న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'వార్నర్ ప్రపంచస్థాయి ఆటగాడు, అతడి కెప్టెన్సీ స్కిల్స్ అద్భుతం'

IPL 2019: Warners leadership skills are unmatched: SRH mentor VVS Laxman

హైదరాబాద్: ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ తిరిగి జట్టులోకి రావడంతో సన్‌రైజర్స్ బలం పుంజుకుందని ఆ జట్టు మెంటార్ వీవీఎస్ లక్ష్మణ్ అన్నాడు. ఆటగాడిగానే కాకుండా అతని కెప్టెన్సీ నైపుణ్యాల ముందు వేరే వారెవరూ సాటిరాలేరని లక్ష్మణ్ ప్రశంసల వర్షం కురిపించాడు. బాల్ ట్యాంపరింగ్ ఉదంతంలో ఏడాది పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన వార్నర్ ఇటీవలే తిరిగి సన్‌రైజర్స్ జట్టులో చేరాడు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

జట్టులో కొత్తగా చేరిన సభ్యుల పరిచయ కార్యక్రమాన్ని బుధవారం సన్‌రైజర్స్‌ యాజమాన్యం నిర్వహించింది. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో వీవీఎస్ మాట్లాడుతూ "ప్రస్తుత కెప్టెన్ కేన్‌ విలియమ్సన్‌కు వార్నర్‌ తోడవ్వడంతో సన్‌రైజర్స్‌ ఇంకా పటిష్టంగా మారింది. వార్నర్ ప్రపంచస్థాయి ఆటగాడు. గతంలో సారథిగా వార్నర్‌ జట్టును నడిపించిన తీరుపట్ల ఫ్రాంచైజీ గర్విస్తోంది" అని అన్నాడు.

కెప్టెన్‌గా వార్నర్ ప్రతిభకు సాటి లేదు

కెప్టెన్‌గా వార్నర్ ప్రతిభకు సాటి లేదు

"మ్యాచ్‌ విన్నర్‌గానే కాకుండా కెప్టెన్‌గా అతని ప్రతిభకు సాటి లేదు. ఫ్రాంచైజీ కోసం అతను చాలా సాధించిపెట్టాడు. జట్టులో యువ ఆటగాళ్ల అభివృద్ధిలో వార్నర్‌ది చాలా కీలక పాత్ర. మ్యాచ్‌కు సన్నద్ధమయ్యేందుకు అతను పడే కష్టం, నిబద్ధత అందరికీ ఉదాహరణగా నిలుస్తుంది. త్వరలో మొదలయ్యే సీజన్‌లో జట్టుకు విలియమ్సన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు" అని లక్ష్మణ్ అన్నాడు.

కోచ్‌ టామ్‌ మూడీ ఇలా

కోచ్‌ టామ్‌ మూడీ ఇలా

నిషేధం కారణంగా ఏడాది పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్నప్పటికీ... దాని ప్రభావం వార్నర్‌పై ఉండబోదని సన్‌రైజర్స్ కోచ్‌ టామ్‌ మూడీ అభిప్రాయ పడ్డాడు. "వార్నర్‌ సానుకూలంగా ఆలోచించే వ్యక్తి. అతనో దిగ్గజ ఆటగాడు. ఎప్పుడూ ఏదో సాధించాలనే జిజ్ఞాసతో ఉంటాడు. కొంతకాలం క్రికెట్‌కు దూరమైనంత మాత్రాన, అతని దృక్పథంలో ఎలాంటి మార్పు ఉండదు" అని అన్నాడు.

ప్రపంచ అత్యుత్తమ ఆటగాళ్లలో విలియమ్సన్‌ ఒకడు

ప్రపంచ అత్యుత్తమ ఆటగాళ్లలో విలియమ్సన్‌ ఒకడు

ప్రస్తుత కెప్టెన్ కేన్‌ విలియమ్సన్‌ ప్రపంచ అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడని, గొప్ప లీడర్‌ అని టామ్ మూడీ అన్నాడు. ఇక, సన్‌రైజర్స్ బౌలింగ్ కోచ్ ముత్తయ్య మురళీధరన్‌ మాట్లాడుతూ అండర్‌-19 ఆటగాడు అభిషేక్‌ శర్మ, ఇండియా- ఏ స్పిన్పర్‌ షాబాజ్‌ నదీమ్‌ చేరికతో సన్‌రైజర్స్‌ బౌలింగ్‌ దళం పటిష్టంగా ఉందని అన్నాడు. గతేడాదితో పోలిస్తే ఈసారి స్పిన్నర్లు, పేసర్లతో జట్టు సమతూకంగా ఉందని అన్నాడు.

సన్‌రైజర్స్ తరుపున బరిలోకి విజయ్ శంకర్

సన్‌రైజర్స్ తరుపున బరిలోకి విజయ్ శంకర్

కాగా, మార్టిన్‌ గప్టిల్‌ (న్యూజిలాండ్‌), జానీ బెయిర్‌స్టో (ఇంగ్లండ్‌), విజయ్‌ శంకర్, అభిషేక్‌ శర్మ, షాబాజ్‌ నదీమ్‌ (భారత్‌)లు ఈ సీజన్‌ నుంచి సన్‌రైజర్స్‌ హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పరిచయ కార్యక్రమంలో జట్టు ఆటగాళ్లతో పాటు కోచ్‌ టామ్‌ మూడీ, మెంటార్‌ లక్ష్మణ్, బౌలింగ్‌ కోచ్‌ ముత్తయ్య మురళీధరన్‌ పాల్గొన్నారు.

Story first published: Thursday, March 21, 2019, 12:17 [IST]
Other articles published on Mar 21, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X