మ్యాచ్‌ విన్నర్లను ఎలా తయారు చేయాలో వారికి తెలుసు: ధావన్‌

IPL 2019 : Ponting, Ganguly Know How To Make Match Winners, Says Shikhar Dhawan || Oneindia Telugu

మ్యాచ్‌ విన్నర్లను ఎలా తయారు చేయాలో ఢిల్లీ కోచ్‌ రికీ పాంటింగ్‌, మెంటార్ సౌరవ్‌ గంగూలీలకు తెలుసని ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ శిఖర్ ధావన్‌ అన్నారు. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుపై 16 పరుగుల తేడాతో విజయం సాధించి ఢిల్లీ ప్లేఆఫ్‌ చేరింది. దీంతో ఆరు సంవత్సరాల తర్వాత ఢిల్లీ ఇప్పుడు ప్లేఆఫ్‌కు అర్హత పొందింది.

2012 తర్వాత ప్లేఆఫ్‌కు:

2012 తర్వాత ప్లేఆఫ్‌కు:

2012లో టీంఇండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ కెప్టెన్‌గా ఉన్నపుడు డిల్లీ ప్లేఆఫ్‌ చేరింది. అయితే ఫైనల్ మాత్రం చేరుకోలేకపోయింది. ఆ తర్వాత సెహ్వాగ్‌ పంజాబ్ జట్టుకు వెళ్ళాడు. 2012 తర్వాత ఢిల్లీ జట్టు అంతగా ప్రభావం చూపలేదు. ప్రతిసారి చివరి రెండు స్థానాలతో తన ప్రస్థానాన్ని ముగిచింది.

అదృష్టం మారింది:

అదృష్టం మారింది:

ఈ సీజన్-12కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌గా పేరు మార్చుకుంది. జెర్సీ కలర్ మార్చింది. అంతేకాదు సహాయక సిబ్బందిని కూడా మార్చేసింది. దీంతో అదృష్టం మారింది. మరోవైపు శిఖర్‌ ధావన్‌తో పాటు యువ ఆటగాళ్లు షా, అయ్యర్, పంత్, అక్షర్‌పటేల్‌లు రాణించడంతో.. 12 మ్యాచుల్లో 8 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉంది. అయితే ఈ విజయాలకు కారణం కోచ్‌ రికీ పాంటింగ్‌, మెంటార్ సౌరవ్‌ గంగూలీయే అని ధావన్‌ అంటున్నాడు.

మా విజయాల్లో కీలక పాత్ర వారిదే:

మా విజయాల్లో కీలక పాత్ర వారిదే:

'మాకు ఇద్దరు విజయవంతమైన మాజీ సారధులు ఉన్నారు. కోచ్‌ రికీ పాంటింగ్‌, సౌరవ్‌ గంగూలీలు మా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రణాళికలు, వ్యూహాలు రచించడంలో వారు దిట్ట. మ్యాచ్ విన్నర్లను ఎలా తయారు చేయాలో, ఆత్మవిశ్వాసం ఎలా నింపాలో వారికి తెలుసు' అని ధావన్ అన్నారు.

జట్టు పటిష్ఠంగా ఉంది:

జట్టు పటిష్ఠంగా ఉంది:

'ప్రస్తుతం జట్టు పటిష్ఠంగా ఉంది. దేశ, విదేశీ ఆటగాళ్లతో జట్టు సమతూకంగా ఉంది. పంత్‌, పృథ్వీ షా, అయ్యర్‌, రబాడా, అమిత్‌ మిశ్రా, ఇషాంత్‌ శర్మ రాణిస్తున్నారు. ఆటగాళ్లందరిలో ఆత్మవిశ్వాసం ఉంది. ఈ జోరును ఇలాగే కొనసాగిస్తాం. దిల్లీ తరఫున ఆడుతున్నందుకు సంతోషంగా ఉంది. 11 ఏళ్ల తర్వాత తిరిగి జట్టులో చేరా. టైటిల్ సాధిస్తాం' అని ధావన్ ధీమా వ్యక్తం చేసాడు.

For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Tuesday, April 30, 2019, 13:31 [IST]
Other articles published on Apr 30, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X