న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ 2019: కోహ్లీ కంటే అయ్యరే బెస్ట్ కెప్టెన్?: మంజ్రేకర్ పాయింట్ల చిచ్చు

IPL 2019: Sanjay Manjrekar rates Shreyas Iyers captaincy above Virat Kohli

హైదరాబాద్: విరాట్ కోహ్లీ కంటే శ్రేయాస్ అయ్యరే ఉత్తమమైన కెప్టెన్‌ అని మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. ఐపీఎల్ 12వ సీజన్‌లో ఆయా జట్ల కెప్టెన్ల ప్రదర్శన ఆధారంగా సంజయ్ మంజ్రేకర్ రేటింగ్ పాయింట్లు ఇచ్చారు. చెన్నై సూపర్ కింగ్స్‌ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి సంజయ్ మంజ్రేకర్ 10కి 9 మార్కులు ఇచ్చాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం
ఉప్పల్ వేదికగా జరిగిన ఐపీఎల్ ఫైనల్లో విజయం సాధించిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకి 8 మార్కులు ఇచ్చాడు. ఈ సందర్భంగా మంజ్రేకర్ "రోహిత్ శర్మ నిలకడైన కెప్టెన్. పెద్దగా తప్పులు చేయడు. జట్టులో ఉన్న ఆటగాళ్లని ఎలా హ్యాండిల్ చేయాలో అతనికి తెలుసు" అని అన్నాడు.

అశ్విన్‌కు 7 మార్కులు

అశ్విన్‌కు 7 మార్కులు

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్‌కు 10కి 7 మార్కులు ఇచ్చిన మంజ్రేకర్... రహానేకి 5, అతడి స్థానంలో లీగ్ స్టేజి చివరి దశలో జట్టు సారథ్య బాధ్యతలు స్వీకరించిన స్టీవ్ స్మిత్‌కి 6 మార్కులు ఇచ్చాడు. ఇక, ఈ ఏడాది క్వాలిఫయర్‌ల వరకూ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును తీసుకు వెళ్లిన కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌కి 8 మార్కులు ఇచ్చాడు.

కోహ్లీకి 6 మార్కులు

కోహ్లీకి 6 మార్కులు

కాగా, ఈ సీజన్‌లో చెత్త ప్రదర్శన చేసి టోర్నీ నుంచి నిష్క్రమించిన మొట్టమొదటి జట్టుగా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) కెప్టెన్ విరాట్ కోహ్లీకి మంజ్రేకర్ 6 మార్కులే ఇవ్వడం విశేషం. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన కేన్ విలిమయ్‌సన్‌కు 7 మార్కులు ఇచ్చారు.

దినేశ్ కార్తీక్‌కి అసలు మార్కులే ఇవ్వలేదు

దినేశ్ కార్తీక్‌కి అసలు మార్కులే ఇవ్వలేదు

కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ దినేశ్ కార్తీక్‌కి అసలు మార్కులే ఇవ్వలేదు. కోహ్లీకి తక్కువ మార్కులు ఇచ్చి అయ్యర్‌కు ఎక్కువ మార్పులు ఇవ్వడంపై నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. కాగా, హైదరాబాద్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో చివరి వరకు ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ముంబై ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది.

ముంబైకి ఇది నాలుగో ఐపీఎల్ టైటిల్

ముంబైకి ఇది నాలుగో ఐపీఎల్ టైటిల్

ముంబై ఇండియన్స్‌కు ఇది నాలుగో ఐపీఎల్ టైటిల్ కావడం విశేషం. కెప్టెన్‌గా నాలుగు ఐపీఎల్ టైటిళ్లను నెగ్గాడు. ఈ క్రమంలో ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. 2013లో రోహిత్ శర్మ నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ మొట్టమొదటిసారి ఐపీఎల్ ఛాంపియన్‌గా అవతరించింది.

Story first published: Thursday, May 16, 2019, 18:06 [IST]
Other articles published on May 16, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X