న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

SRH vs RCB: వార్నర్‌, పాండే, గార్గ్ ఔట్‌.. కష్టాల్లో సన్‌రైజర్స్‌!!

IPL 2020 SRH vs RCB: Yuzvendra Chahal gets Priyam Garg as SRH struggle in 132 chase

అబుదాబి: ఐపీఎల్‌ 2020లో భాగంగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరుగుతున్న ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బ్యాట్స్‌మన్‌ తడబడుతున్నారు. బెంగళూరు నిర్దేశించిన 132 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్‌ 67 పరుగులకు 4 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. శ్రీవాత్స్‌ గోస్వామీ (0), డేవిడ్‌ వార్నర్ (17), మనీశ్‌ పాండే (24), ప్రియం గార్గ్ (7)లు పెవిలియన్ చేరారు. ఆడమ్ జంపా, యుజ్వేంద్ర చహల్ అద్భుత బంతులు వేయడంతో.. కేన్ విలియమ్సన్‌ క్రీజులో ఉన్నా పరుగులు చేయడంలో ఇబ్బందిపడుతున్నాడు.

132 పరుగుల లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. మహ్మద్‌ సిరాజ్‌ వేసిన తొలి ఓవర్‌లోనే ఓపెనర్‌ శ్రీవాత్స్‌ గోస్వామీ వికెట్‌ కీపర్‌ డివిలియర్స్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ సమయంలో డేవిడ్‌ వార్నర్, మనీశ్‌ పాండేలు ఆచితూచి ఆడారు. ఇద్దరూ భారీ షాట్లకు పోకుండా నెమ్మదిగా ఆడారు. ఈ జోడి 41 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన అనంతరం వార్నర్ ఔట్ అయ్యాడు. మొహమ్మద్ సిరాజ్‌ వేసిన ఆరో ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు బాది ఊపుమీదున్న వార్నర్.. ఆ తర్వాతి బంతికే క్యాచ్ ఔట్ అయ్యాడు. పవర్‌ప్లే ఆఖరికి సన్‌రైజర్స్‌ 2 వికెట్లకు 48 పరుగులు చేసింది.

మనీశ్‌ పాండే, కేన్ విలియమ్సన్ సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టే ప్రయత్నం చేశారు. భారీ షాట్ ఆడే క్రమంలో పాండే పెవిలియన్ చేరాడు. ఆడమ్ జంపా వేసిన బంతి బ్యాట్‌కు సరిగా కనెక్ట్ కాకపోవడంతో డివిలియర్స్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. మరికొద్ది సేపటికే ప్రియం గార్గ్ కూడా ఔట్ అవ్వడంతో సన్‌రైజర్స్‌ పీఏకల్లోతు కష్టాల్లో పడింది. సన్‌రైజర్స్ 14 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసింది.‌ విజయానికి ఇంకా 36 బంతుల్లో 51 పరుగులు అవసరం. విలియమ్సన్‌ పోరాడుతున్నాడు.

అంతకుముందు మొదట బ్యాటింగ్‌ చేసిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు సాధారణ స్కోరే చేసింది. ఏబీ డివిలియర్స్ ‌(56: 43 బంతుల్లో 5 ఫోర్లు) అర్ధ శతకంతో రాణించడంతో 20 ఓవర్లలో 7 వికెట్లకు 131 పరుగులు చేసింది. అరోన్‌ ఫించ్ (32: 30 బంతుల్లో 3ఫోర్లు, సిక్స్‌) కొంతసేపు పోరాడటంతో బెంగళూరు ఆమాత్రం స్కోరు చేసింది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (6) మరోసారి నిరాశపరిచాడు. ఫామ్‌లో ఉన్న దేవదత్‌ పడిక్కల్ ‌(1), మొయిన్‌ అలీ (0), శివమ్‌ దూబే (8), వాషింగ్టన్‌ సుందర్‌ (5) అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు.

'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్' అవార్డు బుమ్రాకు ఇవ్వాల్సింది కాదు.. మంజ్రేకర్‌ సంచలన వ్యాఖ్యలు!!'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్' అవార్డు బుమ్రాకు ఇవ్వాల్సింది కాదు.. మంజ్రేకర్‌ సంచలన వ్యాఖ్యలు!!

Story first published: Friday, November 6, 2020, 22:48 [IST]
Other articles published on Nov 6, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X