న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఈగ సుదీప్ సంచలన కామెంట్: ఆర్సీబీ బ్యాట్స్‌మెన్ పడిక్కల్‌ పెర్ఫార్మెన్స్ ముందు

 IPL 2021: hats off.. proved u r a champ once again, says Kichcha Sudeep on Devdutt

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్ 14వ ఎడిషన్‌ మెగా టోర్నమెంట్‌లో మరో సెంచరీ నమోదైంది. ఓ అన్ క్యాప్డ్ ఆటగాడు సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు డాషింగ్ ఓపెనర్ దేవ్‌దత్ పడిక్కల్ ఐపీఎల్‌లో తొలి సెంచరీని సాధించాడు. 52 బంతుల్లో 101 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. తన పేరు మీద సరికొత్త రికార్డ్‌ను లిఖించుకున్నాడు. అతి పిన్న వయస్సులో వంద పరుగుల ల్యాండ్ మార్క్‌ను అందుకున్న మూడో క్రికెటర్‌గా నిలిచాడతను.

మ్యాచ్ మొత్తం ఏకపక్షం..

మ్యాచ్ మొత్తం ఏకపక్షం..

ముంబై వాంఖెడే స్టేడియంలో గురువారం రాత్రి రాజస్థాన్ రాయల్స్‌ను ఢీ కొట్టిన రాయల్ ఛాలెంజర్స్.. మ్యాచ్ మొత్తాన్నీ ఏకపక్షంగా మార్చివేసింది. ప్రత్యర్థి నిర్దేశించిన 177 పరుగుల లక్ష్యాన్ని ఊది అవతల పారేసింది. ఒక్క వికెట్ కూడా బెంగళూరు జట్టు కోల్పోలేదు. ఓపెనర్లే మ్యాచ్‌ను ముగించేశారు. ఈ క్రమంలో దేవ్‌దత్ పడిక్కల్ సెంచరీ సాధించాడు. మరో ఓపెనర్ విరాట్ కోహ్లీ.. 72 పరుగులు చేశాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఏకంగా ఆరుమంది బౌలింగ్ చేసినప్పటికీ.. కోహ్లీ-పడిక్కల్ జంటను విడగొట్టలేకపోయారంటే వారి బ్యాటింగ్ ధాటి ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

మూడో యంగెస్ట్ ప్లేయర్‌గా

మూడో యంగెస్ట్ ప్లేయర్‌గా

ప్రత్యేకించి పడిక్కల్ తన బ్యాటింగ్ విన్యాసంతో క్రికెట్ ప్రేమికులను కట్టిపడేశాడు. విరాట్ కోహ్లీ వంటి టాప్ క్లాస్ బ్యాట్స్‌మెన్ కూడా అతని పెర్‌ఫార్మెన్స్ ముందు ప్రేక్షకుడిలా మారిపోయాడు. ఐపీఎల్‌లో అతి చిన్న వయస్సులో సెంచరీ మార్క్‌ను అందుకున్న మూడో బ్యాట్స్‌మెన్ పడిక్కల్. అతని వయస్సు 20 సంవత్సరాల 289 రోజులు. ఈ ఏజ్‌లో సెంచరీ చేసిన మూడో ఆటగాడతను. అతని కంటే ముందు- మనీష్ పాండే, రిషబ్ పంత్ ఉన్నారు. మనీష్ పాండే-19 సంవత్సరాల 253 రోజులు, రిషబ్ పంత్-20 సంవత్సరాల 218 రోజుల్లో సెంచరీ చేశారు.

కిచ్చా సుదీప్ ఏమంటున్నాడంటే..

దేవ్‌దత్ పడిక్కల్ బ్యాటింగ్ పట్ల ఆ రంగంతో సంబంధం లేని వారు కూడా అతణ్ని అభినందిస్తున్నారు. శాండల్‌వుడ్ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్.. పడిక్కల్‌ను ఆకాశానికెత్తేశాడు. దేవ్‌దత్ పడిక్కల్ కోసమే తాను మ్యాచ్ మొత్తం చూశానని చెప్పుకొచ్చాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇదేనని పేర్కొన్నాడు. ఇప్పటిదాకా ఆడిన నాలుగుకు నాలుగు మ్యాచ్‌లనూ రాయల్ ఛాలెంజర్స్ గెలవడాన్ని ఓ కన్నడిగుడిగా ఎంజాయ్ చేస్తున్నానని చెప్పాడు.

కోహ్లీ సెల్ఫ్‌లెస్

కోహ్లీ సెల్ఫ్‌లెస్

విరాట్ కోహ్లీ సెల్ఫ్‌లెస్ ప్లే ఆడాడని కామెంట్స్ చేశాడు. తాను సెంచరీ చేసే అవకాశం ఉన్నప్పటికీ.. పడిక్కల్‌ను అతను ఎంకరేజ్ చేశాడని వ్యాఖ్యానించాడు. పడిక్కల్ మరోసారి తాను ఛాంపియన్‌ అని నిరూపించుకున్నాడని అన్నాడు. ఈ ఐపీఎల్ సీజన్ మొత్తానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుతంగా రాణిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పాడు. పడిక్కల్‌పై తోటి క్రికెటర్లు, మాజీ ప్లేయర్లు ప్రశంసల వర్షాన్ని కురిపిస్తున్నారు. టీమిండియాకు మరో స్టార్ బ్యాట్స్‌మెన్ దొరికాడంటూ క్రిష్ణమాచారి శ్రీకాంత్ సహా పలువురు క్రికెటర్లు పడిక్కల్‌ను అభినందించారు.

Story first published: Friday, April 23, 2021, 8:41 [IST]
Other articles published on Apr 23, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X