న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ 2019: సరికొత్తగా ఢిల్లీ డేర్‌డెవిల్స్.. లోగో, జట్టు పేరు మార్పు

IPL 2019: Delhi Daredevils change name to Delhi Capitals; Mohammad Kaif, Praveen Amre added to coaching staff

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2019 సీజన్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ సరికొత్తగా బరిలోకి దిగనుంది. ఇప్పటికే ఈ సీజన్‌కు సంబంధించిన వేలం డిసెంబర్ 18వ తేదీన జైపూర్‌లో నిర్వహించనున్నట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ వేలంలో మొత్తం 70 మంది క్రికెటర్లను పాలుపంచుకోనున్నారు.

ఇండియా vs ఆస్ట్రేలియా: ఆసీస్ జట్టులో బుల్లి క్రికెటర్, జెర్సీ వేసుకుని ప్రాక్టీస్ఇండియా vs ఆస్ట్రేలియా: ఆసీస్ జట్టులో బుల్లి క్రికెటర్, జెర్సీ వేసుకుని ప్రాక్టీస్

వీరిలో 50 మంది భారత క్రికెటర్లు కాగా 20 మంది విదేశీ క్రికెటర్లు. ఈ వేలంలో పాల్గొనే ఎనిమిది ఫ్రాంచైజీల వద్ద కలిపి రూ. 145.25 కోట్లు అందుబాటులో ఉన్నాయి. వచ్చే ఐపీఎల్ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని ఢిల్లీ డేర్ డెవిల్స్ ఫ్రాంచైజీ సరికొత్త నిర్ణయం తీసుకుంది.

ఢిల్లీకి కొత్త లోగో

ఢిల్లీకి కొత్త లోగో

తమ ఫ్రాంచైజీ పేరును, లోగోను మారుస్తున్నట్లు యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టును ‘ఢిల్లీ క్యాపిటల్స్‌'గా మారుస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఢిల్లీ తన అధికారిక ట్విట్టర్‌లో అధికారిక ప్రకటన చేసింది. మంగళవారం ఢిల్లీలో జరిగిన ఓ సమావేశంలో కొత్త పేరుతో ఉన్న ఫ్రాంచైజీ లోగోను ప్రాంచైజీ నిర్వాహకులు ఆవిష్కరించారు.

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో అనేక మార్పులు

ఈ ఏడాది ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. గత సీజన్ వేలంలో ఢిల్లీ గూటికి చేరిన గౌతమ్ గంభీర్ సీజన్‌లో జట్టు పరాజయాలకు భాద్యత వహిస్తూ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. అతడి స్థానంలో యువ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్‌కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించారు.

ఆటగాళ్ల బదిలీలో ఢిల్లీకి ధావన్

దీంతో పాటు ఆటగాళ్ల బదిలీలో భాగంగా ఈ ఏడాది సన్‌రైజర్స్ జట్టులో ఓపెనర్‌గా ఉన్న శిఖర్ ధావన్‌ను ఢిల్లీ ప్రాంఛైజీ సొంతం చేసుకుంది. అంతేకాదు టీమిండియా క్రికెటర్ మహమ్మద్ కైఫ్ ఢిల్లీ కోచింగ్ స్టాఫ్‌లో చేరాడు. తాజాగా ఫ్రాంచైజీ పేరును మారుస్తూ.. ఢిల్లీ యాజమాన్యం అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది.

ఢిల్లీ క్యాపిటల్స్ యజమాని కిరణ్ కుమార్ గాంధీ మాట్లాడుతూ

ఈ సందర్భంగా జీఎంఆర్ గ్రూప్ ఛైర్మన్, ఢిల్లీ క్యాపిటల్స్ యజమాని కిరణ్ కుమార్ గాంధీ మాట్లాడుతూ "ఇప్పటివరకూ తమ జట్టు ఎంతో యువ క్రికెటర్లను వెలుగులోకి తీసుకొచ్చిందని, వాళ్లంతా ఇప్పుడు జాతీయ స్థాయిలో గొప్ప ప్రదర్శన చేస్తున్నారు" అని అన్నారు. మరో యజమాని "పేరు మార్పుతో జట్టులో కొత్త ఉత్తేజం వచ్చిందని, తమ స్టాఫ్ యువకుల్లో ఉన్న టాలెంట్‌ని గుర్తించడంలో ఎప్పుడు ముందుంటారని, ఈ ఏడాది కైఫ్ కూడా చేరడంతో తమ జట్టుకు మరింత బలం చేకూరింది" అని పార్ధ్ జిందాల్ తెలిపారు.

Story first published: Tuesday, December 4, 2018, 18:43 [IST]
Other articles published on Dec 4, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X