న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీ..జెర్సీ నంబర్ 3 ధరించిన క్రికెట్ దేవుడు: సూర్యకుమార్ ట్వీట్: స్లెడ్జింగ్‌తో మళ్లీ

IPL 2020: MIs Suryakumar Yadavs Old Tweets Praising Kohli Resurface after sledging

అబుధాబి: సూర్యకుమార్ యాదవ్.. ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో విస్తృతంగా వినిపిస్తోన్న పేరు. అతని మీద సానుభూతి సునామీని కురిపిస్తున్నారు అభిమానులు. ఐపీఎల్-2020 సీజన్‌లో అద్భుతంగా రాణిస్తుండటం ఒక ఎత్తయితే.. అతణ్ని భారత క్రికెట్ జట్టులోకి తీసుకోకపోవడం మరో ఎత్తుగా మారింది. సూర్యకుమార్ యాదవ్‌కు టీమిండియాలో చోటు కల్పించకపోవడం పట్ల భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అభిమానులు నిప్పులు చెరుగుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లోనే అతనిపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కప్టెన్ విరాట్ కోహ్లీ స్లెడ్జింగ్‌కు పాల్పడటం పుండు మీద కారం చల్లినట్టయింది.

దేవుడిలా ఆరాధించినా..

సూర్యకుమార్ యాదవ్.. విరాట్ కోహ్లీని ఆకాశానికెత్తేస్తూ ఇదివరకు చేసిన ట్వీట్లను వెలికి తీస్తున్నారు అభిమానులు. విరాట్ మీద యాదవ్‌కు ఉన్న అభిమానం ఎలాంటిదో మరోసారి గుర్తుకు తీసుకొస్తున్నారు. విరాట్‌ను సూర్యకుమార్ యాదవ్ క్రికెట్ దేవుడిలా భావించే వాడని, అలాంటి ప్లేయర్.. స్లెడ్జింగ్‌కు పాల్పడటాన్ని తప్పుపడుతున్నారు. ఈ విషయంలో కోహ్లీని కూడా కాదని సూర్యకుమార్ యాదవ్‌కు అండగా నిల్చుంటున్నారు. విరాట్ కోహ్లీ గాడ్ ఆఫ్ క్రికెట్‌గా అభిమానించే వాడంటూ పాత ట్వీట్లను వెలుగులోకి తీసుకొస్తున్నారు.

జెర్సీ నంబర్ 3

2016 నుంచీ సూర్యకుమార్ యాదవ్ వరుసగా విరాట్ కోహ్లీపై ట్వీట్స్ చేస్తున్నాడని, దాన్ని బట్టి చూస్తే అతను కోహ్లీని ఎంతగా అభిమానించాడో అర్థం చేసుకోవచ్చని చెబుతున్నారు. విరాట్ కోహ్లీ నడయాడే క్రికెట్ దేవుడంటూ సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు. జెర్సీ నంబర్ 3ని ధరించిన దేవుడని, భారత జట్టు ఆపత్కాలంలో ఉన్న ప్రతీసారీ కాపాడుతుంటాడని చెప్పాడు. ఈ మేరకు 2016 మార్చి 20వ తేదీన సూర్యకుమార్ ఓ ట్వీట్ చేశాడు. విరాట్ కోహ్లీ క్రికెట్‌లో అత్యున్నత స్థానానికి ఎదిగాడని ప్రశంసిస్తూ 2019లో మరో ట్వీట్ చేశాడు. ప్రపంచంలోనే అత్యున్నత స్థాయికి కోహ్లీ ఎలా చేరుకున్నాడు? ఎవరైనా చెప్పగలరా? అంటూ 2019 డిసెంబర్ 5న ఇంకో ట్వీట్ పోస్ట్ చేశాడు.

అలాంటి అభిమానిని ప్రోత్సహించాల్సింది పోయి..

అలాంటి టాలెంట్ ఉన్న తన అభిమానిని ప్రోత్సహించాల్సింది పోయి.. విరాట్ కోహ్లీ స్లెడ్జింగ్‌కు పాల్పడటం ఏ మాత్రం సమర్థించలేమని అంటున్నారు. తన వైఖరి ఏమిటో.. ఈ ఒక్క ఘటనతో కోహ్లీ నిరూపించుకున్నాడని మండిపడుతున్నారు. ఈ విషయంలో అభిమానులు టీమిండియా మాజీ కేప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో విరాట్ కోహ్లీని కంపేర్ చేస్తున్నారు. యంగ్ క్రికెటర్లతో ధోనీ వ్యవహరించే విధానానికి, ప్రోత్సహించే తీరుకు విరాట్ ఏ మాత్రం సరితూగడని తేల్చి చెబుతున్నారు.

ధోనీతో కంపేర్ చేస్తే..

యంగ్ క్రికెటర్లను ప్రోత్సహించడంలో ధోనీతో తాను సరితూగలేనని కోహ్లీ నిరూపించుకున్నట్టయిందని విమర్శిస్తున్నారు. ఏ కారణం లేకుండానే సూర్యకుమార్ యాదవ్‌పై కోహ్లీ ఎందుకు ఆగ్రహాన్ని వ్యక్తం చేయాల్సి వచ్చిందనేది అర్థం కావట్లేదని అంటున్నారు. ముంబై ఇండియన్స్‌తో అబుధాబి స్టేడియంలో బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ప్రవర్తించిన విధానం పట్ల వెల్లువెత్తిన విమర్శలు ఇప్పట్లో తగ్గేలా కనిపించట్లేదు. కోహ్లీలో స్పోర్టివ్‌నెస్ ఏ మాత్రం లేదని, ఆ విషయాన్ని అతను మరోసారి తనకు తానుగా నిరూపించుకున్నాడని విమర్శిస్తున్నారు.

Story first published: Thursday, October 29, 2020, 13:42 [IST]
Other articles published on Oct 29, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X