న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2021: టఫ్ ఫైట్: ఎదురుగా ఉన్నది ఏనుగు..సన్‌రైజర్స్ పరిస్థితేంటీ? ప్రిడిక్షన్స్ ఇవీ

IPL 2021: MI vs SRH Predicted Playing 11 are here at Chennais MA Chidambaram stadium
IPL 2021 : MI vs SRH, Here Is The Predicted XI Of Both Teams || Oneindia Telugu

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్, 14వ ఎడిషన్‌లో తొమ్మిదో మ్యాచ్ ఈ సాయంత్రం ఆరంభం కాబోతోంది. రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్.. డేవిడ్ కేప్టెన్సీని వహిస్తోన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు ఢీ కొనబోతున్నాయి. ఈ సాయంత్రం 7:30 గంటలకు చెన్నై చెపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ రెండు జట్లకూ ఈ సీజన్‌లో ఇది మూడో మ్యాచ్. ఓటమితో సీజన్ ఆరంభించిన ముంబై ఇండియన్స్.. ఆ తరువాతి మ్యాచ్‌లో అద్భుతంగా రాణించింది. విజయాన్ని అందుకుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఆడిన రెండింట్లోనూ ఓటమిని మూటగట్టుకుంది.

10 రోజుల్లో ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్: అంతలోనే నరేంద్ర మోడీ స్టేడియం సీల్: జీసీఏ సంచలన నిర్ణయం10 రోజుల్లో ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్: అంతలోనే నరేంద్ర మోడీ స్టేడియం సీల్: జీసీఏ సంచలన నిర్ణయం

 తనకంటే బలమైన జట్టుతో..

తనకంటే బలమైన జట్టుతో..

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇప్పటిదాకా రెండు మ్యాచ్‌లు ఆడింది. ఒక్క దాంట్లోనూ గెలవలేదు. ఇది మూడో మ్యాచ్. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో తన కంటే బలమైన ముంబై ఇండియన్స్‌ను హైదరాబాద్ తలపడనుంది. టైటిల్ హాట్ ఫేవరెట్లలో ఒకటైన రోహిత్ సేనను ఓడించడం అంత సులువేమీ కాదు. ముంబైతో పోల్చుకుంటే వార్నర్ అండ్ టీమ్ బ్యాటింగ్ లైనప్ బలహీనమే. మిడిలార్డర్‌లో నిలదొక్కుకుని ధాటిగా ఆడగల బ్యాట్స్‌మెన్ లేడు. ఆ సత్తా ఉన్న కేన్ విలియమ్సన్ ఈ మ్యాచ్‌లో కూడా ఆడేది అనుమానమే.

పాయింట్ల పట్టికలో అట్టడుగున..

పాయింట్ల పట్టికలో అట్టడుగున..

ప్రస్తుతం పాయింట్ల పట్టికలో సన్‌రైజర్స్ హైదరాబాద్ అట్టడుగున నిలిచింది. ఆ జట్టు ఖాతాలో ఒక్క పాయింట్ కూడా జమ కాలేదు. ఈ మెగా టోర్నమెంట్‌లో ఆడుతున్న అన్ని జట్లూ రెండేసి చొప్పున మ్యాచ్‌లను పూర్తి చేసుకున్నాయి. ఈ దశలో విరాట్ కోహ్లీ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్.. పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉంది. ఆడిన రెండు మ్యాచుల్లోనూ విజయాన్ని సాధించింది కోహ్లీసేన. పంజాబ్ కింగ్స్‌పై సాధించిన విజయంతో చెన్నై సూపర్ కింగ్స్ రెండో స్థానానికి ఎగబాకింది. ముంబై ఇండియన్స్, ఢిల్లీ కేపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ టాప్‌ఫైవ్‌లో ఉన్నాయి.

హెడ్ టు హెడ్ ఈక్వల్..

హెడ్ టు హెడ్ ఈక్వల్..

ఐపీఎల్ సీజన్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ ఇప్పటిదాకా ఈ రెండు జట్లు 16 సార్లు తలపడ్డాయి. చెరో ఎనిమిది మ్యాచుల్లో విజయం సాధించాయి. తటస్థ వేదికపై మాత్రం సన్‌రైజర్స్‌దే అప్పర్ హ్యాండ్. తటస్థ వేదికల్లో నాలుగు సార్లు ఈ రెండు జట్లు ఎదురుపడగా.. మూడింట్లో గెలుపు హైదరాబాద్‌దే. ఈ పరిస్థితుల్లో ఈ సాయంత్రం జరిగే 17వ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారనేది ఆసక్తి రేపుతోంది. రెండు వరుస పరాజయాలు పలకరించడంతో డీలా పడ్డ డేవిడ్ వార్నర్ అండ్ టీమ్.. ఎలా పుంజుకుంటుందనేది ఉత్కంఠతగా మారింది. ఈ మ్యాచ్ ఓడితే.. ఇక ముందు సాగడం కష్టతరమౌతుంది.

 రెండు జట్ల ప్రాబబుల్స్ ఇలా..

రెండు జట్ల ప్రాబబుల్స్ ఇలా..

ముంబై ఇండియన్స్ ప్రాబబుల్స్‌లో రోహిత్ శర్మ, క్వింటన్ డికాక్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్య, కీరన్ పొలార్డ్, కృనాల్ పాండ్యా, రాహుల్ చాహర్, మార్కో జెన్‌సెన్, ట్రెంట్ బౌల్ట్, జస్‌ప్రీత్ బుమ్రా దాదాపుగా ఆడే అవకాశాలు ఉన్నాయి. సన్ రైజర్స్‌లో డేవిడ్ వార్నర్, వృద్ధిమాన్ సాహా, మనీష్ పాండే, జానీ బెయిర్‌స్టో, అబ్దుల్ సమద్, జేసన్ హోల్డర్, విజయ్ శంకర్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, సందీప్ శర్మ, టీ నటరాజన్ ఆడొచ్చు. కేన్ విలియమ్సన్ అందుబాటులోకి వస్తే గనక బెయిర్‌స్టోను డగౌట్‌కే పరిమితం చేయడానికి అవకాశాలు ఉన్నాయి.

Story first published: Saturday, April 17, 2021, 12:01 [IST]
Other articles published on Apr 17, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X