న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వయసు పెరిగేకొద్దీ వైన్‌లా ఆ ఇద్దరూ!: భజ్జీ, తాహిర్‌లపై ధోని ప్రశంసలు

IPL 2019 : MS Dhoni Says 'Tahir, Harbhajan Maturing Like Fine Wine' || Oneindia Telugu
IPL 2019: Harbhajan Singh and Imran Tahir are like wine as they are ageing, says MS Dhoni

హైదరాబాద్: ఐపీఎల్ 2019 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరుపున అద్భుత ప్రదర్శన చేస్తోన్న సీనియర్ స్పిన్నర్లు హర్భజన్ సింగ్, ఇమ్రాన్ తాహిర్‌లపై ఆ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ సీజన్‌లో సీఎస్‌కే ఐదో విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

కోల్‌కతా నిర్దేశించింన 109 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చెన్నై 17.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి చేధించింది. చెన్నై బ్యాట్స్‌‌మెన్లలో ఓపెనర్‌ డుప్లెసిస్‌ 45 బంతుల్లో43(3 ఫోర్లు) చివరి వరకు నాటౌట్‌గా నిలిచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. మరోవైపు అంబటి రాయుడు (21) ఫర్వాలేదనిపించాడు. షేన్‌ వాట్సన్‌ (17), సురేశ్‌ రైనా (14) త్వరగా ఔటయ్యారు.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా

అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 108 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో 3 వికెట్లు తీసిన సీఎస్‌కే పేసర్ దీపక్‌ చాహర్‌‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించగా... సీనియర్‌ స్పిన్నర్లు హర్భజన్‌, తాహిర్‌ రెండేసి వికెట్లు తీసి అతడికి అండగా నిలిచారు.

ధోని మాట్లాడుతూ

ధోని మాట్లాడుతూ

మ్యాచ్ అనంతరం కెప్టెన్‌ ధోని మాట్లాడుతూ ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే విజయానికి కారణమైన బౌలర్లపై ప్రశంసల వర్షం కురిపించాడు. వయస్సు గురించి పక్కన పెడితే వారిద్దరు వైన్‌లా రోజు రోజుకీ పరిణతి చెందుతున్నారని ధోని కొనియాడాడు. ప్రస్తుతం హర్భజన్ వయసు 39 ఏళ్లు కాగా, ఇమ్రాన్ తాహిర్ వయసు 40 ఏళ్లు.

త్యర్ధి జట్టు బ్యాట్స్‌మెన్‌కు ముప్పుతిప్పలు

త్యర్ధి జట్టు బ్యాట్స్‌మెన్‌కు ముప్పుతిప్పలు

వీరిద్దరూ తమ స్పిన్‌తో ప్రత్యర్ధి జట్టు బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఇక, చెపాక్ పిచ్ సైతం స్పిన్నర్లకు అనుకూలిస్తుండటంతో వీరిద్దరూ చెలరేగుతున్నారు. దీనిపై ధోని మాట్లాడుతూ "వయసుని పక్కన బెడితే... వారిద్దరు వైన్‌లా రోజు రోజుకీ పరిణతి చెందుతున్నారు. ఆడిన ప్రతీ మ్యాచ్‌లో భజ్జీ మెరుగ్గా రాణించాడు. తాహిర్‌ కూడా గొప్పగా ఆడుతున్నాడు" అని తెలిపాడు.

ప్రత్యర్థిని కట్టడి చేసేందుకు ప్రయత్నం

ప్రత్యర్థిని కట్టడి చేసేందుకు ప్రయత్నం

"నిజానికి మా బౌలర్లు ప్రతీ మ్యాచులో ప్రత్యర్థిని కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ ఫ్లాట్ వికెట్‌ ఉన్నపుడు బాగా ఆలోచించి కాంబినేషన్స్‌ సెట్‌ చేయాల్సి ఉంటుంది. తాహిర్‌ నన్ను పూర్తిగా నమ్ముతాడు. ఎక్కడ బంతి వేస్తే ఫలితం మెరుగ్గా ఉంటుందో చెప్పినపుడు తను తప్పకుండా అలాగే చేస్తాడు. తద్వారా చాలాసార్లు మంచి ఫలితాలు రాబట్టాం" అని ధోని పేర్కొన్నాడు.

పిచ్ చాలా స్లోగా

పిచ్ చాలా స్లోగా

ఈ సీజన్‌లో ఆరంభ మ్యాచ్‌లాగే ఈరోజు కూడా పిచ్‌ స్లోగా ఉందని, ఇలాంటి సమయాల్లో తక్కువ స్కోర్లకే పరిమితం కావాల్సి వస్తుందని ధోని అన్నాడు. గాయం కారణంగా జట్టుకు దూరమైన బ్రావో గురించి ధోని మాట్లాడుతూ "బ్రావోని మిస్సవడం వల్ల సరైన కాంబినేషన్లు సెట్‌ చేయలేకపోతున్నాం. బ్రావోతో పాటు డేవిడ్‌ విల్లీ కూడా జట్టుతో లేకపోవడం కాస్త ఇబ్బంది పెడుతుంది" అని చెప్పుకొచ్చాడు.

Story first published: Wednesday, April 10, 2019, 14:34 [IST]
Other articles published on Apr 10, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X