న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'కెప్టెన్‌గా ధోనీకి అతి పెద్ద సవాల్ అదే.. వారిని ఎలా సమన్వయం చేస్తాడనేది కీలకం'

IPL 2020: Sanjay Bangar points out the biggest challenge for Chennai captain MS Dhoni

ముంబై: క్రికెట్‌ ప్రేమికులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) 2020 కోసం సమయం ఆసన్నమైంది. సుమారు ఆరు నెలలుగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ రోజుతో ఆ నిరీక్షణకు తెరపడనుంది. ఐపీఎల్‌ సంప్రదాయం ప్రకారం ఈసారి తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ముంబై ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్ల మధ్య జరగనుంది. ఐపీఎల్‌ చరిత్రలో ఈ రెండు జట్లు తలపడనుండటం ఇది 29వ సారి. చెన్నైతో ముఖాముఖి రికార్డులో రోహిత్‌ బృందం 17 మ్యాచ్‌ల్లో గెలుపొందగా.. ధోనీసేన 11 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.

ఐపీఎల్ 2020 ముందు చెన్నై సూపర్‌ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ముందున్న సవాళ్లపై టీమిండియా బ్యాటింగ్‌ కోచ్‌ సంజయ్‌ బంగర్‌ స్పందించాడు. స్టార్‌ స్పోర్ట్స్‌ క్రికెట్‌ కనెక్టెడ్‌ షోలో మాట్లాడుతూ తన అభిప్రాయం వెల్లడించాడు. 'ఒక కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీకి ఎంతో అనుభవం ఉందన్న విషయం నాకు తెలుసు. చెన్నై జట్టులోనూ అనేక మంది అనుభవజ్ఞులు ఉన్నారు. అయితే మైదానంలో వాళ్లని ఎలా ఉపయోగించుకుంటాడనే విషయంపైనే నాకు ఆసక్తి పెరిగింది' అని సంజయ్‌ అన్నాడు.

అనుభవపూర్వకంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌ అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్‌లోనూ పటిష్టంగా ఉందని సంజయ్‌ బంగర్‌ పేర్కొన్నాడు. అయితే ఫీల్డింగ్‌ విభాగం మాత్రమే చెన్నై జట్టుకు అతిపెద్ద సమస్య అని సంజయ్‌ గుర్తుచేశాడు. టీ20 ఫార్మాట్‌లో ఆటగాళ్లు చిరుతల్లా కదలాలని, ఫీల్డింగ్‌లో మంచి నైపుణ్యం ప్రదర్శించాలని చెప్పాడు. జట్టులో ఎక్కువగా సీనియర్లే ఉండడంతో ధోనీ వారిని ఎలా సమన్వయం చేస్తాడనేది కీలకంగా మారిందని పేర్కొన్నాడు. ఒక కెప్టెన్‌గా మహీకి ఇదే అతి పెద్ద సవాలని సంజయ్‌ అభిప్రాయపడ్డాడు.

ఎంఎస్ ధోనీ సారథ్యంలోని చెన్నై ఖాతాలో మూడు టైటిళ్లున్నాయి. అలాగే ఆడిన పది సీజన్లలో 8సార్లు ఫైనల్‌ చేరిందంటే సీఎస్‌కే నిలకడ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. కానీ ఈసారి ఇద్దరు ఆటగాళ్లు కరోనా బారిన పడడం.. సురేష్ రైనా, హర్భజన్‌ సింగ్ దూరం కావడం వారిని ఆందోళన పరుస్తోంది. ఈ పరిస్థితులను మహీ ఎలా అధిగమిస్తాడన్నది ఆసక్తికరమే. వాట్సన్‌, డుప్లెసి, రాయుడు, మురళీ విజయ్‌, జాదవ్‌, జడేజా, బ్రావోలతో బ్యాటింగ్‌ పటిష్టంగా కనిపిస్తోంది. చెన్నై ముఖ్యంగా స్పిన్‌ బౌలింగ్‌పై ఎక్కువగా ఆధారపడి ఉంది. తాహిర్‌, చావ్లా, జడేజా, కరణ్‌ శర్మ రూపంలో వారికి చక్కటి వనరులున్నాయి. పేస్‌లో చాహర్‌, ఎన్‌గిడి, బ్రావో, సామ్‌ కర్రాన్‌ సిద్ధంగా ఉన్నారు.

తుది జట్లు (అంచనా):

చెన్నై: వాట్సన్‌, విజయ్‌, రాయుడు, డుప్లెసి, ధోనీ, జాదవ్‌, జడేజా, బ్రావో, శార్దూల్‌, దీపక్‌ చాహర్‌, తాహిర్‌.

Story first published: Saturday, September 19, 2020, 8:47 [IST]
Other articles published on Sep 19, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X