న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

గిల్‌ దూకుడుగా ఆడు.. లేదంటే మరొకరు ఓపెనింగ్ చేస్తారు: సెహ్వాగ్

IPL 2020: KKR Should Demote Shubman Gill in The Batting Order if he Cannot be More Aggressive Says Virender Sehwag

ఢిల్లీ: కోల్‌కతా నైట్ రైడర్స్ యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌ను టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ హెచ్చరించాడు. గిల్ పవర్ ప్లేలో మరింత దూకుడుగా ఆడాలని, లేదంటే మేనేజ్‌మెంట్ అతణ్ని మరో స్థానంలో బ్యాటింగ్‌కు దింపాలన్నాడు. ఈ సీజన్లో కోల్‌కతా బ్యాట్స్‌మెన్ ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. రాహుల్ త్రిపాఠి, ఇయాన్ మోర్గాన్ అడపాదడపా మెరుస్తున్నా.. నితీశ్ రాణా, దినేశ్ కార్తిక్, ఆండ్రీ రసెల్ పూర్తిగా విఫలమవుతున్నారు. ఇక గిల్ 8 మ్యాచ్‌ల్లో 275 పరుగులు చేసినప్పటికీ.. భారీ ఇన్నింగ్స్ మాత్రం ఆడలేకపోయాడు. అతడి స్ట్రైక్ రేట్ కూడా తక్కుగానే ఉంది.

'కోల్‌కతా యాజమాన్యం టాప్ ఆర్డర్‌లో శుభ్‌మన్ గిల్‌కు చాలా అవకాశాలు ఇచ్చింది. పవర్ ప్లేలో దూకుడుగా ఆడామని గిల్‌కు చెప్పే సమయం వచ్చింది. అతడు దూకుడుగా ఆడలేకపోతే బ్యాటింగ్ ఆర్డర్లో వెనక్కి పంపి.. మరొకర్ని ఓపెనర్‌గా పంపాలి. మ్యాచ్ గెలవాలంటే మంచి ఆరంభం అవసరం. పునాది సరిగా లేకపోతే.. బలమైన ఇన్నింగ్స్‌ను నిర్మించలేం' అని తాజాగా వీరేంద్ర సెహ్వాగ్ క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ పైవిధంగా పేర్కొన్నాడు.

తమ బలాలేంటో కోల్‌కతా జట్టు కచ్చితంగా తెలుసుకోవాలని, తుది జట్టు ఎంపిక విషయమై బలమైన నిర్ణయాలు తీసుకోవాలని వీరేంద్ర సెహ్వాగ్ సూచించాడు. పునాది బలంగా లేకపోతే.. గోడలా కుప్పకూలుతుందన్నాడు. సరైన ఆటగాళ్ల బృందాన్ని గుర్తించి.. మిగిలిన టోర్నమెంట్ కోసం వారికి స్వేచ్ఛగా ఆడే అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నాడు. కెప్టెన్ తన జట్టు ఎక్కడ తప్పు చేస్తుందో గుర్తించి వాటిని సరిదిద్దుకోవడం చాలా ముఖ్యమన్నాడు. లీగ్ దశలో మిగిలిన ఆటలపై కోల్‌కతా దృష్టి పెట్టాలని సెహ్వాగ్ చెప్పాడు.

అబుదాబీ వేదికగా ఈ రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తలపడనుంది. కోల్‌కతా నిండా ప్రతిభావంతులైన క్రికెట్లున్నప్పటికీ ఆ జట్టు విజయాల బాట మాత్రం పట్టడం లేదు. దినేశ్‌ కార్తిక్‌ నుంచి సారథ్య బాధ్యతలను అందుకున్న ఇయాన్‌ మోర్గాన్‌ తొలి మ్యాచ్‌లోనే ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. కొత్త కెప్టెన్ ఈ మ్యాచ్‌లో ఏం మ్యాజిక్ చేస్తాడోనని చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

తుది జట్టు (అంచనా):
కోల్‌కతా: రాహుల్ త్రిపాఠి, శుభ్‌మన్ గిల్, నితీశ్ రాణా, ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), దినేశ్ కార్తిక్, ఆండ్రీ రసెల్, క్రిస్‌ గ్రీన్‌/లుకీ ఫెర్గుసన్‌, ప్యాట్ కమిన్స్, శివమ్ మావి, వరుణ్ చక్రవర్తి, ప్రసిద్ధ్ కృష్ణ.

'నిజానికి రాజస్తాన్‌నే విజయం వరించాలి.. కానీ డివిలియర్స్‌ మ్యాచ్‌ను లాగేసుకున్నాడు''నిజానికి రాజస్తాన్‌నే విజయం వరించాలి.. కానీ డివిలియర్స్‌ మ్యాచ్‌ను లాగేసుకున్నాడు'

Story first published: Sunday, October 18, 2020, 14:21 [IST]
Other articles published on Oct 18, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X