న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పోతూ పోతూ మిగతా జట్లపై పంజా విసురుతున్న చెన్నై లయన్స్

IPL 2020: With CSKs win over KKR,race for play off still open while MI confirm their berth

దుబాయ్: మొండివాడు రాజుకంటే బలవంతుడని పెద్దలు చెబుతుంటారు. ఓడినవాడూ అంతే. ధోనీ సేన విషయంలో అది మరోసారి రుజువు అవుతోంది. గెలవాలనే కాంక్షతో మొండిగా ఆడుతోన్న చెన్నై సూపర్ కింగ్స్ అత్యంత ప్రమాదకారిగా మారింది.. విధ్వంసాన్ని రేపుతోంది. మిగిలిన జట్ల ప్లేఆఫ్ అవకాశాలను దారుణంగా దెబ్బకొడుతోంది. ధోనీ సేన దెబ్బకు కోల్‌కత నైట్ రైడర్స్ ప్లేఆఫ్ రేస్ నుంచి దాదాపుగా నిష్క్రమించే పరిస్థితి తలెత్తింది. చెన్నై సూపర్ కింగ్స్‌పై గెలిచి ఉంటే.. ప్లేఆఫ్ అవకాశాలు సజీవంగా ఉంచుకోగలిగి ఉండేది. అలా జరగలేదు.

కోల్‌కత ప్లేఆఫ్ చేరాలంటే..?

కోల్‌కత ప్లేఆఫ్ చేరాలంటే..?

నేరుగా ప్లేఆఫ్ చేరుకోవాలీ అంటే.. ఏ జట్టుకైనా 16 పాయింట్లు సాధించాల్సి ఉంటుంది. ఆ అవకాశం ఇప్పటిదాకా ఒక్క ముంబై ఇండియన్స్‌కే దక్కింది. కీరన్ పొలార్డ్ సారథ్యంలోని ఆ జట్టు 16 పాయింట్లతో ప్లేఆఫ్ చేరింది. కోల్‌కత నైట్ రైడర్స్ నేరుగా ప్లేఆఫ్ చేరడానికి గల అవకాశాలు ఏ మాత్రం లేవు. ప్రస్తుతం ఆ జట్టు ఖాతాలో మిగిలి ఉన్నది.. ఒక్క మ్యాచ్ మాత్రమే. అందులో గెలిచినా 14 పాయింట్ల వద్దే ఆగిపోతుంది. ప్లేఆఫ్ చేరాలంటే మిగిలిన జట్ల గెలుపోటముల మీద ఆధారపడాల్సిందే.

నేరుగా ప్లేఆఫ్ చేరే అవకాశాలు ఆ రెండు జట్లకే..

నేరుగా ప్లేఆఫ్ చేరే అవకాశాలు ఆ రెండు జట్లకే..

16 పాయింట్లతో దర్జాగా ప్లేఆఫ్ చేరుకునే అవకాశాలు ప్రస్తుతం రెండు జట్లకు మాత్రమే ఉంది. ఒకటి- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండు- ఢిల్లీ కేపిటల్స్. ఈ రెండు జట్ల అకౌంట్‌లో ప్రస్తుతం 14 పాయింట్లు ఉన్నాయి. ఇంకా రెండు మ్యాచ్‌లను చొప్పున ఆడాల్సి ఉంది. ఈ రెండింట్లో ఆ రెండు జట్లు ఏ ఒక్క మ్యాచ్‌లో నెగ్గినా నేరుగా ప్లేఆఫ్‌కు వెళ్లిపోతాయి. ప్లేఆఫ్ చేరడానికి అవసరమైన ఆ రెండు పాయింట్ల కోసం నానా తంటాలు పడుతున్నాయి ఆ రెండు జట్లు కూడా. ఢిల్లీ కేపిటల్స్ వరుసగా మూడు, రాయల్ ఛాలెంజర్స్. రెండు మ్యాచుల్లో ఓడిపోయాయి. ప్లేఆప్ ముంగిట పల్టీ కొడుతున్నాయి.

పంజాబ్‌కే ఛాన్స్?

పంజాబ్‌కే ఛాన్స్?

కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ఏ మాయ చేసిందో గానీ.. వరుసగా ఆరు మ్యాచ్‌లల్లో ఘన విజయాలను అందుకుంది. ప్రస్తుతం నేరుగా ప్లేఆఫ్ వెళ్లే అవకాశాలు ఆ జట్టుకూ ఉంది. 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది కేఎల్ రాహుల్ టీమ్. ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలే ఉన్నాయి. ఇప్పుడున్న దూకుడు మంత్రాన్ని కొనసాగిస్తే.. ఈ రెండింటినీ గెలవడం ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే- 16 పాయింట్లతో నేరుగా ప్లేఆఫ్‌కు చేరుకుంటుంది. వరుసగా ఆరు మ్యాచ్‌లల్లో నెగ్గిన పంజాబ్ ఈ రెండూ గెలిస్తే... అదో రికార్డే అవుతుంది. రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్‌లతో తలపడాల్సి ఉంది పంజాబ్.

ప్లేఆఫ్ బెర్త్ కోసం..

ప్లేఆఫ్ బెర్త్ కోసం..

సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, కోల్‌కత నైట్ రైడర్స్.. 16 పాయింట్లను అందుకోలేవు. 14 లేదా అంతకు దిగువకే నిలిచిపోతాయి. హైదరాబాద్, రాజస్థాన్ జట్లు రెండేసి మ్యాచ్‌లు, కోల్‌కత ఒక్క మ్యాచ్ ఆడుతాయి. ఆ జట్లు.. ఆ మ్యాచ్‌లన్నీ గెలిస్తే వచ్చేవి 14 పాయింట్లే. ముంబై ఇండియన్స్; రాయల్ ఛాలెంజర్స్, ఢిల్లీ కేపిటల్స్ నేరుగా ప్లేఆఫ్‌కు చేరుకుంటే.. మిగిలిన ఆ ఒక్క బెర్త్ కోసం హైదరాబాద్, రాజస్థాన్, కోల్‌కత జట్లు పోటీ పడాల్సి ఉంటుంది. మెరుగైన నెట్ రన్‌రేట్ ఉన్న టీమ్ ప్లేఆఫ్‌కు చేరుకుంటుంది.

Story first published: Friday, October 30, 2020, 7:36 [IST]
Other articles published on Oct 30, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X