న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

‘పార్థివ్‌ను అట్టిపెట్టుకున్నారా?’: డీన్‌ జోన్స్‌ ట్విట్‌కు పంచ్‌ ఇచ్చిన పార్థివ్‌ పటేల్

IPL 2020 : Parthiv Patel Fitting Reply To Dean Jones || Oneindia Telugu
IPL 2020: Parthiv Patel replies to Dean Jones’ dig over RCB’s decision to retain him

హైదరాబాద్: వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం డిసెంబర్ 19వ తేదీన కోల్‌కతాలో ఆటగాళ్ల వేలం జరగనుంది. దీంతో ఆటగాళ్ల బదిలీలకు సంబంధించి శుక్రవారం తుది గడువు కావడంతో... రాబోయే సీజన్‌కు ముందు తమ జట్లను మరింత బలంగా మార్చుకోవడానికి పలు ఫ్రాంచైజీలు కొంతమంది ఆటగాళ్లను ట్రేడింగ్ ద్వారా సొంతం చేసుకున్నాయి.

ఇక, జట్టుకు భారంగా మారిన ఆటగాళ్లను ఆయా ఫ్రాంఛైజీలు వేలానికి విడుదల చేశాయి. మొత్తంగా 8 జట్లు 71 మంది ప్లేయర్లను వేలానికి విడుదల చేశాయి. ఇందులో 34 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. అన్ని ఫ్రాంఛైజీలు కలిపి మొత్తంగా 127 మంది ఆటగాళ్లను కొనసాగించాయి. తమ ప్రధాన ప్లేయర్లను అట్టిపెట్టుకోగా.. వేలంలో సొమ్ము కోసం స్టార్లను సైతం కొన్ని జట్లు వదులుకున్నాయి.

IPL 2020: సన్‌రైజర్స్ విడుదల చేసిన ఆటగాళ్లు వీరే!, పర్స్‌లో మిగిలిన నగదు ఇదేIPL 2020: సన్‌రైజర్స్ విడుదల చేసిన ఆటగాళ్లు వీరే!, పర్స్‌లో మిగిలిన నగదు ఇదే

కోహ్లీ సారథ్యంలోని బెంగళూరు రాయల్ చాలెంజర్స్ (ఆర్సీబీ) అత్యధికంగా 12 మందిని విడుదల చేసింది. అనంతరం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) డైరెక్టర్‌ మైక్‌హెసన్‌ తన ట్విట్టర్‌లో "ఐపీఎల్‌ 2020 కోసం మీరంతా జట్టులో ఉండటం బాగుంది" అంటూ ట్వీట్‌ చేశాడు. ఈ ట్వీట్‌కు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌, వ్యాఖ్యాత డీన్‌జోన్స్‌ తన ట్విట్టర్‌లో 'పార్థివ్‌ను అట్టిపెట్టుకున్నారా?' అంటూ వెటకారంగా స్పందించాడు.

డీన్ జోన్స్ ట్వీట్‌పై పార్థివ్‌ స్పందించాడు. "ఐపీఎల్‌ సాగుతున్నప్పుడు సెలక్ట్‌ డగౌట్‌లో మీరు ప్రశాంతంగా ఉంటారని" అంటూ పార్థివ్‌ ఘాటుగా బదులిచ్చాడు. వచ్చే సీజన్‌లో పార్థివ్‌ మెరుగైన ప్రదర్శన చేయాలని ఆర్సీబీ తనవద్దే అట్టిపెట్టుకుంది. ఆర్సీబీ తరుపున పార్థివ్‌ ఇప్పటివరకు 34 మ్యాచుల్లో 373 పరుగులు సాధించాడు.

Story first published: Tuesday, November 19, 2019, 8:14 [IST]
Other articles published on Nov 19, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X