
మీ అభిమానం మరువలేనిది:
వీడియోలో విరాట్ కోహ్లీ మాట్లాడుతూ... 'బెంగళూరు అభిమానులకు హాయ్. ఇన్ని సంవత్సరాలుగా మీరు మమల్ని ఎంతో ఆదరించారు. ఇకపై కూడా ఇదే అభిమానాన్ని చూపిస్తూ.. మాకు అండగా ఉంటారని నమ్ముతున్నా. త్వరలో ఐపీఎల్-13 వేలం జరగనుందని అందరి తెలిసిందే. వేలంలోకి రానున్న ఆటగాళ్ల ఎంపికకు సంబంధించి మా జట్టు యాజమాన్యంతో ఇప్పటికే చర్చలు జరిపా. కోచ్‌లు మైక్ హస్సీ, సైమన్ కటిచ్‌లు తమ శక్తి మేర కష్టపడుతున్నారు' అని తెలిపాడు.

స్ట్రాంగ్ టీమ్‌ను చూడనున్నారు
'జట్టు యాజమాన్యంతో ఇప్పటికే వేలంకు సంబంధించి సంప్రదింపులు జరిపాం. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నాం. వేలంలో అన్ని రకాలుగా నైపుణ్యం ఉన్న ఆటగాళ్లను తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. వచ్చే సీజన్‌లో స్ట్రాంగ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీమ్‌ను చూడబోతున్నారు. డిసెంబర్ 19న ఏం జరుగుతుందో చూద్దాం' అని కోహ్లీ వీడియోలో అన్నాడు.

ఒక్క టైటిల్ గెలవలేదు:
ఐపీఎల్ సీజన్ ఆరంభం నుంచి ఒక్క టైటిల్ కూడా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు గెలవలేదు. ఇప్పటివరకు జరిగిన 12 ఐపీఎల్ సీజన్లలో మూడు సార్లు 2009, 2011, 2016 లో రన్నరఫ్‌తో సరిపెట్టుకుంది. ఇక మిగతా తొమ్మిది సీజన్లలో పేలవ ఆటతీరును కనబర్చింది. 2016 తర్వాత జరిగిన మూడు సీజన్లలో అత్యంత చెత్త ప్రదర్శనను నమోదు చేసి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. ఈసారి ఎలా ఆడుతుందో చూడాలి.
వేలంలో స్టార్ ఆటగాళ్లు
డిసెంబర్ 19న కోల్‌కతాలో ఐపీఎల్ వేలం జరగనుంది. ఈసారి బెంగుళూరు 13 ఆటగాళ్లను అట్టిపెట్టుకోగా.. అందులో ఇద్దరు విదేశీ ఆటగాళ్లున్నారు. మిగతా 12 స్థానాలకు ఆటగాళ్ల ఎంపిక కోసం రూ. 27.90 కోట్లతో వేలంలోకి దిగనుంది. స్టార్ ఆటగాళ్లు గ్లెన్ మాక్స్‌వెల్, ఇయాన్ మోర్గాన్, పాట్ కమిన్స్, క్రిస్ మోరిస్, రాబిన్ ఉతప్ప, క్రిస్‌లిన్, ఆరోన్ ఫించ్, జేసన్ రాయ్ వేలంలో ఉన్నారు. ఇద్దరు ముగ్గురు ఆటగాళ్లను తీసుకున్నా బెంగళూరు రాత మారనుంది.


Click it and Unblock the Notifications












