న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నేడు చెన్నైతో హైదరాబాద్‌ ఢీ.. హైదరాబాద్‌ నిలిచేనా?

IPL 2019 : Sunrisers Hyderabad VS Chennai Super Kings Match Preview || Oneindia Telugu
IPL 2019: Hyderabad vs Chennai match Today at Hyderabad

ఐపీఎల్ సీజన్-12లో ఇప్పటికే సగం మ్యాచ్‌లు పూర్తయ్యాయి. చెన్నై సూపర్‌ కింగ్స్‌ (14) ప్లే ఆఫ్‌కు చేరువలో ఉండగా.. ఢిల్లీ (10), పంజాబ్ (10), ముంబై (10) జట్లు ప్లే ఆఫ్‌ కోసం పోటీపడుతున్నాయి. ఇక కలకత్తా (8), హైదరాబాద్‌ (6) జట్లు పాయింట్ల పట్టికలో దిగువన ఉన్నా.. ప్లేఆఫ్‌ రేసులోనే ఉన్నాయి. మరో మ్యాచ్ ఆడితే రాజస్థాన్ (4), బెంగళూరు (2)ల జాతకాలు స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో ప్లేఆఫ్‌ కోసం పోటీపడుతున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పటిష్ట చెన్నై సూపర్‌ కింగ్స్‌తో బుధవారం ఉప్పల్ వేదికగా తలపడనుంది. చెన్నై వరుసగా నాలుగు మ్యాచ్‌లలో విజయం సాధించి ఊపుమీదుండగా.. వరుసగా మూడు పరాజయాలు ఎదుర్కొని హైదరాబాద్‌ నిరాశలో ఉంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలుపొంది పాయింట్లను మెరుగుపర్చుకోవాలని హైదరాబాద్‌ .. ఈ మ్యాచ్ నెగ్గి ప్లేఆఫ్‌ బెర్తు ఖరారు చేసుకోవాలని చెన్నై చూస్తున్నాయి. రాత్రి 8 గంటలకు మ్యాచ్ జరుగుతోంది.

చెన్నైకి ఎదురేలేదు:

చెన్నైకి ఎదురేలేదు:

ఆడిన 8 మ్యాచ్‌ల్లో 7 మ్యాచ్‌లలో నెగ్గిన చెన్నైకి ఈ ఐపీఎల్‌ సీజన్-12లో ఎదురేలేదు. ఓటమి అంచుల నుంచి కూడా మ్యాచ్‌లను గెలవడం చెన్నైకి కలిసొస్తోంది. చెన్నై బ్యాటింగ్‌, బౌలింగ్‌లోనూ చెలరేగుతూ ప్రత్యర్థులను హడలెత్తిస్తోంది. అయితే చెన్నై బ్యాట్స్‌మెన్‌ ఎవరూ కూడా ఇప్పటివరకు విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడలేదు, లీగ్ టాప్ స్కోరర్ జాబితాలో కూడా లేరు. ఒక్కొక్కరు ఒక్కో మ్యాచ్‌లలో పరుగులు చేయడం చెన్నై జట్టు విజయాలకు అసలు కారణం. వాట్సన్‌ (111 పరుగులు), జాదవ్‌ (135), రాయుడు (138), సురేశ్‌ రైనా (194) ఒక్కో మ్యాచ్‌లో ఆదుకున్నారు. అందరూ విఫలమయిన వేళ కెప్టెన్ ధోనీ (230) జట్టును ఆడుకుంటున్నాడు. అందరూ హిట్టర్ల్ కాబట్టి ఓ ఇద్దరు చెలరేగితే చెన్నై భారీ స్కోర్ చేసే అవకాశం ఉంది.

బ్యాటింగ్‌లో అందరూ తలో మ్యాచ్‌లో మెరువగా.. బౌలింగ్‌లో మాత్రం సమిష్టిగా రాణిస్తున్నారు. ముఖ్యంగా స్పిన్నర్ ఇమ్రాన్‌ తాహిర్‌ (13 వికెట్లు), పేసర్ దీపక్‌ చాహర్‌ (10)లు అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్నారు. ఇక హర్భజన్‌సింగ్‌, శార్దూల్‌ ఠాకూర్‌, శాంట్నర్‌, జడేజాలు కూడా రాణిస్తున్నారు. వీరిని ఎదుర్కోవడం సన్‌రైజర్స్‌ ఆటగాళ్లకు సవాలే.

