MI vs KXIP Preview:ముంబైతో పంజాబ్ ఢీ.. రాహుల్ సేనకు కఠిన పరీక్ష..ప్లేఆఫ్స్‌ అవకాశాలు సజీవంగా ఉండేనా?

IPL 2020: MI Vs KXIP | KXIP Must Win Against Mumbai Indians For Play Off Chances | Oneindia Telugu

హైదరాబాద్: ఐపీఎల్ 2020లో భాగంగా ఆదివారం రాత్రి 7.30గంటలకు దుబాయ్ వేదికగా ముంబై ఇండియన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ జట్లు తలపడనున్నాయి. ముంబై వరుస విజయాలతో దూసుకుపోతూ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉండగా.. వరుస పరాజయాలతో పంజాబ్ అట్టడుగున ఉంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానం కోసం ఢిల్లీతో రోహిత్‌సేన దాగుడుమూతలు ఆడుతోంది.

మరోసారి పంజాబ్‌ను చిత్తుచేసి అగ్రస్థానానికి ఎగబాకాలని చూస్తోంది. ఇక చివరి స్థానంలో ఉన్న పంజాబ్‌ గత మ్యాచ్‌ గెలుపుతో ప్లేఆఫ్స్‌ అవకాశాలను కాపాడుకుంది. మరి ఈరోజు పటిష్ట రోహిత్‌సేనపై విజయం సాధిస్తుందో లేదో చూడాలి. మ్యాచ్ నేపథ్యంలో రెండు జట్ల బలాలు, బలహీనతలేంటో ఓసారి చూద్దాం.

పటిష్టంగా ముంబై

పటిష్టంగా ముంబై

ఐపీఎల్ 2020లో ముంబై ఆటగాళ్లు ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొడుతున్నారు. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో పటిష్టంగా ఉంది. అందరూ మంచి ఫామ్‌లో ఉన్నారు. గత మ్యాచ్‌లో జేమ్స్ ప్యాటిన్సన్‌కు విశ్రాంతి ఇచ్చి కౌల్టర్‌నైల్‌ను తీసుకొచ్చాడు రోహిత్‌. ఈ మ్యాచ్‌లోను ముంబై మార్పులు చేయవచ్చు. జట్టులో తీరిక లేకుండా వరుస మ్యాచ్‌లాడుతున్న ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చే అవకాశాలున్నాయి. యువ ఆటగాళ్లను ప్రోత్సహించే ముంబైలో.. ఇంతవరకూ ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడే అవకాశం రాని ఆటగాళ్లు చాలామంది ఉన్నారు. ముంబై ఆడిన ఎనిమిది మ్యాచుల్లో ఆరు విజయాలు సాధించింది. రన్‌రేట్‌ అన్ని జట్లకంటే మెరుగ్గా ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే ఢిల్లీని వెనక్కి నెట్టి మరోసారి అగ్రస్థానానికి ఎగబాకుతుంది.

గేల్‌పై భారీ ఆశలు

గేల్‌పై భారీ ఆశలు

పంజాబ్‌ జట్టు క్రిస్ గేల్‌పై భారీ ఆశలు పెట్టుకుంది. వరుస ఓటములతో ఢీలాపడ్డ ఆ జట్టును వచ్చీరావడంతోనే ఓ భారీ ఇన్నింగ్స్‌ ఆడి విజయం అందించాడు. ఓపెనర్లు బాగా ఆడుతున్నారు. పూరన్ బ్యాట్ జులిపించేందుకు సిద్ధంగా ఉన్నాడు. బ్యాటింగ్‌లో గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ ఒక్కడు ఫామ్‌ అందుకుంటే పంజాబ్‌కు భారీ స్కోరు సులభమే. రాహుల్‌ సేనను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న సమస్య బౌలింగ్‌. షమీకి తోడు మంచి ఫాస్ట్‌బౌలర్‌ లేకపోవడం ఆ జట్టు నుంచి విజయాలను దూరం చేస్తోంది. గెలుపు కీలకమైన ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ ముంబైని చిత్తు చేయాలంటే సమష్టిగా రాణించడం అత్యవసరం.

గత రికార్డులు

గత రికార్డులు

ఇప్పటి వరకూ ఈ రెండు జట్ల మధ్య జరిగిన 25 మ్యాచుల్లో ముంబై 14 విజయాలు సాధించింది. ఈ సీజన్‌లో జరిగిన మ్యాచ్‌లోనూ పంజాబ్‌ మీద రోహిత్‌ సేనదే పైచేయి. దబాయ్‌ వేదికగా ముంబై జట్టు ఆడిన నాలుగు మ్యాచుల్లో మూడు గెలిచింది. ఒక మ్యాచులో మాత్రమే ఓడింది. పంజాబ్‌ ఐదు మ్యాచ్‌లాడి రెండింట్లో గెలిచి మూడింట్లో ఓటమిపాలైంది. దుబాయ్ పిచ్‌పై పరుగుల వరద పారే అవకాశం ఉంది. టాస్ గెలిచిన కెప్టెన్ బ్యాటింగ్ ఎంచుకుంటాడు.

తుది జట్లు (అంచనా):

తుది జట్లు (అంచనా):

ముంబై: రోహిత్ శర్మ (కెప్టెన్), క్వింటన్ డికాక్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, కీరన్ పొలార్డ్, కృనాల్ పాండ్యా, కౌల్టర్ నైల్‌, రాహుల్ చహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా.

పంజాబ్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, క్రిస్‌ గేల్, నికోలస్ పూరన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌, దీపక్ హుడా, క్రిస్ జోర్డాన్, క్రిష్ణప్ప గౌతమ్‌, మొహమ్మద్ షమీ, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్.

మ్యాచ్‌ జరుగుతుండగా.. సిగరెట్ తాగుతూ దొరికిపోయిన స్టార్ ప్లేయర్ (వీడియో)!!

For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Sunday, October 18, 2020, 16:16 [IST]
Other articles published on Oct 18, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X