న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

RR vs PBKS: ఆ బంతితోనే.. శాంసన్‌ సిక్సర్ కొట్టకుండా కట్టడి చేశా: అర్షదీప్‌

IPL 2021, RR vs PBKS: Arshdeep Singh reveals how he get Sanju Samson wicket

ముంబై: గతరాత్రి పంజాబ్ కింగ్స్ యువ లెఫ్ట్ ఆర్మ్ సీమర్ అర్షదీప్‌ సింగ్ అద్భుత బౌలింగ్ ప్రదర్శన చేశాడు. క్రీజులో అప్పటికే సెంచరీ చేసిన సంజు శాంసన్ ఉన్నాడు.. చేయాల్సింది కేవలం 13 పరుగులే.. అందులోనూ టీ20 ఫార్మాట్. ఈ పరిస్థితిలో ఎంతో అంతర్జాతీయ అనుభవం ఉన్న బౌలర్ కూడా కాస్త కంగారుపడతాడు. అర్షదీప్‌ మాత్రం తన వైడ్ యార్కర్ బంతులతో శాంసన్‌ను బోల్తా కొట్టించి.. పంజాబ్ జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. చివరి బంతికి సిక్సర్ బాదుదామనుకున్న శాంసన్‌ను ఔట్ చేసి.. హీరో అయ్యాడు. ఐపీఎల్‌ 2021లో భాగంగా సోమవారం రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచులో పంజాబ్‌ 4 పరుగుల తేడాతో విజయం సాధించింది.

RR vs PBKS: టాస్‌ వేసిన నాణెం బాగుంది.. వెంటనే జేబులో వేసుకున్నా! కానీ..: శాంసన్RR vs PBKS: టాస్‌ వేసిన నాణెం బాగుంది.. వెంటనే జేబులో వేసుకున్నా! కానీ..: శాంసన్

మ్యాచ్ అనంతరం అర్షదీప్‌ సింగ్ మాట్లాడుతూ... 'చాలా సంతోషంగా ఉంది. ఆఖరి ఓవర్‌ కన్నా ముందు పిచ్‌ వేగంగా అనిపించింది. ఆ తర్వాత మాత్రం సహకరించింది. చివరి ఓవర్ ఆరు బంతుల్ని ఆఫ్‌సైడ్‌ దూరంగా యార్కర్లు విసరాలన్నది మా ప్రణాళిక. ఫీల్డ్ సెట్ కూడా దానికి అనుగుణంగా చేయబడింది. సంజు శాంసన్‌కు యార్కర్లు వేసేందుకు ప్రయత్నించా. అలాంటప్పుడు అతడు బౌండరీలు మాత్రమే కొట్టగలడు. శాంసన్ సిక్సర్‌ బాదినా.. అదే ప్రణాళికను అమలు చేశా. చివరి బంతిని కూడా అలానే వేశా. కానీ నా గుండె వేగం మాత్రం పెరిగింది. చివరికి క్యాచ్ ఔట్ అయ్యాడు' అని తెలిపాడు.

'మా కోచింగ్‌ బృందం, కెప్టెన్‌ నాకు అండగా నిలిచారు. నేనెలాంటి పాత్ర పోషించాల్సి ఉంటుందో సన్నాహక మ్యాచుల్లో వారు నాకు స్పష్టంగా చెప్పారు. దాంతో నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. కెప్టెన్ కోరుకునే విధంగా బౌలింగ్ చేయడమే నా పని. సయ్యద్ ముస్తాక్‌ అలీలో నా ఫామ్‌ బాగుంది. పోటాపోటీ మ్యాచులాడటం మాకు అలవాటే. ఆ అనుభవం ఇక్కడ పనికొచ్చింది. ఏదేమైనా రెండు పాయింట్లు సాధించడం సంతోషం. ఐపీఎల్ చాలా పెద్ద టోర్నీ. ఈ టోర్నీలో ఆడడం ఆనందంగా ఉంది' అని అర్షదీప్‌ సింగ్ తెలిపాడు. ఈ మ్యాచులో తన కోటా 4 ఓవర్లలో మూడు వికెట్లు తీసి 35 పరుగులు ఇచ్చాడు.

రాజస్థాన్‌ రాయల్స్‌ విజయానికి చివరి ఓవర్లో 13 పరుగులు అవసరం అయ్యాయి. క్రీజులో సంజు శాంసన్, క్రిస్ మోరిస్ ఉన్నారు. అర్ష్‌దీప్ సింగ్ చేతిలో బాల్ ఉంది. దీంతో అప్పటి జోరు చూస్తే.. రాయల్స్‌ సునాయాసంగా మ్యాచ్ గెలుస్తుందనుకున్నారు. మొదటి బంతికి పరుగు రాకున్నా.. రెండో బంతికి శాంసన్ సింగల్ తీశాడు. మూడో బంతికి మోరిస్ మరో సింగల్ తీశాడు. ఇక నాలుగో బంతికే శాంసన్ సిక్స్ బాదడంతో ఉంత్కంఠ తారాస్థాయికి చేరింది. ఐదవ బంతికి సింగిల్ వచ్చే అవకాశం ఉన్నా.. శాంసన్ తీయలేదు. ఇక చివరి బంతికి రాయల్స్ కెప్టెన్ క్యాచ్ ఔట్ అయ్యాడు. దీంతో రాయల్స్ ఆశలు అడిఆశలయ్యాయి.

Story first published: Tuesday, April 13, 2021, 12:20 [IST]
Other articles published on Apr 13, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X