న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

RCB vs KKR: ఐపీఎల్ ట్రోఫీ గెలిస్తే.. ఎలాంటి భావోద్వేగాలు ప్రదర్శిస్తామో తెలీదు: డివిలియర్స్

IPL 2021: AB de Villiers says I dont Know how we will react if RCB win IPL trophy
IPL 2021,RCB vs KKR: If RCB Win The Trophy ట్రోఫీ నెగ్గాక ఏం చేస్తామో మాకే తెలీదు - AB De Villiers

చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో టైటిల్ గెలవని జట్లలో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు‌ కూడా ఒకటి. 'ఈసాల కప్ నమ్‌దే' అంటూ రావడం, ఉసూరుమనిపించడం పరిపాటిగా మారింది. బెంగళూరు‌ కప్ కొడితే చూడాలని ఆ జట్టు అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. గతేడాది లీగ్ దశలో అద్భుత ఆటతో ప్లే ఆప్స్ చేరినా.. అక్కడ నిరాశపరిచి ఇంటిదారిపట్టింది. అయితే ఈ ఏడాది వంద శాతం ప్రదర్శన చేస్తామని, కప్ కొడతామని బెంగళూరు‌ స్టార్ ఆటగాడు, మిస్టర్‌ 360 ఏబీ డివిలియర్స్‌ అంటున్నాడు. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఈ రోజు మధ్యాహ్నం బెంగళూరు, కోల్‌కతా నైట్ ‌రైడర్స్ జట్లు తలపడనున్నాయి.

కోల్‌కతా మ్యాచ్ నేపథ్యంలో బెంగళూరు పోస్ట్ చేసిన వీడియోలో ఏబీ డివిలియర్స్‌ మాట్లాడుతూ... 'ఎప్పటిలా ఈ ఏడాది నిరాశపరచం. వంద శాతం ప్రదర్శన చేస్తాం.. సాధారణంగా ఎవరైనా మ్యాచ్‌లో విజయాన్ని కోరుకోవచ్చు. కానీ నేను ఐపీఎల్‌ ట్రోఫీ విజయాన్ని ప్రేమిస్తున్నా. అసలు ట్రోఫీ నెగ్గాక మేం ఎలాంటి భావోద్వేగాలు ప్రదర్శిస్తామో తెలీదు' అని అన్నాడు. పవర్ హిట్టర్ గ్లెన్ మాక్స్‌వెల్ రాకతో బెంగళూరు జట్టు బ్యాటింగ్ బలపడింది. గత రెండు మ్యాచ్‌ల్లోనూ మ్యాక్సీ సత్తాచాటాడు. సహచరులు వరుసగా వికెట్లు చేజార్చుకుంటున్నా క్రీజులో నిలిచిన మాక్స్‌వెల్.. మ్యాచ్ గమనానికి అనుగుణంగా హిట్టింగ్ చేస్తున్నాడు.

'కరోనా మహమ్మారి పరిస్థితుల వల్ల ఈ ఏడాది సొంత మైదానంలో ఆడే ప్రయోజనం ఏ జట్టుకూ లేదు. ఒకే మైదానంలో భిన్నమైన జట్లతో ఆడే సందర్భాలు ఎదురవుతున్నాయి. ఇలా ప్రతి జట్టూ ఆడటం వల్ల అందరికీ ఒకేలాంటి వాతావరణం ఉంటుంది. ప్రస్తుతం చెన్నై, ముంబై మైదానాల్లోనే అందరూ ఆడుతున్నారు. హోం గ్రౌండ్‌ ఫీలింగ్‌ అంటూ ఇక ఏమీ ఉండదు. సొంత మైదానంలో ఆటకు అనుకూలంగా సన్నద్ధమైన జట్లకు ఇది కాస్త ప్రతికూలమే. ఏదేమైనా ప్రతిష్ఠాత్మకమైన ఐపీఎల్‌ ట్రోఫీని నెగ్గడమే ఇప్పటి మా లక్ష్యం' అని ఏబీ డివిలియర్స్ చెప్పాడు.

బెంగళూరు, కోల్‌కతా జట్లు ఇప్పటి వరకూ 26 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో 14 మ్యాచ్‌ల్లో కోల్‌కతా విజయం సాధించగా.. 12 మ్యాచ్‌ల్లో బెంగళూరు గెలుపొందింది. బెంగళూరుపై ఓ మ్యాచ్‌లో కోల్‌కతా ఏకంగా 222 పరుగుల భారీ స్కోర్ చేసింది. మరోవైపు బెంగళూరు కూడా ఒక మ్యాచ్‌లో కోల్‌కతాపై 213 పరుగులు చేసింది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే కోల్‌కతా ఓ మ్యాచ్‌లో బెంగళూరుని 49 పరుగులకే కుప్పకూల్చగా.. బెంగళూరు ఓ సందర్భంలో కోల్‌కతాని 84 పరుగులకే ఆలౌట్ చేసింది.

MI vs SRH: ఏం చెప్పాలో తెలియడం లేదు.. ఈ ఓటమిని ఎలా తీసుకోవాలో అంతకన్నా అర్థం కావడం లేదు: వార్నర్‌MI vs SRH: ఏం చెప్పాలో తెలియడం లేదు.. ఈ ఓటమిని ఎలా తీసుకోవాలో అంతకన్నా అర్థం కావడం లేదు: వార్నర్‌

Story first published: Sunday, April 18, 2021, 14:38 [IST]
Other articles published on Apr 18, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X