న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టికెట్ల ద్వారా వచ్చిన డబ్బంతా విరాళంగా: సీఎస్‌కే యాజమాన్యం కీలక నిర్ణయం

IPL 2019: CSK to donate the season-opener proceeds to families of Pulwama martyrs

హైదరాబాద్: పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన సీఆర్పీఎఫ్‌ జవాన్ల కుటుంబాలను ఆదుకునేందుకు ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం ముందుకొచ్చింది. గత నెలలో జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామా వద్ద జరిగిన ఉగ్రదాడిలో సుమారు 40కిపైగా సీఆర్ఫీఎఫ్ జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. ఈ కుటుంబాలను ఆదుకునేందుకు ఇప్పటికే పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చారు. తాజాగా, ధోని నాయకత్వంలోని చెన్నై సూపర్‌ కింగ్స్‌(సీఎస్కే) కూడా జవాన్ల కుటుంబాలకు తన వంతు సాయం చేయడానికి ముందుకు వచ్చింది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

తొలి మ్యాచ్ టికెట్ల ద్వారా వచ్చిన ఆదాయాన్ని

ఇందులో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ ఆడనున్న తొలి మ్యాచ్ టికెట్ల ద్వారా వచ్చిన ఆదాయాన్ని పుల్వామా దాడిలో వీరమరణం పొందిన జవాన్ల కుటుంబాలకు విరాళంగా ఇవ్వనున్నట్లు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) యాజమాన్యం అధికారిక ప్రకటన చేసింది. ధోనీ చేతుల మీదుగా చెక్‌ను అందిచనున్నట్లు సీఎస్కే డైరెక్టర్‌ రాకేశ్‌ సింగ్‌ తెలిపారు.

మార్చి 23న సీఎస్‌కే vs ఆర్సీబీ తొలి మ్యాచ్

మార్చి 23న సీఎస్‌కే vs ఆర్సీబీ తొలి మ్యాచ్

మార్చి 23న చెన్నై సూపర్ కింగ్స్-రాయల్ ఛాలెంజర్స్ జట్ల మధ్య జరిగే మొదటి మ్యాచ్‌తో ఐపీఎల్ 2019 సీజన్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ మ్యాచ్‌ టికెట్లను ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టిన మొదటి రోజే టికెట్లన్నీ అమ్ముడుపోయాయి.

పంజాబ్‌ విరాళం రూ. 25 లక్షలు

పంజాబ్‌ విరాళం రూ. 25 లక్షలు

పుల్వామా ఉగ్రదాడిలో వీరమరణం పొందిన జవాన్లలో పంజాబ్‌, హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన ఐదుగురు జవాన్లు ఉన్నారు. ఈ ఐదు కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున మొత్తం రూ. 25 లక్షలను విరాళంగా అందజేసింది. ఈ చెక్కులను ఉగ్రదాడిలో అమరులైన జవాన్లు జైమాల్‌ సింగ్‌, సుఖిజిందర్‌ సింగ్‌, మహిందర్‌ సింగ్‌, కుల్విందర్‌ సింగ్‌, తిలక్‌ రాజుల కుటుంబాలకు పంజాబ్‌ కెప్టెన్‌ అశ్విన్‌, సీఆర్పీఎఫ్‌ డీఐజీ వీకే కౌందాల్‌లు అందజేశారు.

బీసీసీఐ విరాళం రూ. 20 కోట్లు

బీసీసీఐ విరాళం రూ. 20 కోట్లు

బీసీసీఐ రూ. 20 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించింది. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో ఈసారి ఐపీఎల్ ప్రారంభోత్సవాన్ని రద్దు చేసి దానికయ్యే ఖర్చును సైన్యానికి ఇవ్వాలని అంతకముందే బీసీసీఐ నిర్ణయించిన సంగతి తెలిసిందే. గతేడాది ఐపీఎల్ ప్రారంభోత్సవ బడ్జెట్ సుమారు రూ. 15 కోట్లు. దానికి మరో రూ. 5 కోట్లు కలిపి ఇవ్వాలని బీసీసీఐ ప్రతిపాదించింది. మార్చి 23న జరిగే ఐపీఎల్-12 ప్రారంభోత్సవానికి త్రివి ధ (ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, నేవీ) దళాలలోని అత్యున్నత స్థాయి అధికారులను ఆహ్వానించి.. వారికి ఈ విరాళాన్ని అందజేయనుంది. సైనిక సంక్షేమ నిధికి రూ. 20 కోట్లు ఇచ్చేందుకు సీవోఏ అనుమతించింది.

Story first published: Thursday, March 21, 2019, 14:26 [IST]
Other articles published on Mar 21, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X