న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కేకేఆర్ కీలక నిర్ణయం: వచ్చే సీజన్‌లో స్టార్క్ ఆడటం అనుమానమే!

 IPL 2019: KKR releases Mitchell Starc; his participation uncertain for the season

హైదరాబాద్: మోడ్రన్ డే క్రికెట్‌లో అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ ఒకడు. తన బౌలింగ్‌తో ప్రత్యర్ధి జట్టు బ్యాట్స్‌మెన్ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తాడు. అలాంటి మిచెల్ స్టార్క్ వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్ 2019 సీజన్‌లో ఆడటం అనుమానంగా మారింది.

న్యూ సౌత్ వేల్స్‌కు చెందిన మిచెల్ స్టార్క్‌ను పదో ఐపీఎల్ ఎడిషన్ కోసం గాను కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు రూ. 9.4 కోట్లకు కోనుగోలు చేసిన సంగతి తెలిసిందే. సాధారణంగా ఫాస్ట్ బౌలర్లు గాయాల బారిన పడుతుంటారు. అందుకు మిచెల్ స్టార్క్ కూడా అతీతం కాదు.

28 ఏళ్ల మిచెల్ స్టార్క్ గాయం కారణంగా ఈ ఏడాది మార్చిలో సఫారీ గడ్డపై దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టు నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ గాయం నుంచి కోలుకోవడంతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో చోటు దక్కించుకున్నాడు.

అబుదాబి టెస్టులో తిరగబెట్టిన స్టార్క్ గాయం

అబుదాబి టెస్టులో తిరగబెట్టిన స్టార్క్ గాయం

అయితే, అబుదాబి వేదికగా జరిగిన రెండో టెస్టులో మిచెల్ స్టార్క్ గాయం తిరగబెట్టడంతో... టెస్టు సిరిస్ ముగిసిన అనంతరం పాకిస్థాన్‌తో జరిగిన మూడు టీ20 సిరిస్‌ నుంచి తప్పుకున్నాడు. పాకిస్థాన్‌తో జరిగిన రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను పర్యాటక ఆస్ట్రేలియా జట్టు 1-0తో ఓడిపోయింది.

నవంబర్ 21 నుంచి భారత్-ఆస్ట్రేలియా మధ్య టీ20 సిరిస్

నవంబర్ 21 నుంచి భారత్-ఆస్ట్రేలియా మధ్య టీ20 సిరిస్

తాజాగా నవంబర్ 21 నుంచి భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ప్రారంభం కానున్న మూడు టీ20ల సిరిస్ నుంచి మిచెల్ స్టార్క్‌కు ఆసీస్ సెలక్టర్లు విశ్రాంతి కల్పించారు. ఈ మేరకు క్రికెట్ ఆస్ట్రేలియా టీమిండియాతో తలపడే జట్టుని ప్రకటించిన సమయంలో అధికారిక ప్రకటన చేశారు.

వచ్చే ఐపీఎల్‌లో మిచెల్ స్టార్క్ ఆడటం అనుమానమే

వచ్చే ఐపీఎల్‌లో మిచెల్ స్టార్క్ ఆడటం అనుమానమే

ఈ నేపథ్యంలో తరుచూ గాయలబారిన పడుతూ టీ20 సిరిస్‌లకు దూరమవుతోన్న మిచెల్ స్టార్క్‌ను వచ్చే ఐపీఎల్ సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫ్రాంచైజీ విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే గనుక జరిగితే వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్‌లో మిచెల్ స్టార్క్ ఆడటం అనుమానమే.

ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా ఆటగాళ్లు మే 1 వరకూ మాత్రమే

ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా ఆటగాళ్లు మే 1 వరకూ మాత్రమే

మరోవైపు వచ్చే ఏడాది మే 30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా వన్డే వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డులు తమ ఆటగాళ్లు మే 1 వరకూ మాత్రమే ఐపీఎల్ 2019 సీజన్‌లో అందుబాటులో ఉంటారని ఇప్పటికే బీసీసీఐకి తెలియజేశాయి. ఐపీఎల్ 2019 సీజన్ మార్చి 29న ఆరంభమై మే 19న ముగియనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Story first published: Wednesday, November 14, 2018, 12:56 [IST]
Other articles published on Nov 14, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X