న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

RR vs SRH: మసాలా ఘాటును రాజస్థాన్‌ తట్టుకోలేదు.. బిర్యానీ ఆర్డర్‌ను రద్దు చేయండి: సన్‌రైజర్స్‌

IPL 2020, RR vs SRH: Sunrisers Hyderabad official Twitter handle trolls Rajasthan Royals
IPL 2020 : Cancel The Biryani Order - SunRisers Hyderabad Hilariously Troll Rajasthan Royals

దుబాయ్‌: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)‌ 2020 ప్లేఆఫ్స్‌ రేసులో నిలవాలంటే కచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అదరగొట్టింది. యువ బ్యాట్స్‌మన్‌లు మనీశ్‌ పాండే (83 నాటౌట్:‌ 47 బంతుల్లో 4ఫోర్లు, 8 సిక్సర్లు), విజయ్‌ శంకర్ ‌(52 నాటౌట్:‌ 51 బంతుల్లో 6ఫోర్లు) అద్బుత ప్రదర్శన చేయడంతో సన్‌రైజర్స్‌ ఘన విజయాన్ని అందుకుంది. 155 పరుగుల లక్ష్య ఛేదనలో మనీశ్‌, శంకర్‌ అర్ధసెంచరీలతో రాణించడంతో 18.1 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 8 వికెట్ల తేడాతో రాజస్థాన్‌ రాయల్స్‌పై గెలుపొందింది.

 RR vs SRH: పాండే, శంకర్‌ మెరుపులు.. సన్‌రైజర్స్‌ ఘన విజయం.. ప్లేఆఫ్స్‌ ఆశలు సజీవం! RR vs SRH: పాండే, శంకర్‌ మెరుపులు.. సన్‌రైజర్స్‌ ఘన విజయం.. ప్లేఆఫ్స్‌ ఆశలు సజీవం!

బిర్యానీ ఆర్డర్‌ను రద్దు చేయండి:

ఈ విజయం అనంతరం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు రాజస్థాన్‌ రాయల్స్‌ను ట్రోల్ చేసి ప్రతీకారం తీర్చుకుంది. 'బిర్యానీ ఆర్డర్‌ను రద్దు చేయండి. మా స్నేహితులు మసాలా ఘాటును తట్టుకోలేరు. దాల్ బాటి మీకు సరిపోతుంది' అని సన్‌రైజర్స్‌ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. రాజస్థానీ ప్రధాన వంటకాల్లో దాల్ బాటి ఒకటి. ఈ వంటకం అక్కడ చాలా ఫేమస్ (మనకు హైదరాబాద్ బిర్యానీ లా). ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. సన్‌రైజర్స్‌ అభిమానులు కూడా రాయల్స్‌ను ట్రోల్ చేస్తున్నారు. 'ఇప్పుడు ట్వీట్ చేయండి' అని ఓ అభిమాని కామెంట్ చేయగా.. 'సన్‌రైజర్స్‌ దెబ్బకు హడలిపోయారు' అని మరొకరు ట్వీట్ చేశారు. 'ఒక లార్జ్ బిర్యానీ' అని సన్‌రైజర్స్‌ మరో ట్వీట్ చేసింది.

సన్‌రైజర్స్‌ను ట్రోల్ చేసిన రాయల్స్:

అయితే సన్‌రైజర్స్‌ ఈ ట్వీట్ చేయడానికి ఓ కారణం ఉంది. ఈ నెల 11న ఇరు జట్ల మధ్య జరిగిన పోరులో రాజస్థాన్‌ రాయల్స్ గెలిచింది. సన్‌రైజర్స్ నిర్దేశించిన 159 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్‌ 5 వికెట్లు కోల్పోయి మరో బంతి ఉండగానే ఛేదించింది. ఓడిపోతుందనుకున్న మ్యాచ్‌లో రాహుల్‌ తెవాటియా (45; 28 బంతుల్లో 4x4, 2x6), రియాన్‌ పరాగ్ ‌(42; 26 బంతుల్లో 2x4, 2x6)లు చివరివరకు నిలబడి అనూహ్య విజయాన్ని అందించారు. ఆ తర్వాత రాజస్థాన్‌.. సన్‌రైజర్స్‌ను ట్రోల్ చేసింది. 'హే జోమాటో.. మేము ఒక లార్జ్ హైదరాబాదీ బిర్యానీ కోసం ఆర్డర్ ఇవ్వాలనుకుంటు‌న్నాం. లొకేషన్: వన్ అండ్ ఓన్లీ రాయల్ మిరేజ్' అని పోస్ట్ చేసింది. ఆ రోజు ప్రపంచ బిర్యానీ దినోత్సవం కావడంతో.. 'వరల్డ్ బిర్యానీ డే' అని ట్యాగ్ చేసింది. అందుకు ప్రతీకారం సన్‌రైజర్స్ ఇప్పుడు తీర్చుకుంది.

మనీశ్‌, శంకర్‌ మెరుపులు:

మనీశ్‌, శంకర్‌ మెరుపులు:

155 పరుగుల ఛేదనలో సన్‌రైజర్స్‌కు శుభారంభం లభించలేదు. ఇన్నింగ్స్‌ మొదటి ఓవర్‌లోనే డేవిడ్ వార్నర్ (4) స్లిప్‌లో బెన్ ‌స్టోక్స్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. రాజ్‌పుత్‌ వేసిన తర్వాతి ఓవర్లో జానీ బెయిర్‌స్టో (10) ఫోర్‌, సిక్స్‌ బాది 11 పరుగులు రాబట్టాడు. జోఫ్రా ఆర్చర్‌ వేసిన మూడో ఓవర్లో బెయిర్‌స్టో పెవిలియన్‌ చేరాడు. 149kph వేగంతో వేసిన ఇన్‌స్వింగర్‌కు బెయిర్‌స్టో బౌల్డ్‌ అయ్యాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన మనీశ్‌, శంకర్‌ ఏ దశలోనూ వెనక్కి తగ్గలేదు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 140 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి అద్భుత విజయాన్ని అందించారు.

Story first published: Friday, October 23, 2020, 9:42 [IST]
Other articles published on Oct 23, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X