న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2020: రాజస్థాన్‌తో 9 ఏళ్ల బంధం వీడనుందా?, ఢిల్లీ క్యాపిటల్స్‌కు రహానే?

IPL 2020 Auction : Ajinkya Rahane Set To Leave Rajasthan Royals After 9 Years || Oneindia Telugu
IPL 2020: Ajinkya Rahane to Leave Rajasthan Royals After 9 Seasons?

హైదరాబాద్: ఐపీఎల్ ప్రాంఛైజీ రాజస్థాన్ రాయల్స్‌కు టీమిండియా టెస్టు వైస్ కెప్టెన్ అజ్యింకె రహానే గుడ్ బై చెప్పనున్నాడా? అంటే అవుననే వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్ 2020 సీజన్ కోసం ట్రేడింగ్‌ విండో ఆరంభమైన సంగతి తెలిసిందే. ఆటగాళ్ల బదిలీలకు నవంబర్ 14ని చివరి గడువు తేదీగా ప్రకటించడంతో ఫ్రాంచైజీలు విడుదల చేసే ఆటగాళ్ల జాబితాను సిద్ధం చేసుకున్నాయి.

ఐపీఎల్ ట్రేడింగ్ ముగిసిన తర్వాత డిసెంబర్‌ 19న కోల్‌కతాలో ఐపీఎల్‌ వేలం జరగనుంది. హిందూస్థాన్ టైమ్స్‌లో వచ్చిన రిపోర్ట్ ప్రకారం అజ్యింకె రహానే వచ్చే సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఆడనున్నట్లు తెలుస్తోంది. రాజస్థాన్ రాయల్స్ జట్టుకు రహానే తొమ్మిదేళ్లు ప్రాతినిథ్యం వహించాడు.

2011లో ముంబై ఇండియన్స్‌ నుంచి రాజస్థాన్‌కు మారిన రహానే అప్పట్నుంచి ఇదే ఫ్రాంఛైజీకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. 2012 సీజన్‌లో రాజస్తాన్‌ తరఫున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రహానే నిలిచాడు. ముంబైకి చెందిన రహానే ధర రూ. 4 కోట్లు. దీంతో అతడిని విడుదల చేస్తే అవకాశం ఉంది. అలా కాకుంటే ముందుగానే వేరే ఫ్రాంఛైజీ నగదు ఒప్పందంపై అతన్ని తీసుకునే అవకాశాలు కూడా లేకపోలేదు.

India vs Bangladesh: వికెట్ దూరంలో అశ్విన్, కోహ్లీ ముంగిట అరుదైన రికార్డు!India vs Bangladesh: వికెట్ దూరంలో అశ్విన్, కోహ్లీ ముంగిట అరుదైన రికార్డు!

ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి ఇద్దరు ఆటగాళ్లను

ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి ఇద్దరు ఆటగాళ్లను

ఈ ధరకు రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి ఇద్దరు ఆటగాళ్లను ట్రేడింగ్ ద్వారా తీసుకునేందుకు ముందుకొచ్చింది. ఐపీఎల్ 2019 సీజన్‌లో రహానే ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ 2020 వేలానికి ముందు రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ వద్ద రూ. 7.15 కోట్లు నగదు ఉంది.

2008 ఆరంభ సీజన్‌లో టైటిల్ విజేతగా

2008 ఆరంభ సీజన్‌లో టైటిల్ విజేతగా

2008 ఆరంభ సీజన్‌లో టైటిల్ విజేతగా నిలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆ తర్వాత ఇప్పటివరకు ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకోలేకపోయింది. ఐపిఎల్ బదిలీ తేదీ ముగిసిన తర్వాత రాజస్థాన్ ఫ్రాంచైజి మరి కొంతమంది ఆటగాళ్లను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఈ జాబితాలో స్టువర్ట్ బిన్నీ, లియామ్ లివింగ్ స్టోన్, అష్టన్ టర్నర్, జయదేవ్ ఉనాడ్కట్‌లు ఉన్నారు.

వచ్చే సీజన్‌లో ముంబై ఇండియన్స్‌కు ట్రెంట్‌ బౌల్ట్‌

వచ్చే సీజన్‌లో ముంబై ఇండియన్స్‌కు ట్రెంట్‌ బౌల్ట్‌

ఐపీఎల్‌ జట్లు ట్రేడింగ్‌ విండో అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాయి. ఇతర జట్లలో తమకు నచ్చిన ఆటగాళ్లను తీసుకొనేందుకు బేరసారాలు జరుపుతున్నాయి. ఇందులో భాగంగా న్యూజిలాండ్‌ ఎడమచేతి వాటం పేసర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ను ఢిల్లీ క్యాపిటల్స్‌ నుంచి ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది. ఈ మేరకు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో ముంబై యాజమాన్యం ట్రేడింగ్ ద్వారా ఒప్పందం చేసుకుంది.

రాజస్థాన్ రాయల్స్‌కు అంకిత్ రాజ్‌పుత్

రాజస్థాన్ రాయల్స్‌కు అంకిత్ రాజ్‌పుత్

2014లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన ట్రెంట్ బౌల్ట్ 2018, 2019 సీజన్లలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఐపీఎల్‌లో మొత్తం 33 మ్యాచ్‌లు ఆడిన ట్రెంట్ బౌల్ట్ 38 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు వచ్చే సీజన్‌లో అంకిత్ రాజ్‌పుత్ రాజస్థాన్ రాయల్స్ జట్టు తరుపున ఆడనున్నాడు. ఈ మేరకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆ జట్టు యాజమాన్యంతో ట్రేడింగ్ ఒప్పందం కుదుర్చుకుంది.

Story first published: Thursday, November 14, 2019, 14:41 [IST]
Other articles published on Nov 14, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X