న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'ధోనితో కలిసి బ్యాటింగ్ చేస్తే పరుగులు రాబట్టడం సులువు' (వీడియో)

IPL 2019: Ravindra Jadeja reveals what it is like to bat with MS Dhoni

హైదరాబాద్: చెపాక్ వేదికగా బుధవారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే 80 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. 180 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ 16.2 ఓవర్లలో 99 పరుగులు చేసి ఆలౌటైంది. చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌ చేతిలో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఇది వరుసగా ఆరో ఓటమి కావడం విశేషం.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

2008, 2010లో సీజన్లలో ఈ వేదికలో ఆడిన మ్యాచ్‌ల్లో విజయం సాధించిన ఢిల్లీ.... ఆ తర్వాత 2011 నుంచి చెపాక్ వేదికగా జరిగిన అన్ని మ్యాచ్‌ల్లోనూ ఢిల్లీ ఓడిపోయింది. అంతేకాదు ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కి ఇది ఆరో అతిపెద్ద విజయం. చెన్నై సాధించిన నాలుగు పెద్ద విజయాలు ఢిల్లీపైనే కావడం విశేషం.

అటు బంతితో పాటు ఇటు బ్యాట్‌తోనూ

అటు బంతితో పాటు ఇటు బ్యాట్‌తోనూ

ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అటు బంతితో మాత్రమే కాకుండా బ్యాట్‌తోనూ మెరిశాడు. తొలుత బ్యాటింగ్‌లో జడేజా కేవలం 10 బంతుల్లోనే 2 ఫోర్లు, 2 సిక్సర్ల సహాయంతో 25 పరుగుల రాబట్టి చెన్నై భారీ లక్ష్యాన్ని నిర్దేశించడంలో కీలకంగా వ్యవహారించాడు. బౌలింగ్‌లో 3 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

మోహిత్‌ శర్మతో కలిసి బీసీసీఐ టీవీకి ఇంటర్యూ

మోహిత్‌ శర్మతో కలిసి బీసీసీఐ టీవీకి ఇంటర్యూ

ఇదే విషయాన్ని మ్యాచ్ అనంతరం జట్టులోని ఆటగాడు మోహిత్‌ శర్మతో కలిసి బీసీసీఐ టీవీకి సరదాగా ఇచ్చిన ఇంటర్యూలో వెల్లడించాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోని చెప్పినట్టే చేశానని జడేజా తెలిపాడు. ధోనితో కలిసి బ్యాటింగ్ చేస్తే పరుగులు రాబట్టడం చాలు సులువని జడేజా చెప్పుకొచ్చాడు.

బ్యాటింగ్‌ ఎలా చేయాలి లాంటి విషయాలను

"బ్యాటింగ్‌ చేసేటప్పటడు బౌలర్‌ ఏ విధంగా బౌలింగ్‌ చేస్తాడు. పీల్డింగ్‌ ఎక్కడ సెట్‌ చేస్తారు. బ్యాటింగ్‌ ఎలా చేయాలి లాంటి విషయాలను ధోని చెప్తాడు. అంతేకాకుండా బౌండరీలు ఎటువైపు దగ్గరగా ఉన్నాయో... ఏ ఫీల్డర్‌ను టార్గెట్ చేయాలో కూడా ధోని స్పష్టంగా చెబుతాడు. అయితే, ఇక్కడ మనం పవర్ హిట్టింగ్ చేయాలి" అని జడేజా చెప్పాడు.

మ్యాచ్ పరిస్థితులకు తగ్గట్లుగా

మ్యాచ్ పరిస్థితులకు తగ్గట్లుగా

"మ్యాచ్ పరిస్థితులకు తగ్గట్లుగా మనం ఆడాల్సి ఉంటుంది. ఇక, నా తొలి ఓవర్‌ను బౌలింగ్ వేయడానికి వచ్చినప్పుడు బ్యాట్స్‌మెన్‌ ప్లేస్‌మెంట్‌లు, బ్యాటింగ్‌ లోపాల గురించి వివరిస్తాడు. దీంతో బౌలింగ్‌ చేయడం కూడా సులభమవుతుంది. సరైన చోటు బంతులు సంధిస్తే మిడిలార్డర్ పెవిలియన్‌కు చేరుతుంది" అని జడేజా వివరించాడు.

Story first published: Thursday, May 2, 2019, 18:48 [IST]
Other articles published on May 2, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X