
కోల్‌కతా జట్టుని రెండుసార్లు ఐపీఎల్ టైటిల్ విజేతగా
గతంలో కోల్‌కతా జట్టుని రెండుసార్లు ఐపీఎల్ టైటిల్ విజేతగా నిలబెట్టడంతో పాటు టీ20ల్లో ఫామ్‌ను చూసి ఢిల్లీ ఫ్రాంఛైజీ గంభీర్‌ను జట్టు కెప్టెన్‌గా కూడా ప్రకటించింది. గత సీజన్‌లో గంభీర్‌పై ప్రాంఛైజీ ఎన్నో ఆశలు పెట్టుకోగా.. ఆ ఆశలను గంభీర్ వమ్ము చేశాడు. దీంతో సీజన్ మధ్యలోనే గంభీర్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించింది.

ఐపీఎల్ 2019 కోసం డిసెంబర్ నెలలో ఆటగాళ్ల వేలం
తాజాగా ఐపీఎల్ 12 కోసం డిసెంబర్ నెలలో ఆటగాళ్ల వేలం నిర్వహించనున్నారు. కాంట్రాక్ట్ పూర్తయిన ఆటగాళ్లతో పాటు నిరాశ పరిచిన వారిని ఫ్రాంచైజీలు వదులుకుంటున్నాయి. నవంబర్ 15లోగా ఫ్రాంచైజీలు తాము రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాను అందించాలని ఐపీఎల్ నిర్వాహకులు సూచించారు.

గంభీర్‌ను విడుదల చేయనున్న డేర్‌డెవిల్స్ ప్రాంఛైజీ
ఈ నేపథ్యంలో గంభీర్‌ను ఢిల్లీ డేర్‌డెవిల్స్ ప్రాంఛైజీ విడుదల చేయనుందంటూ ముంబై మిర్రర్‌లో వార్త వచ్చింది. గత సీజన్‌లో గంభీర్ అటు అభిమానులతో పాటు ఫ్రాంఛైజీని పూర్తిగా నిరాశపరిచిన సంగతి తెలిసిందే. గత సీజన్‌లో మొత్తం ఆరు మ్యాచ్‌లాడిన గంభీర్ కేవలం 85 పరుగులు చేశాడు.

పంజాబ్‌తో ఆడిన తొలి మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ
గత సీజన్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్.. పంజాబ్‌తో ఆడిన తొలి మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో రాణించిన గంభీర్ ఆ తర్వాత ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో కేవలం 30 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో గత సీజన్‌లో మొత్తం 6 మ్యాచ్‌లాడిన గంభీర్ చేసింది కేవలం 85 పరుగులు మాత్రమే. దీనిని బట్టి చూస్తే గంభీర్ యావరేజి 17.

గంభీర్‌ను తప్పించి శ్రేయాస్ అయ్యర్‌కు కెప్టెన్సీ పగ్గాలు
ఆ తర్వాత గంభీర్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించి అతడి స్థానంలో యువ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్‌కి ప్రాంఛైజీ పగ్గాలు అప్పగించింది. యువ క్రికెటర్లకి అవకాశమివ్వాలనే ఉద్దేశంతో తాను కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు గంభీర్ పేర్కొన్నాడు. ఆ తర్వాత ఢిల్లీ ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ గంభీర్‌ను రిజర్వ్ బెంచ్‌కే పరిమితం చేశారు.


Click it and Unblock the Notifications












