న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విజయ్‌పై ఆగ్రహం: ఫ్యాన్స్‌కు కొత్త ధోనీని పరిచయం చేసిన 12వ సీజన్ (వీడియో)

IPL 2019 : MS Dhoni Angry Reaction On Murali Vijay ! || Oneindia Telugu
 IPL 2019: Watch MS Dhoni’s Angry Reaction On Murali Vijay

హైదరాబాద్: ఐపీఎల్ 12వ సీజన్‌లో క్రికెట్ అభిమానులు సరికొత్త మహేంద్ర సింగ్ ధోనీని చూశారు. మైదానంలో ఎప్పుడూ కూల్‌గా ఉండే ధోని ఈ సీజన్‌లో ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. లీగ్ స్టేజిలో డగౌట్ నుంచి మైదానంలోకి వచ్చి అంఫైర్‌తో వాగ్వాదానికి దిగడం నుంచి తాజాగా తొలి క్వాలిఫయిర్ మ్యాచ్‌లో జట్టులోని సహచర ఆటగాడు మురళీ విజయ్‌పై ఆగ్రహం వ్యక్తం చేయడం లాంటివి. అయితే, మురళీ విజయ్‌పై ధోని కోపాన్ని ప్రదర్శించడానికి మాత్రం కారణం ఉంది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

131 పరుగులు చేసిన చెన్నై

131 పరుగులు చేసిన చెన్నై

వివరాల్లోకి వెళితే... టోర్నీలో భాగంగా మంగళవారం జరిగిన తొలి క్వాలిఫయిర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో అంబటి రాయుడు 37 బంతుల్లో 42(3 ఫోర్లు), ధోని 29 బంతుల్లో 37(3 సిక్సులు)తో రాణించడంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది.

ముంబై ఇండియన్స్‌కి 132 పరుగుల విజయ లక్ష్యం

ముంబై ఇండియన్స్‌కి 132 పరుగుల విజయ లక్ష్యం

దీంతో ముంబై ఇండియన్స్‌కి 132 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ జట్టు స్వల్ప లక్ష్యాన్ని అలవోక విజయాన్ని నమోదు చేసింది. బ్యాటింగ్‌లో విఫలమైన చెన్నై సూపర్ కింగ్స్ అటు బౌలింగ్‌లోనూ పేలవ ప్రదర్శన చేసింది. ముఖ్యంగా ఫీల్డింగ్‌లో చెన్నై ఫీల్డర్లు అనవసర తప్పిదాలకు పాల్పడ్డారు.

సూర్యకుమార్‌ యాదవ్‌ను తక్కువ స్కోరుకే

సూర్యకుమార్‌ యాదవ్‌ను తక్కువ స్కోరుకే

132 పరుగుల లక్ష్యఛేదనలో చెలరేగిఆడిన సూర్యకుమార్‌ యాదవ్‌ను తక్కువ స్కోరుకే ఔట్‌ చేసే అవకాశం చెన్నైకి వచ్చినప్పటికీ దానిని సద్వినియోగం చేసుకోలేకపోయింది. దీంతో సూర్యకుమార్ యాదవ్ 54 బంతుల్లో 71(10 ఫోర్లు) హాఫ్ సెంచరీతో రాణించి ముంబై విజయంలో కీలకపాత్ర పోషించాడు.

దీపక్‌ చాహర్‌ బౌలింగ్‌లో

దీపక్‌ చాహర్‌ బౌలింగ్‌లో సూర్యకుమార్‌ బంతి మిడ్ వికెట్ మీదగా బంతి గాల్లోకి లేచింది. ఈ బంతిని అందుకునే ప్రయత్నం చేసినప్పటికీ మురళీ విజయ్‌ క్యాచ్‌ పట్టలేకపోయాడు. ఈ క్యాచ్‌ను మురళీ విజయ్‌ పట్టుకొని ఉంటే మ్యాచ్‌ ఫలితం మరోలా ఉండేదని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. కీలకమైన దశలో క్యాచ్‌లో వదిలేసిన మురళీ విజయ్‌పై ధోని ఆగ్రహం వ్యక్తం చేశాడు.

ధోని ఆగ్రహం

ధోని ఆగ్రహం

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన తొలి క్వాలిఫయిర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ ఫైనల్‌కు చేరింది. మరోవైపు ఈ మ్యాచ్‌లో ఓడిన చెన్నై సూపర్ కింగ్స్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో క్వాలిఫయిర్ 2 మ్యాచ్‌లో తలపడనుంది.

Story first published: Wednesday, May 8, 2019, 14:38 [IST]
Other articles published on May 8, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X