న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'బ్యాటింగ్‌ ఎంచుకుని తప్పుచేశాం.. అప్పుడే మ్యాచ్‌ మా నుంచి చేజారిపోయింది'

IPL 2020: KKR skipper Eoin Morgan says Did a big mistake after winning the toss

అబుదాబి: టాస్‌ గెలిచిన తర్వాత బ్యాటింగ్ ఎంచుకుని తప్పుచేశాం అని కోల్‌కతా నైట్‌రైడర్స్ ‌(కేకేఆర్‌) కెప్టెన్‌ ఇయాన్ మోర్గాన్‌ అభిప్రాయపడ్డాడు. బ్యాటింగ్‌కు బదులుగా బౌలింగ్‌ ఎంచుకోవాల్సిందన్నాడు. బుధవారం జరిగిన పోరులో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) 8 వికెట్ల తేడాతో కోల్‌కతా‌పై ఘన విజయం సాధించింది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. మహ్మద్‌ సిరాజ్‌ దెబ్బకు మోర్గాన్‌ (34 బంతుల్లో 30; 3 ఫోర్లు, 1 సిక్స్‌) మినహా అంతా విఫలమయ్యారు.

మ్యాచ్ అనంతరం కేకేఆర్‌ కెప్టెన్‌ ఇయాన్ మోర్గాన్‌ మాట్లాడుతూ... 'టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ తీసుకోవడమే మేం చేసిన మొదటి తప్పు. లేకపోతే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేదేమో. ఇన్నింగ్స్ ఆరంభంలోనే 4-5 వికెట్లు కోల్పోయినప్పుడే మ్యాచ్‌ మా చేతుల్లోంచి చేజారిపోయిందని అర్థమైంది. బెంగళూరు బౌలర్లు బాగా బౌలింగ్‌ వేశారు. ఈ మ్యాచ్‌ మాకు ఒక గుణపాఠం నేర్పింది. జట్టులో భారత యువ ఆటగాళ్లను ప్రోత్సహిస్తాం.సునీల్ నరైన్‌, ఆండ్రీ రసెల్‌ ఫామ్‌ అందుకుంటారని ఆశిస్తున్నాం. త్వరలోనే వాళ్లు జట్టులోకి వస్తారని భావిస్తున్నాం' అని తెలిపాడు.

అబుదాబి వేదికగా బుధవారం బెంగళూరుతో కోల్‌కతా తలపడింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన కోల్‌కతా మొదట బ్యాటింగ్‌ ఎంచుకుంది. మ్యాచ్‌ ప్రారంభంలోనే బెంగళూరు పేసర్లు ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌పై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా పేసర్ మహ్మద్‌ సిరాజ్‌ విజృంభించి మూడు కీలక వికెట్లు పడగొట్టి కోల్‌కతాను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. వరుసగా రెండు మెయిడిన్‌ ఓవర్లు వేశాడు. రాహుల్ త్రిపాఠి, నితీష్ రాణా, టామ్ బాంటన్ వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. 4-2-8-3.. ఇవి మహ్మద్‌ సిరాజ్‌ గణాంకాలు. మిగతా బౌలర్లంతా కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో కోల్‌కతా కేవలం 84 పరుగులకే పరిమితమైంది.

లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో దేవదత్ పడిక్కల్, ఆరోన్ ఫించ్‌ తొలి వికెట్‌కు 38 బంతుల్లో 46 పరుగులు జోడించారు. వీరిద్దరు ఒకే స్కోరు వద్ద అవుటైనా.. గుర్‌కీరత్‌ సింగ్ మాన్ (26 బంతుల్లో 21 నాటౌట్‌; 4 ఫోర్లు), విరాట్ కోహ్లీ (17 బంతుల్లో 18 నాటౌట్‌; 2 ఫోర్లు) కలిసి మిగతా లాంఛనం పూర్తి చేశారు. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉన్న కోల్‌కతాకు ప్లేఆఫ్స్‌ ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. మిగిలిన నాలుగు మ్యాచులలో గెలిస్తే అధికారిక బెర్త్ ఖాయం. కోల్‌కతా తన తర్వాతి మ్యాచ్‌లలో ఢిల్లీ, పంజాబ్‌, చెన్నై, రాజస్థాన్‌లతో తలపడాల్సి ఉంది.

KKR vs RCB: అతనికి బౌన్సర్ వేయమని కోహ్లీ చెప్పాడు.. నేను వేయలేదు.. ఆ తర్వాత: సిరాజ్‌KKR vs RCB: అతనికి బౌన్సర్ వేయమని కోహ్లీ చెప్పాడు.. నేను వేయలేదు.. ఆ తర్వాత: సిరాజ్‌

Story first published: Thursday, October 22, 2020, 15:36 [IST]
Other articles published on Oct 22, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X