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఓ మెరుపు మెరిసింది. చేతన్ సకారియా (Chetan Sakariya) రూపంలో కొత్త స్టార్ బౌలర్ ఆవిర్భవించాడు. 23 సంవత్సరాల గుజరాతీయుడు. అతనికి ఇదే తొలి ఐపీఎల్.. ఇది మూడో మ్యాచ్. బౌలింగ్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడు. పంజాబ్ కింగ్స్‌తో ఆడిన తొలి మ్యాచ్‌లోనే మూడు వికెట్లు తీసుకున్నాడు. రెండో మ్యాచ్‌లో వికెట్లేవీ తీసుకోలేదు. ఇక మూడో మ్యాచ్‌లో మళ్లీ మూడు వికెట్లు పడగొట్టాడు. ఈ మూడింట్లో మహేంద్రసింగ్ ధోనీ వికెట్ కూడా ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. అపారమైన క్రికెట్ ఆడిన అనుభవం ఉన్న ధోనీ.. ఈ కొత్త కుర్రాడి చేతిలో పడి పెవిలియన్ చేరాడు.

 ఎవరీ చేతన్..

ఎవరీ చేతన్..

చేతన్ సకారియా.. గుజరాత్‌లోని భావ్ నగర్ అతని స్వస్థలం. మధ్య తరగతి కుటుంబం అతనిది. ఎడమ చేతివాటం మీడియా ఫాస్ట్ బౌలర్. రాజస్థాన్ రాయల్స్‌తో పాటు సౌరాష్ట్ర, సౌరాష్ట్ర అండర్ 19 జట్లకు ప్రాతినిథ్యాన్ని వహించాడు. 2018 ఫిబ్రవరిలో తొలి లిస్ట్ ఎ క్రికెట్ మ్యాచ్‌ ఆడాడు. ఇప్పటిదాకా 19 టీ20 మ్యాచ్‌లను ఆడిన అనుభవం ఉంది. 34 వికెట్లు పడగొట్టాడు. 11 పరుగులు మాత్రమే ఇచ్చి అయిదు వికెట్లను పడగొట్టిన అరుదైన రికార్డ్ అతని పేరు మీద ఉంది. అందుకే కోటి రూపాయలకు పైగా పెట్టి రాజస్థాన్ రాయల్స్ జట్టు ఫ్రాంఛైజీ అతణ్ని కొనుగోలు చేసింది.

 స్టార్ బ్యాట్స్‌మెన్లను పెవిలియన్ దారి..

స్టార్ బ్యాట్స్‌మెన్లను పెవిలియన్ దారి..

ఈ సీజన్‌ ఆరంభం నుంచీ తుది జట్టులో అతనికి చోటు లభిస్తోంది. రెండో మ్యాచ్‌లో నిరాశ పరిచినా, చెన్నై సూపర్ కింగ్స్ వంటి బలమైన జట్టుతోనూ అతణ్ని ఆడే అవకాశాన్ని కల్పించింది. అంచనాలకు మించి రాణించాడు. ఈ మ్యాచ్‌లో అతను పడగొట్టిన మూడు వికెట్లు స్టార్ బ్యాట్స్‌మెన్లవే. సురేష్ రైనా, అంబటి రాయుడు, ఎంఎస్ ధోనీలను అవుట్ చేశాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 34 పరుగులు ఇచ్చి ఈ మూడు వికెట్లను పడగొట్టాడు. మొత్తం ఆరు వికెట్లతో పర్పుల్ క్యాప్ రేస్‌లో నిలిచాడు. జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Tuesday, April 20, 2021, 10:25 [IST]
Other articles published on Apr 20, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X