చెన్నై మ్యాచ్ కోసం ఇంకా ఏం ప్లాన్ చేయలేదు: పృథ్వీ షా

IPL 2019 : Prithvi Shaw Says 'There Is No Plan On Chennai Super Kings' || Oneindia Telugu

చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగే క్వాలిఫైయర్‌-2 మ్యాచ్‌ కోసం ఇంకా ఏం ప్లాన్ చేయలేదు అని ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షా తెలిపారు. విశాఖ వేదికగా బుధవారం రాత్రి జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో పృథ్వీ షా (56; 38 బంతుల్లో 6×4, 2×6) అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

మ్యాచ్ అనంతరం పృథ్వీ షా మాట్లాడుతూ... 'సరైన సమయంలో అర్ధ సెంచరీ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఢిల్లీకి మంచి ఓపెనింగ్ భాగస్వామ్యాలు ఇచ్చి విజయాలు అందించేందుకు కృషి చేస్తా. నబీ బౌలింగ్‌కి వచ్చినపుడు అడ్వాంటేజ్ తీసుకోలేదు. స్పిన్నర్ల బౌలింగ్‌లో ఆచితూచి ఆడాలనుకున్నాం. స్పిన్ లో తక్కువ పరుగులు చేసినా.. ఆ పరుగులను ఫాస్ట్ బౌలింగ్‌లో కవర్ చేసుకోవచ్చు. ఒకవేళ స్పిన్ బౌలింగ్‌లో చెత్త బంతులు వస్తే మాత్రం బాదడానికి ప్రయత్నిస్తా' అని షా తెలిపాడు.

'గత మ్యాచ్‌లలో నేను పరుగులు అంతగా చేయలేదు. అయినా కూడా నాపై నమ్మకం ఉంచి అవకాశం ఇచ్చిన జాయమాన్యం, కోచ్, ఆటగాళ్లకు కృతజ్ఞతలు. మళ్లీ ఫామ్ అందుకోవాలంటే.. నా సహజమైన గేమ్ ఆడాలని నిర్ణయించుకున్నా. పంత్ బాగా బ్యాటింగ్ చేసాడు. జట్టుకు అవసరమైనప్పుడల్లా అతను పరుగులు చేస్తున్నాడు. చెన్నైతో మ్యాచ్ చాలా పెద్దది. ఆ మ్యాచ్ కోసం నేను ఇంకా ఏం ప్లాన్ చేయలేదు. జట్టుగా మాత్రం బలంగా సిద్ధం అవ్వాల్సిన అవసరం ఉంది' అని షా చెప్పుకొచ్చారు.

For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Thursday, May 9, 2019, 18:12 [IST]
Other articles published on May 9, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X