న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

MI vs SRH: సూపర్ ఓవర్ థ్రిల్లర్: ముంబై చేతిలో సన్‌రైజర్స్ ఓటమి

IPL 2019:Mumbai Indians Defeat Sunrisers Hyderabad In Super Over To Reach Playoffs | Oneindia Telugu
MI

హైదరాబాద్: వాంఖడే స్టేడియం వేదికగా సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సూపర్ ఓవర్‌లో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. ముంబై ఇండియన్స్ నిర్దేశించిన 163 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ టైగా ముగిసింది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసింది. సూపర్ ఓవర్‌లో భాగంగా తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 2 వికెట్లు కోల్పోయి 8 పరుగులు చేసింది. అనంతరం ముంబై ఇండియన్స్ కేవలం మూడు బంతుల్లోనే లక్ష్యాన్ని చేధించింది. ఈ విజయంతో చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తర్వాత ప్లేఆఫ్‌కు చేరిన మూడో జట్టుగా ముంబై ఇండియన్స్ నిలిచింది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో వృద్ధిమాన్ సాహ(25), మార్టిన్ గుప్టిల్(15), మనీష్ పాండే(71), కేన్ విలియమ్సన్(3), విజయ్ శంకర్(12), మహ్మద్ నబీ(31) పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, బుమ్రా తలో రెండు వికెట్లు తీశారు.


సన్‌రైజర్స్ విజయ లక్ష్యం 163
అంతకముందు ఓపెనర్ క్వింటన్ డీకాక్ 58 బంతుల్లో 69(6 ఫోర్లు, 2 సిక్సులు) హాఫ్ సెంచరీతో రాణించడంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు 163 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.

1
45927

ఈ మ్యాచ్‌లో ముంబైకి ఓపెనర్లు మంచి ఆరంభాన్నిచ్చారు. అయితే, జట్టు స్కోరు 36 పరుగుల వద్ద ఖలీల్ అహ్మద్ వేసిన 6వ ఓవర్ రెండో బంతికి రోహిత్ శర్మ(24) నబీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత ఖలీల్ వేసిన 12వ ఓవర్ నాలుగో బంతికి సూర్యకుమార్(23) రషీద్‌కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

దీంతో 90 పరుగులకు ముంబై ఇండియన్స్ రెండో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఎవిన్ లూయిస్(1) విజయ్ శంకర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఈ సీజన్‌లో గత మ్యాచ్‌ల్లో ముంబై తరుపున అద్భుత ప్రదర్శన చేసిన హార్దిక్ పాండ్యా(18) ఈ మ్యాచ్‌లో అభిమానులను నిరాశ పరిచాడు.

జట్టు స్కోరు 119 పరుగుల వద్ద భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో నబీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. మరోవైపు ఓపెనర్ డీకాక్ 58 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో 69 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు. దీంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ బౌలర్లలో ఖలీల్ అహ్మద్ మూడు, నబీ, భువనేశ్వర్ తలో వికెట్ తీశారు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై
అంతకముందు వాంఖడె వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. వరల్డ్ కప్ సన్నాహాకాల్లో భాగంగా ఆసీస్‌కు వెళ్లిన డేవిడ్ వార్నర్ స్థానంలో సన్‌రైజర్స్ మార్టిన్ గుప్టిల్‌ని, సందీప్ శర్మ స్థానంలో బసిల్ థంపిని తుది జట్టులోకి తీసుకుంది. ముంబై గత మ్యాచ్‌లో ఆడిన జట్టునే కొనసాగించింది.

Story first published: Friday, May 3, 2019, 0:19 [IST]
Other articles published on May 3, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X