న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నేడు బెంగళూరుతో రాజస్థాన్‌ ఢీ.. పాయింట్ల ఖాతా తెరిచేదెవరు?

IPL 2019 : Rajasthan Royals Vs Royal Challengers Bangalore Match Preview || Oneindia Telugu
IPL 2019: Rajasthan vs Bangalore match Today in Jaipur

హైదరాబాద్: టీమిండియా రెగ్యులర్ కెప్టెన్, స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఐపీఎల్ జట్టు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు కెప్టెన్‌గా ఉండగా.. మరో స్టార్ ఆటగాడు అంజిక్య రహానే రాజస్థాన్‌ రాయల్స్‌కు కెప్టెన్‌గా ఉన్నాడు. ఇద్దరు స్టార్ ఆటగాళ్లు కెప్టెన్లుగా ఉన్నా.. కూడా ఐపీఎల్ సీజన్ -12లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఇరు జట్లు గెలవలేదు. అయితే మంగళవారం రాత్రి రాజస్థాన్, బెంగళూరు జట్లు తలపడనున్నాయి.

పాయింట్ల ఖాతా తెరిచేదెవరు:

పాయింట్ల ఖాతా తెరిచేదెవరు:

బెంగళూరు జట్టు చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడిపోయింది. మరోవైపు రాజస్థాన్‌ వరుసగా పంజాబ్, హైదరాబాద్, చెన్నై జట్లతో ఓడిపోయింది. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో కూడా ఇరు జట్లు ఓడిపోయి పాయింట్ల ఖాతానే తెరవలేదు. పాయింట్ల పట్టికలో రెండు జట్లు అట్టడుగు స్థానాల్లో ఉన్నాయి కాబట్టి ఎలాగైనా ఈ రోజు జరిగే మ్యాచ్‌లో గెలిచి బోణీ కొట్టాలని చూస్తున్నాయి. దీంతో ఈ రోజు ఏ జట్టు పాయింట్ల ఖాతా తెరుస్తుందో చూడాలి.

కోహ్లీ, డివిలియర్స్‌ రాణించేనా:

కోహ్లీ, డివిలియర్స్‌ రాణించేనా:

బెంగళూరు జట్టుకు కొండంత అండ విరాట్ కోహ్లీ, డివిలియర్స్‌. ఈ జోడీపైనే బెంగళూరు అతిగా ఆధారపడుతోంది. అయితే ఇప్పటి వరకూ ఈ ఇద్దరు ఒక ముంబై మ్యాచ్‌లోనే రాణించారు. మరి రాజస్థాన్‌తో పోరులో అయినా వీరు అంచనాలకు తగ్గట్లు రాణిస్తారేమో చూడాలి. పార్థివ్ పటేల్, హెట్మయర్, మొయిన్ అలీ, గ్రాండోమ్ కూడా పరుగులు చేయడంలో విఫలమవుతున్నారు. బౌలింగ్ విభాగంలో కూడా ఉమేష్, చాహల్, సిరాజ్ లు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. ఈ రోజు జరిగే మ్యాచ్‌లో అయినా సమిష్టిగా రాణిస్తేనే విజయం వరిస్తుంది.

పరుగులు చేసినా ఫలితం లేదు:

పరుగులు చేసినా ఫలితం లేదు:

రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు భారీ పరుగులు చేసినా విజయాన్ని మాత్రం అందుకోలేకపోతోంది. బ్యాటింగ్ బాగా చేసినా.. బౌలర్లు మాత్రం మ్యాచ్‌ను కాపాడలేకపోతున్నారు. కెప్టెన్ రహానే, బట్లర్, శాంసన్, స్టోక్స్ లు రాణించారు. అయితే ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. ఈ మ్యాచ్‌లో స్మిత్ రాణించాల్సిన అవసరం ఉంది. బౌలింగ్ లో కులకర్ణి, ఆర్చర్, ఉనాద్కట్ కూడా సమిష్టిగా రాణిస్తేనే విజయాన్ని సొంతం చేసుకోవచ్చు. తప్పులు సరిదిద్దుకొని ఏ జట్టు గెలుపు బాట పడుతుందో మరి.

Story first published: Tuesday, April 2, 2019, 14:50 [IST]
Other articles published on Apr 2, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X