మిడిలార్డర్‌ సమస్య:

మిడిలార్డర్‌ సమస్య:

సన్‌రైజర్స్‌ను మిడిలార్డర్‌ సమస్య వెంటాడుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్లు మంచి ఆరంభమే ఇచ్చినా.. ఇన్నింగ్స్ చివరలో కేవలం 10 పరుగుల వ్యవధిలో 7 వికెట్లు కోల్పోయి ఓటమిని చవిచూసింది. దీంతో సన్‌రైజర్స్‌ మిడిలార్డర్‌పై ఆందోళనగా ఉంది. ఆడిన 7 మ్యాచ్‌ల్లోనూ ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్‌ (400 పరుగులు), జానీ బెయిర్‌స్టో (304)లు మాత్రమే పరుగులు చేశారు. సన్‌రైజర్స్‌ మొత్తం ఈ జోడీపైనే ఆధారపడుతోంది. వీరు త్వరగా నిష్క్రమిస్తే అంతే సంగతులు. సన్‌రైజర్స్‌ మిడిలార్డర్‌ మనీష్‌ పాండే, విజయ్‌ శంకర్‌, యూసుఫ్‌ పఠాన్‌, దీపక్‌ హుడాలలో ఒక్కరు సరైన ఇన్నింగ్స్ ఇప్పటివరకు ఆడలేదు. జట్టులో మార్పులు చేసినా ఫలితం లేదు. ఈ నేపథ్యంలో మిడిలార్డర్‌ గాడిన పడాల్సిన అవసరం ఉంది.

అత్యుత్తమ బౌలింగ్‌ దళం ఉన్న సన్‌రైజర్స్‌ ఆశించిన స్థాయిలో రాణించలేదు. సన్‌రైజర్స్‌కు భువనేశ్వర్‌, రషీద్‌ఖాన్‌, ఖలీల్‌ అహ్మద్‌, సందీప్‌శర్మ, సిద్ధార్థ్‌ కౌల్‌ లాంటి టాప్ బౌలర్లు ఉన్నారు. అయితే బౌలర్లంతా సమష్టిగా రాణించిన మ్యాచ్ ఒక్కటీ లేదు. భువనేశ్వర్‌, రషీద్‌ఖాన్‌ పరుగులు నియంత్రిస్తున్నా.. వికెట్లు తీయలేకపోతున్నారు. ఇక ఖలీల్‌ అహ్మద్‌, సందీప్‌శర్మ, సిద్ధార్థ్‌ కౌల్‌ బౌలింగ్‌లో నిలకడ లేదు. కీలక మ్యాచ్ కాబట్టి అందరూ రాణించాల్సిన పరిస్థితి ఉంది.

జట్లు (అంచనా):

జట్లు (అంచనా):

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌:

డేవిడ్ వార్నర్‌, జానీ బెయిర్‌స్టో, కేన్ విలియమ్సన్‌ (కెప్టెన్‌), మనీష్‌ పాండే, విజయ్‌ శంకర్‌, దీపక్‌ హుడా, అభిషేక్‌ శర్మ, రషీద్‌ ఖాన్‌, భువనేశ్వర్‌ కుమార్, సందీప్‌ శర్మ, ఖలీల్‌ అహ్మద్‌.

చెన్నై సూపర్‌ కింగ్స్‌:

షేన్ వాట్సన్‌, ఫాఫ్ డుప్లెసిస్‌, సురేష్ రైనా, అంబటి రాయుడు, కేదార్ జాదవ్‌, ఎంఎస్ ధోనీ (కెప్టెన్‌), రవీంద్ర జడేజా, మిచెల్ శాంట్నర్‌/హర్భజన్ సింగ్, ఇమ్రాన్‌ తాహిర్‌, శార్దూల్‌ ఠాకూర్, దీపక్‌ చాహర్‌.

Story first published: Wednesday, April 17, 2019, 13:26 [IST]
Other articles published on Apr 17, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X