న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీ20ల్లో ముంబై ఇండియన్స్ సరికొత్త రికార్డు

IPL 2019: Mumbai Indians become first team to play 200 match in T20 Cricket

హైదరాబాద్: ఐపీఎల్ 2019 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ జట్టు అరుదైన ఘనత సాధించింది. టీ20 చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన జట్టుగా ముంబై ఇండియన్స్‌ సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఐపీఎల్ టోర్నీలో భాగంగా శనివారం ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ముంబై ఈ ఘనత సాధించింది. ముంబై ఇండియన్స్‌కు ఇది 200వ టీ20 మ్యాచ్‌ కావడం విశేషం.

సోమర్‌సెట్‌ రికార్డు బద్దలు కొట్టిన ముంబై ఇండియన్స్

సోమర్‌సెట్‌ రికార్డు బద్దలు కొట్టిన ముంబై ఇండియన్స్

ఈ క్రమంలో ఇప్పటివరకు సోమర్‌సెట్‌(199 మ్యాచ్‌లు) పేరిట ఉన్న ఈ రికార్డుని ముంబై ఇండియన్స్ బద్దలు కొట్టింది. ఐపీఎల్‌లో 200 మ్యాచ్‌లు ఆడిన తొలి జట్టుగా ముంబై ఇండియన్స్‌ చరిత్ర సృష్టించింది. ఈ జాబితాలో ముంబై ఇండియన్స్‌ తర్వాత సోమర్‌సెట్‌(199), హంప్‌షైర్‌(194), రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(188), ససెక్స్‌(187), కోల్‌కతా నైట్‌రైడర్స్‌(187)లు ఉన్నాయి.

టీ20 చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన జట్లు:

టీ20 చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన జట్లు:

200 Mumbai Indians *

199 Somerset

194 Hampshire

188 Royal Challengers Bengaluru

187 Sussex/ Kolkata Knight Riders

టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ అజ్యింకె రహానే ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. గాయం కారణంగా గత మ్యాచ్‌కి దూరమైన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ తిరిగి ఈ మ్యాచ్‌లో చోటు దక్కించుకున్నాడు. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. గాయంతో బాధపడుతున్న బెన్ స్టోక్స్ స్థానంలో లివింగ్ స్టోన్ తుది జట్టులో చోటు దక్కించుకోగా... కృష్ణప్ప గౌతం కూడా తిరిగి జట్టులో చేరాడు.

మూడో స్థానంలో ముంబై ఇండియన్స్

ఈ సీజన్‌లో ఇప్పటివరకు ముంబై ఇండియన్స్ ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో నాలుగింట విజయం సాధించి 8 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఐదింట ఓటమిపాలై పాయింట్ల పట్టకలో ఆఖరి నుంచి రెండో స్థానంలో కొనసాగుతోంది.

Story first published: Saturday, April 13, 2019, 17:48 [IST]
Other articles published on Apr 13, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X