ఆ ముగ్గురి నుండి ఎంతో నేర్చుకున్నా: శ్రేయస్‌ అయ్యర్‌

ఒక కెప్టెన్‌గా ఎంఎస్‌ ధోనీ, విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మల నుంచి ఎంతో నేర్చుకున్నా. ఆ ముగ్గురి ప్రభావం నాపై ఖచ్చితంగా ఉంటుంది అని ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్ శ్రేయస్‌ అయ్యర్‌ తెలిపారు. విశాఖ వేదికగా శుక్రవారం క్వాలిఫైయర్‌-2లో చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిన ఢిల్లీ టోర్నీ నుండి నిష్క్రమించింది. దీంతో ఒక్కసారి కూడా ఫైనల్‌ చేరుకోని జట్టుగా ఢిల్లీ నిలిచింది. మరోవైపు చెన్నై జట్టు ఎనిమిదోసారి ఐపీఎల్‌ ఫైనల్‌కు చేరింది.

ఆరంభం నిరాశపరిచింది:

ఆరంభం నిరాశపరిచింది:

మ్యాచ్‌ అనంతరం ఢిల్లీ కెప్టెన్ శ్రేయస్‌ అయ్యర్‌ మాట్లాడుతూ... 'మేము అనుకున్నంన్ని పరుగులు చేయలేకపోయాం. ఇన్నింగ్స్ ఆరంభం నిరాశపరిచింది. ముఖ్యంగా పవర్‌ప్లేలో మంచి ఆరంభం లభించలేదు. చెన్నై జట్టులో మంచి స్పిన్నర్లు ఉన్నారు.. వాళ్ల బౌలింగ్‌లో పరుగులు చేయడం చాలా కష్టం. ఈ పిచ్‌ మాకు సహకరిస్తుందని అనుకున్నాం. ఇక్కడ గతంలోనూ ఒక మ్యాచ్‌ ఆడాం. అయితే మా జట్టులో ఏ ఒక్కరూ బాధ్యతగా ఆడలేదు. భాగస్వామ్యాలు కూడా నెలకొల్పడంలో విఫలమయ్యాం' అని శ్రేయస్‌ తెలిపారు.

వారి పక్కన నిలబడటం అదృష్టం:

వారి పక్కన నిలబడటం అదృష్టం:

'ఈ సీజన్‌ నుంచి ఎంతో నేర్చుకున్నాం. సొంత పిచ్ అయిన కోట్లా కూడా మాకు అంతగా సహకరించలేదు. ఆ పిచ్‌పై చాలా ప్రాక్టీస్ అవసరం. మేము ప్రొఫషనల్ క్రికెటర్లం కాబట్టి పిచ్‌ను నిందించలేం. టాస్‌ వేసే సమయాల్లో ఎంఎస్‌ ధోనీ, విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మల పక్కన నిలబడటం అదృష్టంగా భావిస్తున్నా. వారు జట్లను నడిపించిన తీరు బాగుంది. వారిని చూసి కెప్టెన్‌గా ఎన్నో విషయాలు నేర్చుకున్నాను' అని శ్రేయస్‌ చెప్పుకొచ్చారు.

ఇది ఆరంభం మాత్రమే:

ఇది ఆరంభం మాత్రమే:

'జట్టు యాజమాన్యం కెప్టెన్‌గా నాకు అవకాశం ఇచ్చింది. గౌరవం, మద్దతు విషయంలో రాజీపడలేదు. దిల్లీ జట్టుతో ప్రయాణం బాగుంది. ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. ఇక్కడి వరకూ రావడానికి చాలా కష్టపడ్డాం. జట్టు ప్రదర్శనపై గర్వంగా ఉంది. ఈ సీజన్‌ మాకు ఎంతో ప్రత్యేకమైంది. ఇది ఆరంభం మాత్రమే.. మున్ముందు మరింత రాణిస్తాం' అని శ్రేయస్‌ పేర్కొన్నారు.

చెన్నై చెమక్:

చెన్నై చెమక్:

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. రిషభ్‌ పంత్‌ (25 బంతుల్లో 38; 2 ఫోర్లు, 1 సిక్స్‌) చెలరేగగా.. కొలిన్‌ మున్రో (24 బంతుల్లో 27; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. చెన్నై బౌలర్లలో బ్రేవో, జడేజా, హర్భజన్, దీపక్‌ చహర్‌ తలా రెండు వికెట్లు తీశారు. ఛేదనలో చెన్నై 19 ఓవర్లలో 4 వికెట్లకు 151 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు షేన్‌ వాట్సన్‌ (32 బంతుల్లో 50; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), డుప్లెసిస్‌ (39 బంతుల్లో 50; 7 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీలు చేశారు.

For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Saturday, May 11, 2019, 14:15 [IST]
Other articles published on May 11, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X