న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

KXIP vs KKR: రాహుల్‌‌, మయాంక్‌ హాఫ్ సెంచరీలు.. లక్ష్యం దిశగా పంజాబ్!!

IPL 2020, KXIP vs KKR: KL Rahul, Mayank Agarwal in steady start for KXIP

అబుదాబి: కోల్‌కతా నైట్‌రైడర్స్‌ నిర్దేశించిన 165 పరుగుల లక్ష్య ఛేదనలో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ ఓపెనర్లు దూకుడుగా ఆడుతున్నారు. వరుస పరాజయాలు వెంటాడుతున్న వేళ పంజాబ్‌ ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌, మయాంక్‌ అగర్వాల్‌ అదిరే ఆరంభాన్ని ఇచ్చారు. ఇద్దరూ హాఫ్ సెంచరీలు బాదడంతో పంజాబ్ 100 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. రాహుల్‌ 42 బంతుల్లో అర్ధ శతకం బాదగా.. మయాంక్ 33 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఈ జోడీని విడదీసేందుకు కోల్‌కతా బౌలర్లు అష్టకష్టాలు పడుతున్నారు.

లక్ష్య ఛేదనలో పంజాబ్‌ ఓపెనర్లు ఆచితూచి ఆడారు. ప్రసిద్‌ కృష్ణ వేసిన రెండో ఓవర్‌లో కేఎల్ రాహుల్‌ ఇచ్చిన క్యాచ్‌ను ఆండ్రీ రస్సెల్‌ వదిలేశాడు. క్యాచ్‌ అందుకునే సమయంలో రస్సెల్‌ గాయపడటంతో మైదానాన్ని వీడాడు. ఈ అవకాశాన్ని రాహుల్ చక్కగా వినియోగించుకున్నాడు. క్రీజులో కుదురుకున్నాక బౌండరీల మోత మోగించాడు. ప్రసిద్‌ వేసిన నాలుగో ఓవర్‌లో రాహుల్‌ మూడు బౌండరీలు బాడీ పంజాబ్ స్కోర్ బోర్డును పరిగెత్తించాడు. ఆపై మయాంక్ కూడా వీలుచిక్కినపుడల్లా బౌండరీలు బాదాడు.

క్రీజులో కుదురుకున్న రాహుల్‌, మయాంక్ కోల్‌కతా బౌలర్లపై ఆధిపత్యం చెలాయిస్తూ.. వేగంగా పరుగులు చేశారు. ఈ క్రమంలోనే రాహుల్‌ 42 బంతుల్లో అర్ధ శతకం బాదాడు. ఆపై మయాంక్ కూడా 33 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. దీంతో పంజాబ్ 100 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ధాటిగా ఆడే క్రమంలో మయాంక్ 15వ ఓవర్లో పెవిలియన్ చేరాడు. 15 ఓవర్లకు పంజాబ్‌ వికెట్‌ నష్టానికి 117 పరుగులు చేసింది. రాహుల్ ‌(59), పూరన్ (1) క్రీజులో ఉన్నారు.

అంతకుముందు యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌(57: 47 బంతుల్లో 5ఫోర్లు), కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌(58: 29 బంతుల్లో 8ఫోర్లు, 2సిక్సర్లు) అర్ధశతకాలతో రాణించడంతో కోల్‌కతా 20 ఓవర్లలో 6 వికెట్లకు 164 పరుగులు చేసింది. ఆరంభం నుంచి పంజాబ్‌ బౌలర్లు ధాటిగా బౌలింగ్‌ చేయడంతో కోల్‌కతా పోరాడే స్కోరే చేసింది. పంజాబ్‌ బౌలర్లలో అర్షదీప్‌ సింగ్‌(1/25), రవి బిష్ణోయ్‌(1/25), మహ్మద్‌ షమీ(1/30) బ్యాట్స్‌మెన్‌ను నిలువరించారు.

KXIP vs KKR: గేల్‌ పంజాబ్ తలరాతను మార్చగలడు.. ఎందుకు ఆడించట్లేదు.. ఫాన్స్ ఫైర్KXIP vs KKR: గేల్‌ పంజాబ్ తలరాతను మార్చగలడు.. ఎందుకు ఆడించట్లేదు.. ఫాన్స్ ఫైర్

Story first published: Saturday, October 10, 2020, 19:06 [IST]
Other articles published on Oct 10, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X