న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ 2019: సాహా ఔట్... సన్‌రైజర్స్ రిటైన్ జాబితాలో డేవిడ్ వార్నర్

IPL 2019 : Sunrisers Hyderabad Retentions And Releases | Oneindia Telugu
IPL 2019: Sunrisers Hyderabad release Wriddhiman Saha, Alex Hales; David Warner named in retained squad

హైదరాబాద్: ఐపీఎల్ 2019 కోసం డిసెంబర్ నెలలో ఆటగాళ్ల వేలం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో కాంట్రాక్ట్ పూర్తయిన ఆటగాళ్లతో పాటు నిరాశ పరిచిన వారిని ఫ్రాంచైజీలు వదులుకుంటున్నాయి. నవంబర్ 15లోగా ఫ్రాంచైజీలు తాము రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాను అందించాలని ఐపీఎల్ నిర్వాహకులు కోరడంతో అన్ని ప్రాంఛైజీలు తమ తమ జాబితాలను ప్రకటిస్తున్నాయి.

తాజాగా, గురువారం సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ తాము అట్టిపెట్టుకుంటున్న, విడిచిపెడుతున్న ఆటగాళ్ల జాబితాని ప్రకటించింది. మొత్తం 26 మందితో కూడిన సన్‌రైజర్స్ జట్టులో 17 మందిని రిటైన్ చేసుకోగా.. ఏకంగా 9 మంది ఆటగాళ్లని వేలం కోసం విడిచిపెట్టేసింది. సన్‌రైజర్స్ అట్టిపెట్టుకున్న ఆటగాళ్లలో బాల్ టాంపరింగ్ ఘటనలో ఏడాది పాటు నిషేధానికి గురైన డేవిడ్ వార్నర్ కూడా ఉన్నాడు.

బాల్ టాంపరింగ్‌కు పాల్పడిన డేవిడ్ వార్నర్

బాల్ టాంపరింగ్‌కు పాల్పడిన డేవిడ్ వార్నర్

ఈ ఏడాది మొదట్లో సఫారీ గడ్డపై ఆతిథ్య దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, కామెరూన్ బాన్‌‌క్రాప్ట్‌లు బాల్ టాంపరింగ్‍‌కు పాల్పడిన సంగతి తెలిసిందే. దీంతో స్మిత్, వార్నర్‌పై ఏడాది పాటు నిషేధం విధించిన క్రికెట్ ఆస్ట్రేలియా బాన్‌క్రాఫ్ట్‌కు తొమ్మిది నెలలు నిషేధం విధంచింది.

వార్నర్‌పై విధించిన నిషేధం ముగుస్తుండటంతో

వార్నర్‌పై విధించిన నిషేధం ముగుస్తుండటంతో

వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్ నాటికి డేవిడ్ వార్నర్‌పై విధించిన నిషేధం ముగుస్తుండటంతో డేవిడ్ వార్నర్ పేరుని కూడా సన్‌రైజర్స్ యాజమాన్యం రిటైన్ ఆటగాళ్ల జాబితాలో చేర్చింది. మరోవైపు ట్రేడింగ్‌లో శిఖర్‌ ధావన్‌కు బదులుగా ఢిల్లీ నుంచి షాబాజ్‌ నదీమ్‌, విజయ్‌ శంకర్‌, అభిషేక్‌ వర్మను సన్‌రైజర్స్ హైదరాబాద్‌ తీసుకుంది.

సన్‌రైజర్స్‌‌ వ్యూహాత్మకంగా అడుగులు

సన్‌రైజర్స్‌‌ వ్యూహాత్మకంగా అడుగులు

ఈ విషయంలో సన్‌రైజర్స్‌‌ వ్యూహాత్మకంగా అడుగులు వేసిందని క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయం. దేశవాళీ క్రికెట్‌లో మంచి పేరున్న నదీమ్‌ (రూ.3.2 కోట్లు)ను భారత స్పిన్నర్‌ కోటాలో వినియోగించుకోనుంది. ఇక ఏడాది అంతరం తర్వాత విజయ్‌ శంకర్ (రూ.3.2 కోట్లు) తిరిగి హైదరాబాద్‌కు వస్తున్నాడు. అభిషేక్‌ వర్మ (రూ.55 లక్షలు) మిడిలార్డర్‌లో ఉపయోగపడతాడు.

విడిచిపెట్టిన ఆటగాళ్లలో సాహా, హేల్స్

విడిచిపెట్టిన ఆటగాళ్లలో సాహా, హేల్స్

ఈ ముగ్గురికి ఇవ్వాల్సిన మొత్తం రూ.6.95 కోట్లు. ధావన్‌ విలువ రూ.5.2 కోట్లు. దీంతో మిగిలిన డబ్బును ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు హైదరాబాద్‌ చెల్లించనుంది. మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం వేలానికి విడిచి పెట్టిన ఆటగాళ్ల జాబితాలో చెప్పుకోదగ్గ ఆటగాళ్లుగా వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా, అలెక్స్ హేల్స్‌లు ఉన్నారు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు:

బసిల్ థంపి, భువనేశ్వర్ కుమార్, దీపక్ హుడా, మనీష్ పాండే, నటరాజన్, రికీ భుయి, సందీప్ శర్మ, శ్రీవాత్సవ్ గోస్వామి, సిద్ధార్ద్ కౌల్, సయ్యద్ ఖలీల్ అహ్మద్, యూసఫ్ ఫఠాన్, బిల్లీ స్టాన్ లేక్, డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్, మహమ్మద్ నబీ, రషీద్ ఖాన్, షకీబ్ ఉల్ హాసన్, అభిషేక్ శర్మ(ట్రేడింగ్), విజయ్‌ శంకర్(ట్రేడింగ్), నదీమ్‌(ట్రేడింగ్)

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు విడిచిపెట్టిన ఆటగాళ్లు:

సచిన్ బేబీ, తన్మయ్ అగర్వాల్, వృద్ధిమాన్ సాహా, క్రిస్ జోర్డాన్, కార్లోస్ బ్రాత్ వైట్, అలెక్స్ హేల్స్, బిపుల్ శర్మ, సయ్యద్ మెహదీ హాసన్, శిఖర్ ధావన్(ట్రేడింగ్)

Story first published: Thursday, November 15, 2018, 18:36 [IST]
Other articles published on Nov 15, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X