న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఎలిమినేటర్: ఫస్ట్ నాకౌట్ మ్యాచ్‌లో ఢిల్లీ విజయం సాధించేనా?

IPL 2019: ELIMINATOR - DC VS SRH, Delhi Capital look for a first-ever knockout win

హైదరాబాద్: ఏడేళ్ల తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. దీంతో టోర్నీలో భాగంగా బుధవారం విశాఖపట్నం వేదికగా జరగనున్న ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో తలపడనుంది. ఈ సీజన్‌లో మొత్తం 14 మ్యాచ్‌లాడిన ఢిల్లీ క్యాపిటల్స్ తొమ్మిది విజయాలతో 18 పాయింట్లు సాధించి పట్టికలో మూడో స్థానంలో నిలిచింది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

మరోవైపు సన్‌రైజర్స్ కేవలం ఆరు మ్యాచ్‌ల్లోనే విజయం సాధించి 12 పాయింట్లతో అదృష్టం కొద్దీ నాలుగో స్థానంలో నిలిచి ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. సన్‌రైజర్స్, కోల్‌కతా, పంజాబ్ జట్లు 12 పాయింట్లతో నిలిచినా హైదరాబాద్ మెరుగైన రన్‌రేట్‌తో ప్లేఆఫ్‌కు అర్హత సాధించడం విశేషం.

ఢిల్లీ క్యాపిటల్స్ పేరిట సరికొత్తగా

ఢిల్లీ క్యాపిటల్స్ పేరిట సరికొత్తగా

ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ పేరుతో మార్చుకుని సరికొత్తగా ఈ సీజన్‌ బరిలోకి దిగింది. ఈ సీజన్‌లో కొత్త కోచింగ్ స్టాఫ్‌తో పాటు యువ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ నాయకత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత ప్రదర్శనతో దూసుకెళ్తోంది. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌ని ఆడని జట్టు ఢిల్లీ మాత్రమే.

2012 సీజన్‌లో ప్లేఆఫ్స్ ఆడిన ఢిల్లీ

2012 సీజన్‌లో ప్లేఆఫ్స్ ఆడిన ఢిల్లీ

2012 సీజన్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ ప్లేఆఫ్స్ ఆడింది. ఇదే ఇప్పటివరకు ఆ జట్టు అత్యుత్తమ ప్రదర్శన. ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు సొంతగడ్డపై కంటే ప్రత్యర్ధి జట్టు మైదానాల్లో ఎక్కువ విజయాలను నమోదు చేయడం విశేషం. ఈ నేపథ్యంలో విశాఖపట్నం వేదికగా జరగనున్న ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఢిల్లీ పేవరేట్‌గా బరిలోకి దిగుతోంది.

విశాఖ స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఒకే ఒక్క మ్యాచ్

విశాఖ స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఒకే ఒక్క మ్యాచ్

విశాఖ స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఒకే ఒక్క మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ నెగ్గింది. ఇక, ఈ సీజన్‌లో ఈ రెండు జట్లు తలపడిన రెండు మ్యాచ్‌ల్లో ఒక మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ గెలవగా.. మరొక మ్యాచ్‌లో ఢిల్లీ విజయం సాధించి ప్రతీకారాన్ని తీర్చుకుంది. కాగా, ఈ మ్యాచ్‌లో ఎవరు నెగ్గితే ఆ జట్టు క్వాలిఫైయింగ్‌ మ్యాచ్‌కు అర్హత సాధిస్తుంది.

DC vs SRH మ్యాచ్ డిటేల్స్

DC vs SRH మ్యాచ్ డిటేల్స్

తేదీ: బుధవారం, 8 May 2019

సమయం: 7:30 PM IST

వేదిక: Dr. YS Rajasekhara Reddy Cricket Stadium, Visakhapatnam

లైవ్ టెలికాస్ట్: స్టార్ నెట్‌వర్క్

ఆన్‌లైన్ స్ట్రీమింగ్: హాట్ స్టార్

జట్ల వివరాలు

జట్ల వివరాలు

ఢిల్లీ క్యాపిటల్స్

పృథ్వీషా, శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, కొలిన్ ఇన్‌గ్రామ్, రూథర్‌ఫర్డ్, అక్షర పటేల్, కీమో పాల్, ట్రెంట్ బౌల్డ్, అమిత్ మిశ్రా, ఇషాంత్ శర్మ

సన్‌రైజర్స్ హైదరాబాద్

మార్టిన్ గుప్టిల్, సాహా, మనీష్ పాండే, విలియమ్సన్, విజయ్ శంకర్, యూసఫ్ పఠాన్, నబీ, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్, సందీప్ శర్మ

Story first published: Wednesday, May 8, 2019, 17:14 [IST]
Other articles published on May 8, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X