న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మాటలు రావడం లేదు: 8 పరుగులకే 7 వికెట్లు కోల్పోవడంపై అయ్యర్

IPL 2019, KXIP v DC: ‘I am speechless’ - DC captain Shreyas Iyer says after stunning collapse

హైదరాబాద్: "మాటలు రావడం లేదు" మొహాలి వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు చేతిలో 14 పరుగులు తేడాతో ఓటమిపాలైన అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ అన్న మాటలివి. ఐపీఎల్ టోర్నీలో భాగంగా మంగళవారం రాత్రి మొహాలిలోని ఐఎస్ బింద్రా స్టేడియంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడ్డాయి.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. అనంతరం 167 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు విజయానికి 21 బంతుల్లో 21 పరుగులు అవసరమయ్యాయి. చేతిలో 7 వికెట్లు ఉన్నాయి. అయినప్పటికీ ఢిల్లీ 14 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

క్రెడిట్ అంతా శామ్ కుర్రన్‌దే

క్రెడిట్ అంతా శామ్ కుర్రన్‌దే

అందుకు కారణం పంజాబ్ ఆల్ రౌండర్ శామ్ కుర్రన్. ఈ మ్యాచ్‌లో 2.2 ఓవర్లు బౌలింగ్ వేసిన శామ్ కుర్రన్ విజృంభించి హ్యాట్రిక్‌ వికెట్లు తీయడంతో ఢిల్లీ 8 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. మ్యాచ్ ముగిసిన తర్వాత శ్రేయాస్ అయ్యర్ మాట్లాడుతూ "ఇది నిజంగా నిరుత్సాహాన్ని కలిగించింది. ఇక్కడ మేము స్మార్ట్ క్రికెట్ ఆడలేదు. పంజాబ్ అన్ని విభాగాల్లో అద్బుత ప్రదర్శన చేసింది" అని అన్నాడు.

8 పరుగులకే ఏడు వికెట్లు

8 పరుగులకే ఏడు వికెట్లు

"8 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోవడం నమ్మశక్యంగా లేదు. ఈ ఓటమిపై మాట్లాడేందుకు నా దగ్గర మాటల్లేవు. ఒకవైపు ఇంగ్రామ్‌ ఆచితూచి ఆడుతుంటే.. మేమంతా పెవిలియన్‌కు క్యూ కట్టాం. జట్టును విజయం దిశగా నడిపించేందుకు ఏ ఒక్కరూ ముందడుగు వేయలేదు. పంజాబ్‌ జట్టు ఒత్తిడిని ఎదుర్కొన్న తీరు అమోఘం" అని శ్రేయస్‌ అయ్యర్ తెలిపాడు.

ఈ ఓటమి నుంచి మేమెంతో నేర్చుకోవాలి

ఈ ఓటమి నుంచి మేమెంతో నేర్చుకోవాలి

"ఈ ఓటమి నుంచి మేమెంతో నేర్చుకోవాలి. చిన్న విషయాలపై కూడా దృష్టిని సారించాలి. మానసికంగా మ్యాచ్‌లను ఎలా ముగించాలనే దానిపై మేము సిద్ధంగా ఉండాలి. మాకు చక్కటి ఆరంభాలు లభిస్తున్నప్పటికీ వాటిని విన్నింగ్ గేమ్స్‌గా మలచలేకపోతున్నాం" అని అయ్యర్ తెలిపాడు.

17 బంతుల వ్యవధిలో అంతా సమాప్తం

17 బంతుల వ్యవధిలో అంతా సమాప్తం

ఈ మ్యాచ్‌లో 16.3 ఓవర్లకు 144/3తో పటిష్టి స్థితిలో ఉంది. ఆ తర్వాతి బంతికే హిట్టర్ రిషబ్ పంత్ ఔట్ కావడం.... ఆ తర్వాత వెంటనే ఇన్‌గ్రామ్‌ కూడా పెవిలియన్‌కు చేరుకోవడంతో కష్టాల్లో పడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన మిగతా ఆటగాళ్లంతా ఫెయిల్ అయ్యారు. కేవలం 17 బంతుల వ్యవధిలోనే ఢిల్లీ మిగతా 7 వికెట్లు కోల్పోయి ఓటమిపాలైంది.

Story first published: Tuesday, April 2, 2019, 16:02 [IST]
Other articles published on Apr 2, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X