న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నామీద ఎంతో నమ్మకం ఉంచి అవకాశాలు ఇచ్చారు: షేన్‌ వాట్సన్‌

IPL 2019: I cant thank Stephen Fleming and MS Dhoni enough for their belief in me says Shane Watson

ఐపీఎల్‌ సీజన్‌-12 ప్రారంభం నుంచి వరుస మ్యాచుల్లో విఫలమైనా నామీద ఎంతో నమ్మకం ఉంచి చెన్నై యాజమాన్యం అవకాశాలు ఇచ్చింది అని చెన్నై సూపర్‌ కింగ్స్‌ డాషింగ్ ఓపెనర్ షేన్‌ వాట్సన్‌ అన్నారు. చెన్నై వేదికగా మంగళవారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై 6 వికెట్ల తేడాతో హైదరాబాద్‌పై జయభేరి మోగించింది. కీలక సమయంలో వాట్సన్‌ 96 (53 బంతుల్లో 9ఫోర్లు, 6 సిక్సర్లు) చెలరేగి చెన్నై జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు.

విఫలమైనా.. నమ్మకం ఉంచారు:

విఫలమైనా.. నమ్మకం ఉంచారు:

మ్యాచ్ అనంతరం చెన్నై ఓపెనర్ షేన్‌ వాట్సన్‌ మాట్లాడుతూ... 'నిజంగా చెపుతున్నా.. చెన్నై జట్టుకు నేను ఇంకా ఎన్నో పరుగులు బాకీ ఉన్నా. చెన్నై కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌, కెప్టెన్‌ ఎంఎస్ ధోనీలకు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. ఎందుకంటే... వరుస మ్యాచుల్లో విఫలమైనా వారు నా మీద నమ్మకం ఉంచారు. వేరే జట్టులో ఉంటే ఇన్ని అవకాశాలు వచ్చేవి కావని.. తనను ఎప్పుడో పక్కనపెట్టేవారు ' అని వాట్సన్‌ పేర్కొన్నారు.

జట్టుకు రుణపడి ఉంటా:

జట్టుకు రుణపడి ఉంటా:

'బీబీఎల్‌, పీఎస్‌లోనూ రాణించి పరుగులు చేసాను. ఐపీఎల్‌ సీజన్‌ ప్రారంభం నుంచి ఇబ్బందిపడ్డాను. చివరికి ఈ రోజు పరుగులు చేశాను. జట్టు నామీద నమ్మకం ఉంచింనందుకు రుణపడి ఉంటాను. ఇన్నింగ్స్ ఆరంభంలో భువనేశ్వర్ వైవిధ్య బంతులు వేసాడు. అతను మంచి బౌలర్. బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగల సమర్ధుడు' అని వాట్సన్‌ చెప్పుకొచ్చారు.

వాట్సన్‌ మెరుపు ఇన్నింగ్స్:

వాట్సన్‌ మెరుపు ఇన్నింగ్స్:

డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఐపీఎల్‌-12 సీజన్‌లో ప్లే ఆఫ్‌ బెర్త్‌ను ఖరారు చేసుకునట్టే. మంగళవారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై విజయాన్ని అందుకుంది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ 20 ఓవర్లలో 3 వికెట్లకు 175 పరుగులు చేసింది. మనీశ్‌ పాండే (49 బంతుల్లో 83 నాటౌట్‌; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), వార్నర్‌ (45 బంతుల్లో 57; 3 ఫోర్లు, 2 సిక్సర్లు)లు అర్ధ సెంచరీలు చేశారు. హర్భజన్‌ 2 వికెట్లు తీసాడు.

అనంతరం లక్ష్యఛేదనకు దిగిన చెన్నై సూపర్‌కింగ్స్‌ 19.5 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. వాట్సన్‌ (53 బంతుల్లో 96; 9 ఫోర్లు, 6 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. రైనా (24 బంతుల్లో 38; 6 ఫోర్లు, 1 సిక్స్‌) పర్వాలేదనిపించాడు. వాట్సన్‌కు 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' దక్కింది.

Story first published: Wednesday, April 24, 2019, 12:49 [IST]
Other articles published on Apr 24, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X