న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చెపాక్‌లో ధోని హాఫ్ సెంచరీ: రాజస్థాన్ విజయ లక్ష్యం 176

Dhoni

హైదరాబాద్: సొంతమైదానంలో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రెచ్చిపోయాడు. చెపాక్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ జట్టుతో ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ధోని (75 నాటౌట్, 46 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సులు) హాఫ్ సెంచరీతో రాణించడంతో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఈ మ్యాచ్‌ ఆరంభంలోనే మూడు వికెట్లు చేజార్చుకున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టును రైనా, ధోనీ ఆదుకున్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 61 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. పిచ్ ఫాస్ట్ బౌలర్లకి అనుకూలిస్తుండటంతో వరుస ఓవర్లలో అంబటి రాయుడు (1), షేన్ వాట్సన్ (13), కేదార్ జాదవ్ (8) ఔటయ్యారు.

దీంతో 4.5 ఓవర్లు ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 27 పరుగులు చేసింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన ధోనీతో కలిసి సురేశ్ రైనా(36) ఇన్నింగ్స్‌‌ను చక్కదిద్దాడు. అయితే, ఉనద్కత్‌ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన బ్రావోతో కలిసి ధోనీ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు.

ఈ క్రమంలో ధోని హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ధోనికి ఐపీఎల్‌లో ఇది రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం విశేషం. 2018 ఐపీఎల్‌లో మొహాలి వేదికగా పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోని (44 బంతుల్లో 79 నాటౌట్)కి ఐపీఎల్‌లో అత్యధిక స్కోరు. చివరి ఓవర్‌లో ధోనీ మూడు సిక్సులు బాది తనదైన శైలిలో చెన్నై సూపర్ కింగ్స్‌కి ఫినిషింగ్ ఇచ్చాడు.

ఆఖరి ఓవర్‌ రెండో బంతిని జడేజా సిక్స్‌ కొట్టగా, మూడో బంతి వైడ్‌ అయ్యింది. అటు తర్వాత జడేజా సింగిల్‌ తీయగా, ధోని తనదైన శైలిలో రెచ్చిపోయాడు. ఆఖరి ఓవర్‌లో మొత్తంగా 28 పరుగులు వచ్చాయి. దాంతో సీఎస్‌కే నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా అర్చర్ రెండు, ధావల్ కులకర్ణి, బెన్ స్టోక్స్, ఉనాద్కత్ తలో వికెట్ తీసుకున్నారు.

అంతకముందు టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రహానే ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లాడిన చెన్నై జట్టు రెండు వరుస విజయాలతో జోరుమీదుంది. మరోవైపు కింగ్స్ ఎలెవన్ పంజాబ్, సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడిన రాజస్థాన్ ఈ మ్యాచ్‌లో ఒత్తిడితో బరిలోకి దిగుతోంది.

1
45768

జట్ల వివరాలు:
రాజస్థాన్ రాయల్స్: అజింక్య రహానె (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), సంజు శాంసన్, స్టీవ్‌స్మిత్, బెన్‌స్టోక్స్, రాహుల్ త్రిపాఠి, గౌతమ్, జోప్రా ఆర్చర్, జయదేవ్ ఉనద్కత్, శ్రేయాస్ గోపాల్, ధవళ్ కులకర్ణి

చెన్నై సూపర్ కింగ్స్: షేన్ వాట్సన్, అంబటి రాయుడు, సురేశ్ రైనా, కేదార్ జాదవ్, మహేంద్రసింగ్ ధోని (వికెట్ కీపర్, కెప్టెన్), డ్వేన్ బ్రావో, జడేజా, మిచెల్ శాంట్నర్, దీపర్ చాహర్, శార్ధూల్ ఠాకూర్, ఇమ్రాన్ తాహిర్

Story first published: Sunday, March 31, 2019, 22:42 [IST]
Other articles published on Mar 31, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X